Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

టైమ్ పాస్ కోసం ఓ సారి చిత్రాంగద

Chitrangada-Movie-review
Posted: 228 Days Ago
Views: 739   

రివ్యూ        : చిత్రాంగద
తారాగణం        : అంజలి, సింధుతులాని, దీపక్, సప్తగిరి, రాజా రవీంద్ర, సాక్షి గులాటి, జయప్రకాష్.వి తదితరులు..
ఎడిటర్        : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రాఫర్     : బాలి.పి
సినిమాటోగ్రాఫర్-2    : జేమ్స్ క్వాన్( యూఎస్ఎ ఎపిసోడ్)
సంగీతం        : సెల్వ, స్వామి
నిర్మాతలు        : గంగపట్నం శ్రీధర్, రహమాన్
రచన, దర్శకత్వం    : అశోక్. జి
రిలీజ్ డేట్        : 10.03.17

 
కథ    :
చిత్ర(అంజలి) సైకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. అనాథైన తను పనిచేస్తోన్న కాలేజ్ హాస్టల్ లోనే ఉంటుంది. దెయ్యాలు లేవని నిరూపించేందుకు రీసెర్చ్ చేస్తూ అందుకు సంబంధించిన ఓ థీసిస్ కూడా సబ్మిట్ చేస్తుంది. ఓ ఫ్రెండ్ పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ.. అందరు అమ్మాయిలతో కొంత అసభ్యంగా ప్రవర్తిస్తోన్న చిత్ర ను ఓ పెద్దాయన కొడతాడు. ఇదంతా కామం అంటాడు. చిత్ర కాదని వాదిస్తోంటే.. అవును చిత్ర ఓ లెస్బియన్.. మాపై కూడా దాడికి పాల్పడింది అంటూ హాస్టల్ లో ఉండే అమ్మాయిలంతా ఆమెపై కంప్లైంట్ చేస్తారు. దీంతో విస్తుపోయిన చిత్ర.. తనెందుకు అలా ప్రవర్తిస్తుందో కారణం తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడుతుంది.. ఆ అన్వేషణలో ఆమెకు అంతులేని ప్రశ్నలు ఎదురవుతాయి. అంతిమంగా తానసలు అమ్మాయినే కాదనే చేదు నిజం తెలుస్తుంది. అయితే ఈ చిత్ర ఎవరు..? ఎందుకు అబ్బాయిలా ప్రవర్తిస్తుంది..? ఆమెకు ఎదురైన ప్రశ్నల చిక్కుముళ్లు విప్పుతూ చిత్ర ఎంత దూరం ప్రయాణించింది.. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లేంటీ అనేది మిగతా కథ..

విశ్లేషణ     :
చిత్రాంగద.. నిజంగానే ఇదో చిత్రమైన కథ.  ఇప్పటి వరకూ మనం చూడని కథైతే కాదు.. గతంలో విజయశాంతి, కార్తీక్ జంటగా ‘మగరాయుడు’ అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ కొత్తకథ(వాళ్లు అనుకున్నట్టుగా) కాస్తా మళ్లీ పాత కథనంలో సాగడంతో మనమేదో కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీల్ ను పూర్తిగా మిస్ చేసినా.. చాలా సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అదే వెంటనే మరికొన్ని సో బోరింగ్ సీన్స్ వచ్చిపడతాయి. దీంతో కథనంలోకి ఇన్వాల్వ్ అవుతున్నామా అని ప్రేక్షకుడు ఫీలవుతోన్న టైమ్ లోనే సడెన్ గా మళ్లీ డైరెక్టరే ‘‘అబ్బే ఎందుకంత ఇన్వాల్వ్ అవుతారు కాస్త బయటికి వచ్చేయండి’’.. అన్నట్టుగా సాగుతుంది కథనం. అయినా చాలా సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఎటొచ్చీ.. ఆ ప్రతిభను కంటిన్యూస్ గా ప్రదర్శించడంలోనే అతను ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది.. సింపుల్ గా చెబితే.. ఓ పాతికేళ్ల క్రితం రవివర్మ అనే ధనవంతుడుండేవాడు.. సినిమా ఆరంభంలోనే అతన్ని ఓ మహిళ చంపేస్తుంది. కట్ చేస్తే చిత్రాంగద అనే అమ్మాయి అబ్ నార్మల్ గా బిహేవ్ చేస్తూ తనకో కల వస్తుందని.. ఆ కలలో ఒక మహిళ ఓ వ్యక్తిని చెరువులో కొట్టి చంపేస్తోందని..ఈ కల తనను బాగా డిస్ట్రబ్ చేస్తుందని చెబుతూ... పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంటుంది. దీంతో సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళతారు. మరోవైపు భూతవైద్యులనూ సంప్రదిస్తుంటారు ఆమె ఫ్రెండ్స్.. ఈ క్రమంలో తన కలలో కనిపిస్తోన్న లొకేషన్ అమెరికాలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లిపోతుంది. చిత్రతో పాటు మరో యువ సైకియాట్రిస్ట్ ను తోడుగా పంపిస్తాడు.. ఇక్కడి డాక్టర్. మొత్తంగా అక్కడికి వెళ్లిన చిత్ర రకరకాల ప్రయత్నాలు చేసి అసలు విషయం తెలుసుకుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమె ఎవరనే విషయం తెలుసుకుని.. చివరికి తన భార్యే తనను చంపిందని.. ఆమెపై పగ తీర్చుకోవడానికే వచ్చానని చెబుతుంది. కానీ చిత్రగా మళ్లీ పుట్టిన రవివర్మలోని వికృత కోణాన్ని చూపించిన అతని భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఇదీ కథ..  
కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే గందరగోళంగా మారింది. దీంతో పాటలెందుకు వస్తున్నాయో తెలియక.. అది కామెడీ వాళ్లెలా ఫీలయ్యారో అర్థం కాక.. ప్రేక్షకులు జుత్తు పీక్కుంటారు. అదే టైమ్ లో ఓ నాలుగైదు బోరింగ్ సీన్స్ తర్వాత ఓ సూపర్ సీన్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడా అన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చిత్రాంగద పాత్రలో అంజలి సినిమా అంతా తన భుజాలపై మోసిందనే చెప్పాలి.. మరోవైపు ఇంతవరకూ ఎప్పుడూ కనిపించనంత హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసి ఆశ్చర్యపరిచింది అంజలి. ఇతర పాత్రల్లో జయప్రకాష్ సైకియాట్రిక్ గా మెప్పించలేకపోయాడు. అమెరికాలో కనిపించే పాత్రల్లో సాక్షి గులాటీ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో లాగించింది. ఇక సింధుతులాని పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంది.. ఈమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అరుంధతిలోని సోనూసూద్ కు సంబంధించిన సీన్స్ ను వద్దనుకున్నా గుర్తు చేస్తుంది. సప్తగిరి రొటీన్ కామెడీతో విపరీతంగా విసిగించాడు. అతనికి తోడు జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కూడా తానేం తక్కువగా అన్నట్టుగా బోర్ కొట్టించాడు.అయితే మళ్లీ చిత్రాంగదగా పుట్టిన రవివర్మకు కొన్ని విషయాలు మాత్రమే ఎందుకు గుర్తున్నాయో కరెక్ట్ గా తెలియదు.. అతని వికృత రూపం చెప్పిన తర్వాత మళ్లీ అతని భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కాదు.. ఇలాంటి లాజికల్ మిస్టేక్స్ సినిమాలో చాలానే కనిపిస్తాయి..
దర్శకుడు ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తయారు చేసుకున్న కథ అని దర్శకుడు ముందే చెప్పాడు. అయితే దాన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అని చెప్పలేం.. ఇతనికి టెక్నికల్ సపోర్ట్ కూడా పెద్దగా లేదు. సెల్వ అండ్ స్వామి అందించిన సంగీతం ఒకటి రెండు సీన్స్ లో, ఆర్ఆర్ లో తప్ప ఎక్కడా మెప్పించలేదు. అమెరికాలో బావున్న సినిమాటోగ్రఫీ ఇండియాలో యావరేజ్ గా అనిపిస్తుంది.. ఎడిటింగ్ పరంగా చెప్పుకుంటే సినిమాలో వచ్చే అన్ని పాటలూ.. కామెడీ సీన్స్ మొత్తం కట్ చేసినా సినిమాకు వచ్చే నష్టం ఏమీలేదు. పైగా ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది.. కాస్ట్యూమ్స్ బావున్నాయి.. డైలాగ్స్ యావరేజ్..  ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపిస్తాయి..
 
ఫైనల్ గా    : టైమ్ పాస్ కోసం ఓ సారిచూసేయొచ్చు..
 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials