Live News Now
  • దక్షిణాదిలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖద్వారం.. తెలంగాణ అభివృద్ధికి మోడి సర్కార్ కట్టుబడిఉంది
  • ఢిల్లీ: కవ్వింపుల పాక్ కు గుణపాఠం విరుచుకుపడ్డ భారత సైన్యం
  • ముంబై: దిగివచ్చిన పసిడి ధర రూ.28,915 పలికిన 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం
  • రూ.315 పెరిగి రూ.39,815కి చేరిన కిలో వెండి
  • ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆప్ఘాన్ సైనిక శిబిరం పై ముష్కరుల దాడి..
  • 10 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు
  • బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ పై సీబీఐ చార్జిషీటు..
  • జిందాల్‌తో పాటు మరో నలుగురికి సమన్లు జారీ..
  • సెప్టెంబర్ 4న విచారణకు హాజరుకావాలని సమన్లు
  • అమరావతి: జూన్ 2 నుంచి ఏపీలో మూడో విడత నవనిర్మాణ దీక్ష.. దీక్షలో పాల్గొననున్న చంద్రబాబు
ScrollLogo పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరైన జగన్ ScrollLogo ఢిల్లీ: కేజ్రీవాల్ పై రెండో పరువు నష్టం దావా వేసిన జైట్లీ... రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జైట్లీ ScrollLogo కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. జూలై 26న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ScrollLogo విజయవాడలో ఈ నెల 25న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం.. ScrollLogo సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం: కంభంపాటి హరిబాబు ScrollLogo కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు ScrollLogo రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ మినీ మహానాడు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎల్.రమణ ScrollLogo మినీ మహానాడుకు చంద్రబాబు హాజరవుతారు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ScrollLogo కడప: వైఎస్ రాజారెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన వైఎస్ జగన్ ScrollLogo నల్గొండ: 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: అమిత్ షా

రివ్యూ:'ద్వారక' మంచి సినిమా చూశామనే ఫీలింగ్

Review:Vijay-devarakonda-starer-'Dwaraka'-movie-review
Posted: 81 Days Ago
Views: 458   

రివ్యూ : ద్వారక
తారాగరణం : విజయ్ దేవరకొండ, పూజా ఝవేరీ, పృథ్వీరాజ్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, ‘బాహుబలి’ ప్రభాకర్, శకలక శంకర్ తదితరులు.. 
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు
దర్శకత్వం : శ్రీనివాస్ రవింద్ర
రిలీజ్ డేట్ : 03.03.17


టాలీవుడ్ లో ఈ మధ్య కొత్తగా వస్తోన్న దర్శకులు సరికొత్త కథలతో వస్తున్నారు. కథనం విషయంలోనూ ఆకట్టుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్స్ కంటే కొత్త దర్శకుడి సినిమా అనేదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుతోంది. అఫ్ కోర్స్ ఈ కోవలోనూ కొందరు రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తున్నారనుకోండి. మరి పెళ్లిచూపులుతో సడెన్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ హీరోగా... శ్రీనివాస్ రవీంద్ర అనే కొత్త దర్శకుడు చేసిన ద్వారక ఏ కోవకు చెందిన సినిమానో ఇప్పుడు చూద్దాం.. 

కథ : 
ఎర్ర శ్రీను(విజయ్ దేవరకొండ) ఓ దొంగ. తన ఫ్రెండ్స్ తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. ఓ సారి గుడిలో శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని చోరీ చేయడానికి వెళ్తాడు. అదే గుళ్లో పెళ్లి కావడం లేదని రాత్రి జాగారం చేస్తారు వసుధ(పూజా)అండ్ ఫ్యామిలీ. విగ్రహం ఎత్తుకుపోతూ వసుధను చూసిన శ్రీను.. తొలి చూపులోనే తొలి ముద్దుపెట్టేస్తాడు. కానీ ఆ చీకట్లో హీరోయిన్ అతన్ని గుర్తుపట్టదు. ఇంతలో అందరూ నిద్రలేవడంతో అక్కడి నుంచి పారిపోతూ ‘ద్వారక’ అనే అపార్ట్ మెంట్ లో దాక్కుంటాడు. అక్కడి నుంచి అతని జీవితమే మారిపోతుంది. తెల్లవారే సరికి అతన్ని బాబాగా మార్చివేస్తాడు ఆ అపార్ట్ మెంట్ బిల్డర్.. అలా రాత్రికిరాత్రే పారిపోయే వీలు లేక బాబాగా స్థిరపడిపోతాడు శ్రీను.. అయితే అతన్ని అడ్డుపెట్టుకుని.. కోట్లు కొల్లగొట్టేందుకు ఓ క్రిమినల్ లాయర్, ఎస్సైతో పాటు మంత్రి కూడా ప్లాన్ వేస్తారు. మరోవైపు తను ప్రేమించిన అమ్మాయి కూడా దోష నివారణ కోసం బాబా వద్దకే వస్తారు. అదే టైమ్ లో ఐఎఎస్ పోస్ట్ కు రిజైన్ చేసిన హేతువాది చైతన్య ఇలాంటి దొంగబాబాల గుట్టు రట్టు చేస్తుంటాడు. మరి ఈ ముగ్గురి మధ్యా చిక్కిన ఈ ఎర్రశ్రీను అలియాస్ బాబా పరిస్థితి ఏంటీ..? అతను ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు.. తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.. 

కథనం: 
ద్వారక.. ట్రైలర్ చూస్తే ఇదో రొటీన్ సినిమానే అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే కానీ దర్శకుడు ఈ కథను ఎంత తెలివిగా డీల్ చేశాడో అర్థం కాదు. ప్రస్తుతం సమాజంలో విపరీత ధోరణులతో పోతోన్న బాబాల సంస్కృతిపై సెటైరికల్ గా సాగే ఈ సినిమా ఎక్కడా అవాస్తంగా అనిపించదు. బలహీనతలను స్వార్థపరులు ఎలా క్యాష్ చేసుకుంటారు. సమాజాన్ని జాగృతం చేయాల్సిన మీడియా.. ఇలాంటి బాబాలకు ఎలా వంత పాడుతూ ప్రచారం కల్పిస్తుంది అనే సెన్సిటివ్ ఇష్యూస్ ను చాలా క్లెవర్ గా డీల్ చేశాడు దర్శకుడు. అతిశయోక్తులు లేకుండానే దొంగబాబాల యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నంలో మాగ్జిమం సక్సస్ అయ్యాడు. ఇలాంటి బాబాలకు స్వార్థపూరిత వందిమాగధులు... వంతపాటలగాళ్లు ఎంత ప్రచారం చేస్తారో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక బాబా అనగానే భక్తి భావం కంటే.. మన ప్రాబ్లమ్స్ పోగొట్టే తారకమంత్రంగా ఫీలయ్యే జనాల్ని ఎలా దోచుకుంటారనేది చెప్పడంలో విమర్శలకు తావు లేకుండా చూపించారు.. ‘‘దేవుడు అనేది నమ్మకం మాత్రమే.. మనం గుర్తించగలిగితే మనిషిలోనే దేవుడు ఉన్నాడు’’ అని చెప్పడమే ఈ ద్వారక ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని కన్విన్సింగ్ చెప్పడంలో కొంత తడబడ్డా వారి ఉద్దేశ్యం మాత్రం ప్రేక్షకులకు సులభంగానే అర్థమౌతుంది. ఒక బాబా ఎదిగే క్రమం ఎలా ఉంటుంది. అతనికి పేరొస్తున్నా కొద్దీ అతని చుట్టూ ఎలాంటి వారు చేరతారు.. దేవుడిని అడ్డుపెట్టుకుని.. నల్లధనం దాయడం నుంచి పోగేయడం వరకూ వారు చేసే కార్యకలాపాలు కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఇదే సమయంలో హీరో తన ప్రేమ ను హీరోయిన్ కు తెలియజేయడ.. ఆమె అతన్ని ముందు నుంచీ నమ్మకపోవడంతో రిజెక్ట్ చేయడం.. ఆమె కోసం అతను తానో దొంగనని బలవంతపు బాబానని మీడియాకు చెప్పేయడంతో కథ రసకందాయంలో పడుతుంది. ఇప్పటి వరకూ ఫస్ట్ హాఫ్ గా కొంత స్లో నెరేషన్ అనిపించినా ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి స్పీడందుకుంటుంది. ఇదే సమయంలో బాబాల గుట్టు రట్టు చేసే మురళీశర్మ పాత్ర ఎంట్రీ వెరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ పాత్ర వచ్చిన ప్రతిసారీ సీన్స్ బాగా పండాయి. ప్రేమకోసం అప్పనంగా వస్తున్న వందల కోట్లనూ వదులుకునేందుకు సిద్ధపడ్డ శ్రీనును పాత్రపై మనకూ ప్రేమ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ ఊహించేదే అయినా.. మురళీశర్మ పాత్ర చనిపోవడం.. ప్రీ క్లైమాక్స్ లో ప్రకాష్ పాత్ర ఎంట్రీతో మళ్లీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.. నిజానికి ప్రకాష్ రాజ్ పాత్రను ట్విస్ట్ చేసిన విధానం సూపర్.. ఆ పాత్రలో ఆ ట్విస్ట్ లేకపోతే క్లైమాక్స్ చప్పగానే ఉండేది.. మొత్తంగా బాబాలను నమ్మే జనం ఎలా మోసపోతున్నారు.. అలాంటి బాబాలకు చందాలిస్తూ వ్యాపారవేత్తలు పన్నులు ఎలా ఎగ్గొడతారు.. స్వార్థపరుల చేతుల్లో బాబాల బతుకులు ఎలా ఉంటాయి.. బాబాలంతా ఆల్మస్ట్ ఫేకే అనే నిర్ధారణకు వచ్చేంతగా చెప్పడంలో దర్శకుడు డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడనే చెప్పాలి.. పనిలో పనిగా మీడియాపై వేసిన సెటైర్స్ హండ్రెడ్ కు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తాయి.. అయితే ఫస్ట్ హాఫ్ లో కథ మొదలయ్యే విధానం మామూలుగానే ఉంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ఇక కామెడీకూడా పెద్దగా పండలేదనే చెప్పాలి.. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా ఎక్స్ పెక్టేషన్స్ ను దాటి వెళ్లని కథనం కాస్త మైనస్ గా అనిపిస్తుంది... 
సినిమాకు సంబంధించి దర్శకుడి తెలివి ఆర్టిస్టుల ఎంపికలోనే తెలిసిపోతుంది..(ఒక్క హీరోయిన్ విషయంలోతప్ప). ముఖ్యంగా ఈ మధ్య తెలుగు తెరకు ‘నయాబకరా’గా మారిన పృథ్వీరాజ్ పాత్ర సినిమాకు పెద్ద రిలీఫ్. అలాగే విజయ్ దేవరకొండ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. మురళీశర్మ మరోసారి అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. రఘుబాబు, ప్రభాకర్ తమ పాత్రల మేరకు చేసుకుపోయారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రకాష్ రాజ్ నటన..సినిమా ఔచిత్యాన్ని మరో మెట్టుపైన నిలిపింది. హీరోయిన్ విషయంలో ఇంకొంచెం బెటర్ చాయిస్ తీసుకోవాల్సింది..పాటల చిత్రీకరణ చాలాబావుంది. సాహిత్యం కూడా బావుంది. ముఖ్యంగా భజరే నందగోపాలా, ఎంత చిత్రం పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది.. సంగీతం బావుంది. మూడు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కథలో మిళితంగా సాగినా చాలాసార్లు ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. మాటలూ బావున్నాయి. మొత్తంగా  పరిమిత లొకేషన్స్ లోనే చిత్రీకరించిన ద్వారకలో నిర్మాణ విలువలు కూడా రిచ్ గానే ఉన్నాయి.. 

ప్లస్ పాయింట్స్ : 
కథ
స్క్రీప్ ప్లే
దర్శకత్వం
సినిమాటోగ్రఫీ
ఆర్టిస్టులు
 
మైనస్ పాయింట్స్ 
కామెడీ
ఫస్ట్ హాఫ్ (కొంత భాగం)

ఫైనల్ గా: నమ్మండి.. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది 

 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials