Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

వెరైటీ అండ్ ఫ్రెష్ నెస్ కోరుకొనే వారికి బెస్ట్ ఛాయిస్ డి-16

D-16-Telugu-movie-review
Posted: 348 Days Ago
Views: 784   

రివ్యూ        : డి-16
తారాగణం        : రెహమాన్, ప్రకాష్ రాఘవన్, అశ్విన్ కుమార్, ప్రదీప్, అంజన, యాషిక, శరత్ కుమార్ తదితరులు
ఎడిటర్        : శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రఫీ    : సుజిత్ సారంగ్
సంగీతం        : జేక్స్ బెజోయ్
నిర్మాత, రచన, దర్శకత్వం: కార్తిక్ నరేన్
రిలీజ్ డేట్        : 10.03.17
జానర్        : సస్పెన్స్ థ్రిల్లర్
 

కథ    :
2016 జూలై16.. అర్థరాత్రి దాటిన సమయం.. భారీ వర్షం కురుస్తుంటుంది. ఆ సమయంలో ముగ్గురు కుర్రాళ్లు మద్యం మత్తులో కార్ నడుపుతూ.. అటుగా పరుగెడుతూ వస్తోన్న వ్యక్తిని గుద్దేస్తారు. అతను స్పాట్ లోనే చనిపోతాడు. దీంతో భయపడ్డ కుర్రాళ్లు ఆ శవాన్ని కార్ డిక్కీలో వేసుకుని వెళతారు.. అదే సమయంలో ఓ పేపర్ అదే స్పాట్ లో మర్డర్ (సూసైడ్) జరిగినట్టుగా అదే టైమ్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో ఎంక్వైరీ చేయడానికి వస్తాడు ఇన్స్ పెక్టర్ దీపక్(రెహమాన్). అతనికి తోడు గౌతమ్ అనే కానిస్టేబుల్ ఉంటాడు. ఈ క్రమంలో ముగ్గురు కుర్రాళ్లపై డౌట్ వచ్చి వారిని విచారిస్తారు.. కానీ వారికీ ఈ హత్యకు సంబంధం లేదనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన దీపక్.. వారు ఇంకేదో దాస్తున్నారన్న అనుమానంతో ఉంటాడు. ఈ క్రమంలో కార్ గుద్ది చనిపోయిన వ్యక్తి గురించి అసలు పోలీస్ లకు తెలియదు.. కానీ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిది హత్యే అని కన్ఫార్మ్ చేసుకుంటూ వెళుతోన్న పోలీస్ లకు అడుగడుగునా ఫజిల్స్ ఎదురవుతుంటాయి.. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు.. ? ఈ కార్ గుద్ది మరణించిన వ్యక్తి ఎవరు..? ఈ ఇద్దరికీ ఏదైనా సంబంధం ఉందా.. ఇవి ప్రమాదాలా లేక.. కావాలనే చేసినవా.. అనేది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ మోడ్ లో ఆసక్తిగా సాగే కథనంలో తేలే మిగతా కథే డి16.

విశ్లేషణ     :
ఒక రకంగా ఇది కార్తిక్ నరేన్ చేసిన ప్రయోగం.. ఆ ప్రయోగం అద్భుత ఫలితాన్నివ్వడంతో సూపర్ హిట్ గా నిలచిందీ చిత్రం. ఒక సన్నివేశాన్ని ముగ్గురు నలుగురు కోణంలో చూపించడం మనకు నలభైల్లోనే జపనీస్ ఫేమస్ డైరెక్టర్ అకిరా కురసోవా చూపించేశాడు. దానికి కాస్త మర్డర్ థ్రిల్లర్ ను జోడించి.. సీన్ టూ సీన్ థ్రిల్ పెంచే ప్రయత్నం చేశాడు కార్తిక్ నరేన్. అందుకు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణగా నిలిస్తే.. టెక్నికల్ సపోర్ట్ ఇంచ్ కూడా తగ్గకుండా డి16 ను బెంచ్ మార్క్ మూవీగా నిలిపాయి. మ్యూజిక్ నుంచి ఆడియోగ్రఫీ వరకూ.. కలరింగ్ పరంగా సినిమాటోగ్రఫీలో తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిస్తే, గ్రిప్పింగ్ ఎడిటింగ్ కథనాన్ని పకడ్బంధీగా నడపడంలో కీలక పాత్ర పోషించింది. కథలో గొప్పదనం తక్కువే.. కానీ చాలా చిక్కుముళ్లు ఉండటంతో వాటిని ఒక్కొక్కటే విప్పుతూ వెళ్లే పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు.. సమస్యలు.. ఫలితాలు.. ఇంట్రెస్ట్ ను పెంచుతూనే పోతుంటాయి.. క్లైమాక్స్ ఏమాత్రం ఊహించలేం. ఆ రెండు హత్యల వెనక ఉన్న నేపథ్యం సామాజిక సమస్యల ఇతివృత్తంలో ఉండటంతో మరింత కనెక్ట్ అయిపోతారు. ఇక ఇలాంటి సినిమాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ చెప్పుకుంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అందుకే అరుదుగా వచ్చే డి16(డబ్బింగ్ అయితేనేం.. చూస్తున్నంతసేపూ మనకు నచ్చాలి అంతే)వంటి సినిమాల్ని ఖచ్చితంగా చూడాలి.. అయితే ఎంటర్టైన్మెంట్, పాటలు, రొటీన్ ఫైట్స్ కోరుకునేవారికి ఇది ఏమాత్రం మంచి ఛాయిస్ కాదు..
ఆర్టిస్టుల పరంగా ఇన్స్ పెక్టర్ దీపక్ పాత్రలో రెహమాన్ జస్ట్ ఒదిగిపోయాడంతే.. తర్వాత గౌతమ్ పాత్రలో కనిపించిన కుర్రాడు.. బాగా చేశాడు. ఇతర పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఏ ఒక్కరూ అతి చేయకపోవడం పెద్ద రిలీఫ్. దర్శకుడు కార్తీక్ నరేన్ కు జస్ట్ 23యేళ్లు. అయితేనేం పదేళ్ల అనుభవం ఉన్నవాడిలా.. చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ అతనెలా ఊహించాడో కానీ మన ఊహలకు అందకుండా తీర్చిదిద్దడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. ఓకొత్త కుర్రాడు.. పైగా తనే దర్శకుడు.. ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ ను ఎంచుకోవడంలోనే తెలుస్తుంది.. సినిమా పట్ల అతని పాషన్ అండ్ డెడికేషన్... అందుకే ఎంటైర్ కోలీవుడ్ ఈ కుర్రాడి ప్రతిభను ఆకాశానికెత్తేసింది.. మొత్తంగా వెరైటీ అండ్ ఫ్రెష్ నెస్ ఉన్న సినిమాలు కోరుకునే వారికి డి 16 ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్.. వెళ్లి చూడండి.. ఏమాత్రం నిరుత్సాహపడరు..

ఫైనల్ గా: డి-16 ...  సూపర్ థ్రిల్లర్

 





Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials