Posted: 410 Days Ago
Views: 451
బెంగళూర్ టెస్ట్ రివ్యూ వివాదానికి ముగింపు పలికేందుకు బీసిసిఐ సిధ్ధమైనా... ఆస్ట్రేలియా పత్రికలు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నిన్న స్మిత్ మంచివాడంటూ వెనకేసుకొచ్చిన ఆసీస్ మీడియా ఇప్పుడు కోహ్లీ, కుంబ్లే టార్గెట్‌గా విషం చిమ్ముతోంది. తాజాగా భారత్ కెప్టెన్, కోచ్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శనాత్మక కథనాలు ప్రచురించాయి. బెంగళూర్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఔట్‌కు సంబంధించి కుంబ్లే మ్యాచ్ అధికారులతో గొడపపడినట్టు ఆసీస్ మీడియా పేర్కొంది. అలాగే మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ ఆసీస్ ప్రతినిధిపైకి వాటర్ బాటిల్ విసిరినట్టు ఆరోపిస్తూ కథనాలు ప్రచురించాయి. దీంతో ఆసీస్ పత్రికల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.