Live News Now
  • శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...కాలినడక భక్తులకు 10 గంటలు సమయం
  • నేడు మూడోరోజు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా పర్యటన
  • ఉత్తరాఖండ్: డెహ్రాడూన్‌లోని ఓ షాపింగ్ మాల్ లో ఈడీ సోదాలు..
  • రూ.51 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం... ఫెమా చట్టం కింద షాపు యజమాని పై కేసు నమోదు
  • అమరావతి: ముఖ్యనాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. క్రమశిక్షణ రాహిత్యం పై చంద్రబాబు ఆగ్రహం
  • రేపు విజయవాడలో అమిత్ షా, చంద్రబాబు భేటీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో కలిసి వెళ్లనున్న అమిత్ షా, చంద్రబాబు
  • విజయవాడలో ఏపీ బీజేపీ సదస్సులో పాల్గొననున్న అమిత్ షా
  • అమిత్ షాకు లంచ్ ఆతిధ్యం ఇవ్వనున్న చంద్రబాబు
  • మహారాష్ట్ర: ఔరంగాబాద్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. కారు- లారీ ఢీ, ఏడుగురు మృతి
ScrollLogo ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం.. నదిలో బస్సు బోల్లా, 22 మంది మృతి.. 8 మందిని కాపాడిన రెస్క్యూటీం ScrollLogo ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్తుండగా ఘటన... మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తింపు ScrollLogo హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. 20 వాహనాలు సీజ్ ScrollLogo నేటి నుంచి టీఎస్ సెట్-2017 హాల్ టికెట్లు... జూన్ 11న పరీక్ష, 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ScrollLogo హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు.. పాల్గొననున్న చంద్రబాబు ScrollLogo విశాఖ: నేటి నుంచి ఆస్పత్రుల్లో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల విధానం.. ScrollLogo కేజీహెచ్ గైనిక్ వార్డులో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్న చంద్రబాబు ScrollLogo తిరుమల: నేడు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు నిరాకరణ ScrollLogo భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలను అనుమతించబోమన్న జేఈవో ScrollLogo తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు

యమన్ రివ్యూ: ఫర్ ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్

yaman-review
Posted: 89 Days Ago
Views: 593   

బిచ్చగాడు సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో డిమాండ్ పెరిగింది. బేతాళుడు ఆశించిన విజయం సాధించకపోయినా యమన్ తో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. పొలిటికల్ థ్రిల్లర్ తో వచ్చిన విజయ్ ఆంటోని ఎంత వరకూ అంచనాలను అందుకున్నాడో చూద్దాం...
కథ:
దేవరకొండ గాంధీ(విజయ్ ఆంటోని) కులాంతర వివాహాం చేసుకుంటాడు. అతని  భార్య తరపున వారు పెళ్ళని అంగీకరించరు . రాజకీయంగా ఎదిగాలనే కోరిక ఉన్న గాంధీ ని బాల అనే రాజకీయ ప్రత్యర్ధి చంపేసి దానిపై కులం రంగు పులుముతాడు.  ఆ బాధతో గాంధీ బార్య ఆత్మా హాత్య చేసుకుంటుంది. ఆ ఊళ్ళో బతకలేక గాంధీ తండ్రి మనవడుని తీసుకొని సిటీ కి వస్తాడు.  గాంధీ కొడుకు అశోక చక్రవర్తి తాత చికిత్స కోసం మరో దారి లేక చేయని యాక్సిడెంట్ కేస్ మీదేసుకొని జైలుకి వస్తాడు. ఆ కేసు విషయంలో తన సాంబ అనే రౌడీకి శత్రువవుతాడు. అక్కడి నుండి అశోక్ తనను తాను కాపాడుకుంటూ ఎదిగే క్రమంలో తండ్రిని చంపిన రాజకీయనాయకుడు బాలతో తలపడతాడు. తండ్రి హాత్య విషయం అశోక్ తెలుసుకుంటాడా..? రాజకీయ నాయకుడు గా ఎదిగేందుకు అశోక్ అవలంబించిన రాజనీతి ఎంటి..? 
కథనం:
సమాజంలో రాజకీయ శక్తిని మించిన శక్తి లేదు. ఆ విషయం ఎంత రియలిస్టిక్ గా చూపించవచ్చో ‘యమన్’ చూస్తే తెలుస్తుంది. ధర్మయోగి వంటి పొలిటికల్ థ్రిల్లర్ తర్వాత యమన్ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినా ‘యమన్’ నడిపించిన కథనం పూర్తిగా కొత్తగా ఉంది. పాత్ర తాలూకు పరిధులు ను దాటకుండా సినిమాను గ్రిప్పంగ్ నడిపించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో యమన్ దర్శకుడు జీవ శంకర్ సక్సెస్ అయ్యాడు. చాలా మామూలుగా మొదలైన కథ ప్రతి పదిహేను నిముషాలకు కొత్త టర్న్ తీసుకుంటుంది. హీరో తన పోరాడే ప్రత్యర్ధిని బట్టి స్థాయిని పెంచుకుంటూ వెళ్ళే విధానం చాలా బాగుంది. నకిలీ వంటి థ్రిల్లర్ ని తీసి మెప్పించిన జీవశంకర్ పొలిటికల్ థ్రిల్లర్ ని కూడా అదే స్థాయిలో నడిపాడు. విజయ్ ఆంటోని తన బలం కథే అని నమ్మడంలోని అతని సక్సెస్ ఫార్ములా తెలుస్తుంది. స్ర్ర్కీన్ పై నింపాదిగా కదిలే విజయ్ ఆంటోని ఈ సారి మాస్ పాటలతో యాక్టివ్ అయ్యాడు. తన పాత్ర పరిధులను దాటకుండా ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ప్రేక్షకుల అంచనాలకు అందకుండా కథను నడిపాడు. విజయ్ ఆంటోని తన లోని నటుడి పరిధులు ఖచ్చితంగా తెలుసు కాబట్టి  తను ఎంచుకునే కథలు పాత్రలు కూడా ఆ పరిధిలను అర్దం చేసుకున్నవే. అందుకే విజయ్ ఆంటోని ఆ పాత్రలలో సహాజంగా ఒదిగిపోయినట్లు అనిపిస్తుంది. యమన్ లో కూడా విజయ్ ఆంటోని తన పాత్రగా ప్రవర్తించాడు అనిపించింది
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్ అనిపిస్తుంది. మినిస్టర్ పిఎ ని ట్రాప్ చేసి అతనికి వ్యతిరేకంగా మార్చే సన్నివేశం చాలా బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. తనకు ఎదురు వచ్చే వారికి యముడిగా మారే హీరో కథ కదలికలలో నిదానం.. ఆలోచనలలో ఆవేశం కనపడుతుంది. త్యాగరాజన్ రోల్ బాగుంది. బాషశ్రీ మాటలు సన్నివేశాలకు బలంగా మారాయి. ‘‘ రక్త మరక అంటకుండా నాయకుడు కాలేడు.. రక్తం చిందించకుండా రాజకీయ నాయకుడు అవలేడు’’ వంటి మాటలు కథ బ్యాక్ డ్రాప్ ఎలివేట్ చేసాయి.  విజయ్ ఆంటోని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కనపడకుండా కత్తులతో వేటాడి.. తెల్లారి వచ్చి శవం పై పూలదండలు వేసే రాజకీయం లోని లోతులను యమన్ లో ప్రభావంతంగా కనిపించాయి. హీరోయిన్ మియా జార్జి పాత్ర సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే హీరోయిన్స్  రియల్ కష్టాలను రియలిస్టిక్ గా చూపించారు. సినిమా లో పాటలు మైనస్.  కౌన్సిలర్ పాత్ర నిడివి తగ్గించినా సినిమాకి వచ్చిన ఇబ్బందిలేదనిపించింది.  ఒక హీరోయిన్ కి ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని ఒక మామూలు బిజినెస్ మాన్ కి మద్య నడిచే ప్రేమకథ లో ఎలాంటి డ్రామా లేకుండా నడిపాడు దర్శకుడు.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ వచ్చిన యమన్ విజయ్ ఆంటోని ఖాతాలోసక్సెస్ పుల్ సినిమాగా నిలిచిపోతుంది.
చివరిగా:
ఫర్ ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials