Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

విన్నర్ రివ్యూ: సారీ.. లూజర్

winner-movie-review
Posted: 240 Days Ago
Views: 9568   

రివ్యూ : విన్నర్ 
తారాగణం : సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, అలీ, వెన్నెల కిశోర్, ఠాకూర్ అనూప్ సింగ్, పృథ్వీరాజ్, రఘుబాబు, ముఖేష్ రుషి తదితరులు
ఎడిటింగ్ :  ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : చోటా కె నాయుడు
సంగీతం : ఎస్ఎస్ థమన్
నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
దర్శకత్వం : గోపీచంద్ మలినేని 
రిలీజ్ డేట్ : 24.02.17 

కొన్ని కాంబినేషన్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. ఇక ఆ కాంబినేషన్ లో ఉన్న వాళ్లు ఆల్రెడీ దెబ్బతిని ఉంటే ఖచ్చితంగా హిట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చాడు సాయిధరమ్ తేజ్. ఆ మధ్య హ్యాట్రిక్ హిట్స్ కొట్టినా ఒక్క తిక్కతో ఆ లెక్కలు మర్చిపోయేలా చేసిన తేజూ.. పండగచేస్కో అంటూ టార్చర్ చేసిన గోపీచంద్ మలినేనితో కలిసి విన్నర్ గా వస్తున్నాడంటే విక్టరీ ఖాయం అనుకున్నారు. మరి ఈ విన్నర్ విక్టరీ సాధించాడా లేదా అనేది చూద్దాం.. 


కథ
సిద్ధార్థ్( సాయిధరమ్ తేజ్)కు తండ్రి(జగపతిబాబు) అంటే చాలా ఇష్టం.. కానీ చిన్నతనంలోనే సిద్ధార్థ్ తాత వల్ల తండ్రిని అపార్థం చేసుకుని ఇళ్లు వదిలి పారిపోతాడు.. ఓ దిన పత్రికలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తుంటాడు. ఆ క్రమంలో సితార(రకుల్) ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. సితార మాత్రం అథ్లెట్ కావాలని ప్రయత్నిస్తూ ఇతని లవ్ ను రిజెక్ట్ చేస్తుంది. అయినా వెంటపడుతూ ఆమె ఎయిమ్ కే భంగం కలిగేలా ప్రవర్తిస్తాడు సిద్ధూ. దీంతో సితారకు సడెన్ గా పెళ్లి ఫిక్స్ చేస్తాడు ఆమె తండ్రి. దీంతో తన పొరబాటు దిద్దుకోవడానికి వెళ్లిన సిద్ధూను అనూహ్యంగా రేస్ కోర్స్ లో టాప్ రేసర్ అని ఇరికిస్తుందామె.. అదే సమయంలో ఆ పెళ్లికి తన తండ్రి కూడా రావడంతో సిద్ధూ షాక్ తింటాడు.. అక్కడ తన ప్లేస్ లో మరో వ్యక్తి ఉండటంతో ఇక ఈ ఫ్యామిలీ రిపేర్ మొదలుపెడతాడు సిద్ధూ. మరి ఈ రిపేర్ లో అతను ఎన్ని ప్లాన్స్ వేశాడు. తన ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎవరు..? ఎందుకు అలా నటిస్తున్నాడు..? తానే ఆ ఫ్యామిలీకి వారసుడిని అని ఎలా నిరూపించుకున్నాడు అనేది మిగతా కథ.. 
విశ్లేషణ :
కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి.. అసలు వీళ్లు సరిగ్గా కథ విన్నారా లేదా..? లేక చెప్పిన కథ, తీసిన వేర్వేరా. అని.. విన్నర్ చూస్తుంటే అచ్చంగా ఇలాంటి డౌట్సే వస్తాయి. పేరెంట్స్ తోనో లేక ఇంకెవరితోనో గొడవపెట్టుకుని చిన్నప్పుడే ఇళ్లు వదిలిపారిపోయే హీరో. తర్వాత ‘ఎలా’ క్వశ్చన్ కు ఛాన్స్ లేకుండా బాగా సెటిల్ కావడం.. అటుపై హీరోయిన్నూ.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఆమె రిజెక్ట్ చేయడం.. మనోడు ఇరిటేట్ చేయడం.. ఆనక ఏదో ఒక ఛాలెంజ్ తో హీరోకు ఎయిమ్ గుర్తుకు రావడం.. అప్పుడు సింపతీతో మొదలై సిల్లీగా మళ్లీ ప్రేమలో పడే హీరోయిన్నూ.. ఈ మాటలు చదువుతుంటే ఎన్ని సినిమాలు గుర్తొస్తున్నాయో తెలియదు కానీ.. అన్ని సినిమాలనూ కలిపిన కిచిడీ విన్నర్. ఆ కిచిడీ అయినా ఆసక్తిగా ఉందా అంటే అస్సల్లేదు. ఏమాత్రం కొత్తదనం లేని సన్నివేశాలు.. ప్రేక్షకుడికి ఊహకు పదును పెట్టే సీన్స్ లాంటివి ఒక్కటి కూడా కనిపించదు. సినిమా మొదలైన దగ్గర్నుంచీ ఎండింగ్ వరకూ ఏ కామన్ ఆడియన్ అయినా నెక్ట్స్ ఏం జరగుతుందో ఈజీగా ఊహించేయగలడు.. అంత పరమరొటీన్ సినిమా విన్నర్. 
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలానే వచ్చాయి. అవన్నీ నేటివిటీకి కానీ లేదంటే మనకు ఎంతో కొంత తెలిసినవి కానీ కావడంతో చాలా తొందరగానే కనెక్ట్ అయ్యాం.. కానీ ఇక్కడ హార్స్ రేస్ అంటూ అదేదో అద్భుతమైన గేమ్ గా.. ఇదే తమ సినిమాలో అత్యంత కొత్త పాయింట్ గా ఫీలయినట్టున్నారు. కానీ అదే బెడిసికొట్టింది.. హార్స్ రేస్ అనేది ఏ మాత్రం ఆకట్టుకోకపోగా.. కేవలం ఒక్క పాటలో రైడింగ్ నేర్చుకునే హీరో అదెలాగూ గెలుస్తాడనుకునే ప్రేక్షకుడికీ మధ్య విన్నర్ లూజర్ గా మిగిలిపోయాడు.. ఎంచుకున్న కథలో కొత్తదనం లేనప్పుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి.. ఆ విషయంలో దర్శకుడు గోపీచింద్ మలినేనికి పడే మార్కులు సున్నా.. నటనలో మేనమామల్ని ఇమిటేట్ చేయాలా.. రవితేజను అనుకరించాలా అనే కన్ఫ్యూజన్ లో ఏ ఎక్స్ ప్రెషన్ పెడుతున్నామో తెలియని ఫేస్ తో సాయిధరమ్ తేజ్. అరవ హీరోయిన్ లా అన్నిటికీ అతి చేసిన రకుల్.. పాత్ర బావున్నా తన స్థాయిది కాకపోవడంతో ఏమీ చేయలేకపోయినా జగపతిబాబు.. అలాగే ఆడవారి పేరుతో ఆకట్టుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నించిన వెన్నెల కిశోర్ విఫలయత్నం.. సింగం సుజాతగా రొటీన్ కామెడీతో పృథ్వీరాజ్... ల మధ్య అలీ కొంత ఫర్వాలేనిపిస్తాడు. ఇక విలన్ గా చేసిన అనూప్ సింగ్ ఠాకూర్ ది ఏ మాత్రం కొత్త పాత్ర కాదు. ముఖేష్ రుషి అలా ఎందుకు ప్రవర్తిస్తాడో దర్శకుడైనా అర్థమైందో లేదో తెలియదు. ఇతర పాత్రలు చాలానే ఉన్నా వేటికీ పెద్దగా ప్రాధాన్యం ఉండదు.. ఇలా ఏ దశలోనూ ఆకట్టుకోని కథనంతో విన్నర్ ఆరంభం నుంచి ఆఖరు వరకూ విసిగిస్తూనే ఉంటాడు. 
అన్నీ చూసిన వాడు కాబట్టే .. ఇంతోటి కథకు నేను మళ్లీ కొత్తగా కొట్టాలా అని ఫీలయినట్టున్న థమన్ సంగీతం.. రెండు పాటలు మినహా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.. చోటా కె నాయుడు పనితనం బానే ఉన్నా.. కొన్ని పాటల్లో తేలిపోతుంది.. ఎడిటింగ్ కు సంబంధించి చాలా సన్నివేశాలు అవసరమా అనిపిస్తుంది.. తేజూ మేకోవర్ బావుంది.. అనసూయ ఐటమ్ సాంగ్ వెరీ రొటీన్.. కాస్ట్యూమ్స్ బావున్నాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నా.. మొత్తంగా ప్రొడక్ట్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.. 

ప్లస్ పాయింట్స్
ఎంత ఆలోచించినా అబ్బా అనిపించినవి తట్టడం లేదు

మైనస్ పాయింట్స్
ఇక మీరే ఊహించుకోండి

ఫైనల్ గా :  సారీ.. లూజర్ 

రేటింగ్ : 1/5


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials