Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

నేడు భారత్, ఆసీస్ మధ్య రెండో టెస్ట్..

India-vs-Australia,-2nd-Test-at-Chinnaswamy-Stadium-Bengaluru
Posted: 115 Days Ago
Views: 352   

ఊహించని విధంగా పుణేలో ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు సిధ్ధమైంది. బెంగళూరు వేదికగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు స్పిన్ వ్యూహంతో సిరీస్‌లో బోణీ కొట్టిన ఆసీస్ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్ళూరుతోంది. పుణే టెస్టులో ఆస్ట్రేలియా విజయంతో ఆసక్తికరంగా మారిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఇప్పుడు కోహ్లీసేనకు సవాల్ విసురుతోంది. సిరీస్ ఆరంభానికి ముందు వరుస విజయాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అనూహ్యంగా పరాజయం పాలైంది. స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలని భావించి అదే ఉచ్చులో చిక్కుకుని ఓడిపోయింది. అయితే బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో పాటు ఫ్లీల్డింగ్ తప్పిదాలు కూడా ఓటమికి కారణమయ్యాయి. దీంతో బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టులో కోహ్లీసేన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు తుది జట్టు కూర్పుపైనా విమర్శలు వస్తున్నాయి. వరుసగా విఫలమవుతోన్న రహానేను కొనసాగించడం , ట్రిపుల్ సెంచరీతో ఫామ్‌లో ఉన్న కరణ్ నాయర్‌కు చోటు దక్కకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. తమ వ్యూహాలు తమకున్నాయంటూ కోచ్ కుంబ్లే సమర్థించుకున్నా..... పుణే ఓటమితో తుది జట్టు కూర్పు విమర్శలకు తావిస్తోంది. అటు పిచ్‌ను దృష్టిలో ఉంచుకునే తుది జట్టును ఎంపిక చేస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ చెబుతున్నాడు. మరోవైపు అనూహ్యంగా పుణే టెస్టులో గెలిచి భారత్ జోరుకు బ్రేక్ వేసిన ఆస్ట్రేలియా ఇప్పుడు సిరీస్ విజయానికి ఉవ్విళ్లూరుతున్నాడు. బెంగళూరులోనూ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. తొలి టెస్ట్ విజయంతో ఆసీస్ కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కెప్టెన్ స్మిత్ ఫామ్ వారికి పెద్ద అడ్వాంటేజ్. అటు బౌలింగ్‌లో స్పిన్నర్ ఒకేఫే ఇప్పుడు కీప్లేయర్‌గా మారిపోయాడు. పెద్దగా టెస్ట్ అనుభవం లేకున్నా భారత్‌ను దెబ్బతీసిన ఒకేఫే బెంగళూరులోనూ కీలకం కానున్నాడు. పుణే టెస్ట్ మూడురోజుల్లోనే ముగిసిపోవడంతో ఇప్పుడు రెండో టెస్ట్ పిచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే బెంగళూర్ పిచ్ టెస్టుల్లో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials