Live News Now
  • శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...కాలినడక భక్తులకు 10 గంటలు సమయం
  • నేడు మూడోరోజు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా పర్యటన
  • ఉత్తరాఖండ్: డెహ్రాడూన్‌లోని ఓ షాపింగ్ మాల్ లో ఈడీ సోదాలు..
  • రూ.51 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం... ఫెమా చట్టం కింద షాపు యజమాని పై కేసు నమోదు
  • అమరావతి: ముఖ్యనాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. క్రమశిక్షణ రాహిత్యం పై చంద్రబాబు ఆగ్రహం
  • రేపు విజయవాడలో అమిత్ షా, చంద్రబాబు భేటీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో కలిసి వెళ్లనున్న అమిత్ షా, చంద్రబాబు
  • విజయవాడలో ఏపీ బీజేపీ సదస్సులో పాల్గొననున్న అమిత్ షా
  • అమిత్ షాకు లంచ్ ఆతిధ్యం ఇవ్వనున్న చంద్రబాబు
  • మహారాష్ట్ర: ఔరంగాబాద్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. కారు- లారీ ఢీ, ఏడుగురు మృతి
ScrollLogo ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం.. నదిలో బస్సు బోల్లా, 22 మంది మృతి.. 8 మందిని కాపాడిన రెస్క్యూటీం ScrollLogo ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్తుండగా ఘటన... మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తింపు ScrollLogo హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. 20 వాహనాలు సీజ్ ScrollLogo నేటి నుంచి టీఎస్ సెట్-2017 హాల్ టికెట్లు... జూన్ 11న పరీక్ష, 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ScrollLogo హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు.. పాల్గొననున్న చంద్రబాబు ScrollLogo విశాఖ: నేటి నుంచి ఆస్పత్రుల్లో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల విధానం.. ScrollLogo కేజీహెచ్ గైనిక్ వార్డులో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్న చంద్రబాబు ScrollLogo తిరుమల: నేడు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు నిరాకరణ ScrollLogo భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలను అనుమతించబోమన్న జేఈవో ScrollLogo తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు
TELE "VISION"

రివ్యూ: 'గుంటోరోడు' ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు..

Manchu-manoj-Gunturodu-Review
Posted: 83 Days Ago
Views: 624   

గుంటూరోడు రివ్యూ

నటీనటులు: మంచు మనోజ్‌.. ప్రగ్యాజైశ్వాల్‌.. సంపత్‌.. కోట శ్రీనివాసరావు.. రాజేంద్ర ప్రసాద్‌.. రావు రమేశ్‌ తదితరులు 

మ్యూజిక్ : డి.జె. వసంత్‌ 

ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ 

ఎడిటింగ్ : కార్తీక్‌ శ్రీనివాస్‌ 

బ్యానర్ : క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎస్‌.కె. సత్య 

రిలీజ్ డేట్: 03-03-2017

మంచు బ్రాండ్‌తో వచ్చిన మాస్ ఇమేజ్‌ని  మనోజ్ సక్సెస్ పుల్‌గా కొనసాగిస్తున్నాడు. కరెంట్ తీగ, పోటుగాడు వంటి సినిమాలు మనోజ్ మాస్ ఇమేజ్‌ని బలపరిచాయి. తన బ్రాండ్ పై పూర్తి భరోసాతో గుంటూరోడిగా మారిపోయాడు. ట్రైలర్ తో స్పైస్‌ని రుచి చూపించిన గుంటూరోడు ఎంత ఘాటెక్కించాడో చూద్దాం..

కథ:
కన్నా(మంచుమనోజ్) తన కళ్ళెదురుగా ఏ దౌర్జన్యం జరిగినా చేయి దురదపెడుతుంది. దూకుడెక్కువయినా ఈ కుర్రాడు మాటకి ముందు కొట్టి మాట్లాడతాడు. ఒకసారి రెస్టారెంట్‌లో తన ప్రెండ్స్‌తో దురుసుగా ప్రవర్తించాడని ఒక క్రిమినల్ లాయర్ శేషు (సంపత్)  పై చేయి చేసుకుంటాడు.  పెళ్ళి చేస్తే అయినా కుదురుగా ఉంటాడని కన్నా తండ్రి( రాజేంద్ర ప్రసాద్) పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాడు. అక్కడ పెళ్ళి కూతురుకి ప్రెండ్‌గా వచ్చిన అమృతని ఇష్టపడతాడు. గుంటూరులోనే అతి పెద్ద క్రిమినల్ అయిన ఆ క్రిమినల్ లాయర్ కన్నా గ్యాంగ్‌ని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. తన ప్రేమను గెలిపించుకునేందుకు కన్నా, పగను సాధించేందుకు లాయర్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. తన ప్రేమను అమృత అర్ధం చేసుకునే టైం లోనే లాయర్ తన గ్యాంగ్‌తో కన్నా పై ఎటాక్ చేయిస్తాడు. అక్కడ గుంటూరోడికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి గుంటూరోడు తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు. శేషు పగను గుంటూరోడు ఎలా ఓడించాడు అనేది మిగిలిన కథ..?

కథనం:
గుంటూరోడు అనగానే మనకు ఒక నేటివ్ టచ్ కనపడుతుంది. అక్కడ ఉండే ఒక దూకుడెక్కువ కుర్రాడి కథే గుంటూరోడు. ఇలాంటి క్యారెక్టర్స్ మంచు మనోజ్ ఫరెఫెక్ట్ యాప్ట్ అని శ్రీ తో ప్రూవ్ అయ్యింది. అతిగా ప్రేమించే తండ్రి, తనకోసం ఏదైనా చేసే ఫ్రెండ్స్ .. ఇలా గడిచే కుర్రాడి జీవితం ఒక సంఘటనతో మలపు తిరుగుతుంది. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాకపోయినా చూసినంత సేపు వినోదం అందించడంలో గుంటూరోడు  సక్సెస్ అయ్యాడు.  పుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్‌లో మనోజ్ మరో సారి తన స్ట్రంగ్త్‌ని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రగ్యా ఈ సినిమాలో పుల్ లెంగ్త్ కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించింది. గ్లామర్‌తో పాటు పాటలలో కూడా హుషారైన  మాస్ డాన్స్‌లతో ఆకట్టుకుంది. కథనంలో పట్టు గుంటూరోడికి పెద్ద అసెట్‌గా మారింది. విలన్ సంపత్‌తో మంచు మనోజ్ జరిగిన క్లాష్ తర్వాత గుంటూరోడు స్పీడందుకుంటాడు. కథనంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ బిల్డప్ అవుతుంది. కంచెలో క్లాస్ టచ్‌లో కనిపించిన ప్రగ్యా ఇందులో నాటీ క్యారెక్టర్స్‌తో ఎంటర్‌టైన్ చేసింది. తండ్రి సెంటిమెంట్ ఈ కథకు పెద్ద బలాన్నిచ్చింది. ఇలాంటి పాత్రలు రాజేంద్రప్రసాద్‌కి అతికి నట్టు సరిపోతాయి. మాస్ యాక్షన్‌తో మెప్పించడం అంత తేలికయినా విషయం కాదు.. హీరో కుండే ఇమేజ్‌తో సరితూగితేనే అలాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మనోజ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మాస్‌లో తన రేంజ్‌ని గుర్తు చేసాడు.  ఫరెఫెక్ట్ బాడీ లాంగ్వేజ్‌తో మనోజ్ యాక్షన్ మాస్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. విలన్ క్యారెక్టర్‌లో సంపత్‌రాజ్ డిక్షన్ అండ్ స్ర్ర్కీన్ ప్రజెన్స్ ఆకట్టుకున్నాయి. అతని క్యారెక్టర్‌ని డిజైన్ చేయడంలో దర్శకుడు ఎస్.కె.సత్య  తీసుకున్న ప్రత్యేకత ఇంట్రడక్షన్ సన్నివేశంలోనే అర్ధం అయ్యింది. నిలువెల్లా అహాం నిండిన  విలన్ క్యారెక్టర్ గుంటూరోడికి ఫ్రెష్ లుక్‌‌ని తెచ్చింది. పోలీస్ స్టేషన్ నుండే హీరో విలన్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం బాగా ఆకట్టుకుంటుంది. పాటలలో గుంటూరోడు టైటిల్ సాంగ్ పుల్ జోష్ నింపింది. కథ, కథనాలకంటే హీరో ప్రజంటేషన్ పై ఎక్కువుగా దర్శకుడు ఆధార పడ్డాడు. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కథలోని లోటు పాట్లు పెద్దగా తెలియకుండా కథనం నడిపాడు దర్శకుడు. కోటశ్రీనివాసరావుకి పెరుగుతున్న వయస్సు వాయిస్‌లో స్పష్టంగా కనిపించింది. పాత్ర కూడా రిటైర్ అవడానికి సిద్దపడిన  ఎమ్యల్యే కాబట్టి పాత్రోచితంగా కోట నటన సాగింది.  డిజె వసంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఇంప్రెసివ్‌గా లేదు. పృధ్వీ  కనిపించే రెండు సీన్స్‌లో ఎంటర్‌టైన్‌ చేసాడు. ఆ పదినిముషాలు ఎంటర్‌టైన్‌గా సాగాయి. ఇక విలన్ పాత్రతో పోటీ పడే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్  సినిమాకి హైలెట్ గా నిలిచింది. ‘‘ సత్తా ఉన్నోడిని చూస్తే చావుకి కూడా...’’ అంటూ మనోజ్ చేప్పే డైలాగ్ అదిరిపోయింది. డైలాగ్ ని బాడీ లాంగ్వేజ్ తో పరెఫెక్ట్ మిక్స్ చేస్తూ మంచు మనోజ్ ఇచ్చిన మాస్ లుక్ అతని కెరియర్ లో రిఫరెన్స్ లా మిగిలిపోతుంది. ఒక రెండు బలమైన క్యారెక్టరైజేషన్స్ నమ్ముకొని సత్య నడిపించిన గేమ్ ఎంగేజింగ్ గా ఉంది. సత్తా ఉన్న గుంటోరోడు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. 

 చివరిగా:
గుంటూరోడు లవ్ లో పడ్డాడు.. మాస్ లో నిలబడ్డాడు...


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials