Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

వైజాగ్‌లో టి.ఎస్‌.ఆర్‌ అవార్డ్స్‌ ప్రధానోత్సవం

TSR-National-Film-festivel-to-be-held-in-Vizag
Posted: 475 Days Ago
Views: 661   

ప్ర‌తి ఏడాది ఎంతో ఘ‌నంగా నిర్వ‌హింప‌బ‌డే టి.ఎస్‌.ఆర్‌ అవార్డ్స్ 2015-16 సంవత్స‌రానికిగానూ ఇవ్వ‌నున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, బెంగాళీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, పంజాబీ భాష‌ల సినిమాల‌కు ఈ అవార్డులనిస్తారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 2015-16కు సంబంధించిన నామినేషన్స్‌ను ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో పివిపి, జ‌య‌సుధ‌, మీనా, పింకీ రెడ్డి, జీవితరాజ‌శేఖ‌ర్, దర్శకుడు బి.గోపాల్, రఘురామకృష్ణంరాజు లు  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా

టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ - ``కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. ప్ర‌తి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా టి.ఎస్‌.ఆర్‌  అవార్డుల‌ను నిర్వ‌హిస్తున్నాం. అందుకు ప్ర‌తి కేట‌గిరీలో సినిమాను ఎంపిక చేశాం. మార్చి 8 నుండి నెలరోజుల పాటు జ‌రిగే ఎస్‌.ఎం.ఎస్ పోల్ ద్వారా ప్రేక్ష‌కులు త‌మకు న‌చ్చిన వారికి ఈ అవార్డును వ‌చ్చేలా చేయ‌వ‌చ్చు. విశాఖ‌లో 50వేల మంది ప్రేక్ష‌కుల మ‌ధ్య ఈ అవార్డు వేడుక‌ను నిర్వహిస్తాం`` అన్నారు.

ప్ర‌సాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ``సుబ్బ‌రామిరెడ్డిగారు నిర్వ‌హించే అవార్డుల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది.ఎన్నో వేడుక‌లు చూశాం. కానీ ప‌బ్లిక్‌లో ఇంత బారీ వేడుక‌ను నిర్వ‌హిస్తుండ‌టం ఇదే మొద‌టిసారి అవుతుంది. ఏప్రిల్ 8న ఈ భారీ వేడుక జ‌ర‌గ‌నుంది`` అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ - ``ఈ టి.ఎస్‌.ఆర్‌ అవార్డ్స్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ప్ర‌జ‌ల స‌పోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం`` అన్నారు.

పింకీ రెడ్డి మాట్లాడుతూ - ``నేను చిన్న‌ప్ప‌టి నుండి సినీ తార‌లను చూస్తూ పెరిగాను. నాన్న‌గారికి సినీతార‌ల‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది. వారిని స‌త్క‌రిస్తూ ఉంటారు. అలాగే టి.ఎస్‌.ఆర్‌ ను నిర్వ‌హిస్తున్నారు. వైజాగ్‌లో ఏప్రిల్ 8న చేయ‌నున్న టి.ఎస్‌.ఆర్‌-టీవీ9 అవార్డ్స్‌కు అంద‌రినీ ఆహ్వానిస్తున్నాం`` అన్నారు.

జీవిత మాట్లాడుతూ - `` టి.ఎస్‌.ఆర్‌  అవార్డ్స్ క‌మిటీలో జ్యూరీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నాను. వైజాగ్‌లో వేల మంది జనాల మ‌ధ్య ఈ వేడుక ఘ‌నంగా జ‌రుగుతుంది. అంద‌రూ స‌హ‌క‌రిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

మీనా మాట్లాడుతూ - `` టి.ఎస్‌.ఆర్‌  అవార్డ్స్‌లో నేను కూడా జ్యూరీ మెంబ‌ర్‌గా ఉన్నాను. సుబ్బ‌రామిరెడ్డిగారు ఏం చేసినా బ్ర‌హ్మాండంగా చేస్తారు. క‌చ్చితంగా ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక భారీగా జ‌రుగుతుంది`` అన్నారు.

జ‌య‌సుధ మాట్లాడుతూ - ``క‌ళ‌లంటే సుబ్బ‌రామిరెడ్డిగారికి ఎంతో మ‌క్కువ‌. గతేడాది ఈ అవార్డ్స్ ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ ఏడాది కూడా వైజాగ్‌లో ఈ అవార్డ్స్ వేడుక ఘ‌నంగా జ‌రుగుతుంది. ప్ర‌జ‌లు వారికి న‌చ్చిన వారికి ఓటు వేసి స‌పోర్ట్ చేయాలి`` అన్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials