Live News Now
  • డ్రాగా ముగిసిన కోల్ కత్తా టెస్ట్.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్
  • ఫెర్రీ ప్రమాదంపై సీఎంకు డీజీపీ వివరణ.. దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆదేశం
  • మెట్రో భద్రతపై CMRS సంతృప్తి.. SR నగర్, మెట్టుగూడ రూట్‌కు గ్రీన్ సిగ్నల్
  • సనత్ నగర్ లో ఉద్రిక్తంగా మారిన ఇళ్ల కూల్చివేత.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నిర్వాసితులు
  • గోవాలో కలర్‌ఫుల్‌గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వారంలో పునాది.. డిసెంబర్ 15లోగా టెండర్లు.. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు సమీక్ష
  • అరెస్ట్ లతో ఉద్రిక్తంగా చలో అసెంబ్లీ.. గల్లీలో కాదు ఢిల్లీలో చేయాలన్న ఏపీ సీఎం
  • మాతృభాషను అమ్మలా కాపాడుకోవాలి.. ప్రపంచ తెలుగు మహాసభలపై సమీక్షలో కేసీఆర్
  • SRనగర్, మెట్టుగూడ రూట్ కు CMRS గ్రీన్ సిగ్నల్.. మరో 8 రోజుల్లో హైదరాబాద్ మెట్రో పరుగులు
  • డిసెంబర్ 4న నోటిఫికేషన్, 16న ఎన్నిక.. రాహుల్ చేతికి అధ్యక్ష పగ్గాలు లాంఛనమే
ScrollLogo రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీసిన బ్యాట్స్‌మెన్లు.. సెంచరీ మిస్‌ చేసుకున్న ధవన్‌ ScrollLogo రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు YCPకుట్ర.. జగన్ ను ప్రజలు క్షమించరన్న ఏపీ సీఎం ScrollLogo చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయమే.. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారన్న జగన్ ScrollLogo రెండో రోజు భర్త ఇంటి ఎదుట సంగీత న్యాయపోరాటం.. మద్దతు తెలిపిన మహిళా సంఘాలు ScrollLogo అఖండ జ్యోతితో దుర్గమ్మ మూలవిరాట్‌కు ముప్పు.. ఆలయానికి ప్రమాదం పొంచి ఉందంటున్న అర్చకులు ScrollLogo డిసెంబర్ 16న AICC అధ్యక్షుడి ఎన్నిక.. లాంఛనంగా పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ ScrollLogo నంది అవార్డులకు కులం రంగు పులమడం బాధాకరం.. జ్యూరీ నిర్ణయం మేరకే ప్రకటించామన్న చంద్రబాబు ScrollLogo ఏపీ అసెంబ్లీ పనిదినాలు 3 రోజులు పెంపు.. మరిన్ని ప్రజాసమస్యలు చర్చించేందుకు నిర్ణయం ScrollLogo టీవీ5 కథనాలతో దేవాదాయశాఖ ఎమర్జెన్సీ మీటింగ్.. దుర్గగుడి ఈవోని వివరణ కోరిన మంత్రి మాణిక్యాలరావు ScrollLogo లూథియానా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన భవనం, ఒకరి సజీవ దహనం

వెండితెరపై ఎగిరే జాతీయ పతాకం "ఘాజీ"

Ghazi-Review
Posted: 279 Days Ago
Views: 4642   

రివ్యూ: ఘాజీ
నటినటులు:రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, ఓం కార్, తాప్సీ త‌దిత‌ర‌లు
బ్యానర్: పివిపి, మాటినీ ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ: బిబో శ్రీనివాస్
ఎఫెక్ట్స్ : ఈవా మోషన్ స్టూడియోస్
సంగీతం: కృష్ణ కుమార్
మాటలు: గుణ్ణం గంగరాజు
నిర్మాతలు: వి.పొట్లూరి, అన్వేష్ రెడ్డి,
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
రిలీజ్ డేట్ : 2017 ఫిబ్రవరి 17

అన్నం పెట్టే రైతు మోహం తెలియదు.. ప్రాణం పెట్టి కాపాడే సైనికుడు పరిచయం ఉండడు.. ఏ దేశం అయినా సుభిక్షంగా, సురక్షంగా ఉండాలంటే వీరిద్దరూ తమ ధర్మాన్ని, అంతకంటే ఈ మట్టి మీద ఉన్న ప్రేమను వదలకూడదు. దేశభక్తిని అణువణువునా నింపుకున్న కొందరు సైనికులు తమ ప్రాణాలొడ్డి కాపాడిన ప్రాంతం విశాఖ పట్నం. ఈ పోరాటం వెనక ఉన్న కథే ఘాజీ. బాహుబలి, పింక్ సినిమాలు రానా, తాప్సీ లను బాలీవుడ్ కు దగ్గర చేసాయి. అందుకే ఘాజీ మార్కెట్ ను పెంచాయి. మరి నేషనల్ వైడ్ అటెన్షన్ ని డ్రా చేసిన ఘాజీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూద్దాం..

కథ:
1971 లో  పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో సృష్టిస్తున్న అరాచకాలకు భారత్ మద్దతు ఇవ్వదు. అందుకు అక్కడ తమ సైనికులకు ఆయుధాలను సరఫరా చేసేందుకు సముద్రమార్గాన్ని ఎంచుకుంటుంది. ఘాజీ అనే జలాంతర్గామి ద్వారా ఈ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి చేరాలి. మద్యలో భారత్ యుద్ద వాహాక నౌక ఐఎస్ ఎన్ విక్రాంత్ కాపాలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి బంగ్లాదేశ్ చేరాలి. లేదంటే భారత్ లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటైన విశాఖపై ఎటాక్ చేసి దాన్ని భారత్ మ్యాప్ లోంచి తొలిగించాలి. ఈ రెండు లక్ష్యాలతో బయలుదేరుతుంది ఘాజీ. అయితే ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న భారతీయ నేవీ జలాంతర్గామి ఎస్ 21 ని సముద్రంలోకి పంపుతుంది. కేవలం రెక్కీ నిర్వహించి సమాచారం పంపేందుకు మాత్రమే పంపబడిన ఈ జలాంతర్గామికి కమాండర్ రణవిజయ్ సింగ్ (కే కే మీనన్) ..శత్రువు ను చంపి దేశాన్ని కాపాడటం అతని స్వభావం.. మరో కమాండర్ అర్జున్ (రానా)..రూల్స్ ప్రకారం పనిచేసుకొని వెళ్ళే ఆఫీసర్ .. భిన్న స్వభావాలు కల వీరు ఎలా ఏకం అవుతారు.. కేవలం ఘాజీ ని గురించి సమాచారం తెలుసుకునేందుకే వచ్చిన ఎస్ 21, ఘాజీ తో పోరాటానికి దిగుతుంది. చాలా శక్తి వంతమైన ఈ సబ్ మైరన్ ఘాజీ ని ఆపే శక్తి , ఎస్ 21 కు లేదు. మరి ఘాజీ పై భారత్ నావీ దళాలు చేసిన పోరాటం ఎలా సాగింది..? అనేది మిగిలిన కథ..?

కథనం:
రానా ఘాజీ ప్రమోషన్స్ కోసం ఒక ఇంటర్యూ లో మాట్లాడుతూ.. సినిమా కంటే పెద్ద ఇమేజ్, కథ కంటే గొప్ప స్టార్ ఎవరుంటారు అన్నాడు. ఈ సినిమా ఆ మాటలకు ఈ సినిమా అర్ధం పట్టింది. రెండు బలమైన అంశాలు ఈ సినిమాకి గొప్పదనం తెచ్చాయి. చరిత్రను ఫాలో అయ్యేవారికి తప్ప తెలియని ఒక గొప్ప పోరాటాన్ని వెండితెరమీదకు తేవడం. రెండోది ఆ పోరాటం జలాంతర్గామి లో కావడం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ వీటిలో ఆర్మీ పోరాటాలే ఎక్కువుగా తెరమీదకొచ్చాయి. కానీ జలాంతర్గామి అనేది భారతీయ ప్రేక్షకులకు కొత్త విషయం. అందులోనూ దర్శకుడు కూడా కొత్తవాడు పెద్దగా ఆరితేరినట్లు కనపడడు. సినిమా గురించి చేసిన ప్రమోషన్స్ లో మాత్రమే ఈ కుర్రాడిలో చాలా విషయం ఉందనే విషయం అర్ధం అయ్యింది. కానీ సినిమా మొదలైన పదినిముషాల్లోనే జలాంతర్గామిలో ప్రేక్షకుల్ని కూర్చో బెట్టాడు దర్శకుడు. అక్కడి నుండి అక్కడ జరిగే ప్రతి చర్యకు రియాక్షన్ ప్రేక్షకులు ఇచ్చేంత కనెక్ట్ చేసాడు. కేకే మీనన్ పాత్ర ఒక కమాండర్ ఎలా ఉండాలో తెలిపింది. యుద్దం చేయడం అంటే తల్లి మీద చేయి వేయాలనుకన్న వాడి తలనరకడమే..అంతే గాని ఆదేశాల కోసం ఎదురు చూడటం కాదు అనే ఆక్యారెక్టర్ లో కేకే మీనన్ జీవించాడు. అతుల్ కులకర్ణి, సత్యదేవ్, భరత్ రెడ్డి, రవివర్మ వీరంతా తమ పాత్రలకు న్యాయం చేసారు. కేవలం ఘాజీ యొక్క కదలికలను, దాని తాలూకు సమాచారం తెలుసుకునేందుకు ఒక రెక్కీ ఆపరేషన్ కు వెళ్ళిన ఎస్ 21 జలాంతర్గామి ని యుద్దం వైపుకు తీసుకువెళ్తాడు కమాండర్ రణ్ విజయ్ సింగ్. అలా తీసుకెళ్ళేందుకు దర్శకుడు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి..‘‘శత్రువు ఆచూకీ దొరకలేదు అంటే శత్రువు లేడని అర్ధం కాదు’’ అనే బలమైన మాటలు కమాండర్ లక్షణాలను బలంగా తెలిపాయి. పాకిస్థాన్ తో యుద్దం అనగానే అవతలి వారిని మరీ తోలుమంద గలవారిగా చూపించడం పరిపాటి. కానీ ఘాజీ కెప్టెన్ గా నటించిన పాత్రధారి మాత్రం బలంగా ఉన్నాడు. ఘాజీ విసిరిన వలలో ఎస్ 21 చిక్కుకుంటుంది. అక్కడ నుండి కథ మరో మలపు తీసుకుంటుంది. ప్రతిక్షణం ఉత్కఠంగా సాగే ఈ పోరాటం అణువణువు దేశ భక్తిని నింపుకున్న నేవీ అధికారులు మనసుకు హత్తుకుంటారు. ఘాజీ విసిరే టార్పడోలను తప్పించుకునే ఎపిసోడ్ ఊపిరి బిగబట్టే విధంగా తీసాడు దర్శకుడు. సగం డ్యామేజ్ అయిన సబ్ మైరిన్ ఎదురుగా అత్యంత శక్తి వంతమైన ఘాజీ.. పోరాటం చాలా సంక్లిష్టం అయినా భారత నేవీ దళం చూపిన తెగువ ప్రతి భారతీయుడి మనసుని  గెలుస్తుంది. తాప్సీ రోల్ కి ఏమాత్రం ప్రాధాన్యం ఉండదు.. ఒక శరణార్దిగా జలాంతర్గామీలోకి అడుగు పెట్టిన ఆ పాత్ర బంగ్లాదేశ్ లో పాక్ చేస్తున్న అరచకాలను గుర్తు తెచ్చేందుకు మాత్రమే దర్శకుడు వాడుకున్నాడు. రానా ను కేకే మీనన్ పాత్ర చాలా వరకూ డామినేట్ చేసింది. సెకండాఫ్ లో రానా తన దైన నటనను ప్రదర్శించాడు. సముద్రం అడుగున చేస్తున్న ఈ పోరాటంలో విజువల్ ఎఫెక్ట్స్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఘాజీ ని  పేల్చే సన్నివేశం తేల్చేసాడని పించింది. అయినా ఘాజీ సినిమా చాలా అనుభూతులను మిగిల్చింది. సినిమా చూసిన ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కొంతకాలం వెంటాడుతూనే ఉంటుంది. సబ్ మైరిన్ సెట్ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కేవలం కథను మాత్రమే నమ్ముకొని సంకల్ప్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోవాలి.  బేబీ, పింక్ , ది వెన్సెడే వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెలుగులో రావేంటి అనే ప్రశ్నకు సమాధానం ఈ ఘాజీ. రానా అండ్ తాప్సీలు బాలీవుడ్ కి దగ్గరయినా వారే అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. ఎక్కడైనా ఆలోచనలు స్థాయిని డిసైడ్ చేస్తాయి.. సంకల్స్ రెడ్డి ఆలోచన ఇప్పుడు జాతీయ స్థాయిలో అతనికి ఒకస్థాయిని సృష్టించింది. వెండితెరపై ఎగిరే జాతీయ పతాకం ఘాజీ


చివరిగా:
జాతీయ గీతం విన్నా, ఘాజీ లాంటి సినిమాలు చూసినా.. కలిగే ఒకే ఒక భావన.. జైహింద్..
 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials