Posted: 432 Days Ago
Views: 5723
వివాదాస్పద వర్మ తాజాగా శశికళ మీద సినిమా రూపొందిస్తానని చెప్పాడు.. అమ్మ మరణం తర్వాత తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపద్యంలో వర్మ తన ట్విట్స్ కు పదును పెట్టాడు.. కాగా శశికళ పై సినిమా తీసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నాడు..
ఇందులో భాగమగా వర్మ దివంగత జయలలిత, శశికళ కు మధ్య ఉన్న బంధం లో అనేక షాకింగ్ నిజాలున్నాయని పొయెస్ గార్డెన్ లో పనివారు తనకు జయలలిత, శశికళ అనుబంధం గురించి షాకింగ్ విషయాలను తన సినిమా ద్వారా బయటపెడతానని చెప్పాడు.. అంతేకాదు.. తమిళనాడు రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్నాయని... " మన్నారు గుడి మాఫియా సభ్యుడు పళని స్వామి తమిళనాడు సీఏం అయితే డాన్ శశికళ జైలు నుంచి ప్రభుత్వం నడుపుతుందని వర్మ తనదైన శైలిలో విమర్శించాడు.. జయలలిత స్పూర్తి, తమిళనాడు దేవుళ్ళు, భక్తులు అంతా ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నిచాడు.. కాగా జయ, శశి కల అనుబంధం గురించి తెలియని నిజాలు ఏమిటో తెలియాలంటే.. మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే మరి..