Posted: 405 Days Ago
Views: 374
అమెరికాలోని చికాగోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్నారై మహిళలు ఓ పర్వదినంలా నిర్వహించుకున్నారు. చికాగో మహా నగర తెలుగు సంస్థ TAGC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. స్థానిక ఎర్లింగ్టన్ హైట్స్ లోని అట్లాంటిక్ బాంకెట్ హాల్లో చేపట్టిన ఈ వేడుకల్లో పలువురు న్యాయశాస్త్రనిపుణులు పాల్గొని మహిళ హక్కులు, ఆస్థులు, బీమా వంటి విషయాలపై వివరించారు. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. TAGC మహిళా కమిటీ అధ్యక్షురాలు వాణి ఏట్రింతల తోపాటు పలువురు పాల్గొన్నారు.