Live News Now
  • శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...కాలినడక భక్తులకు 10 గంటలు సమయం
  • నేడు మూడోరోజు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా పర్యటన
  • ఉత్తరాఖండ్: డెహ్రాడూన్‌లోని ఓ షాపింగ్ మాల్ లో ఈడీ సోదాలు..
  • రూ.51 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం... ఫెమా చట్టం కింద షాపు యజమాని పై కేసు నమోదు
  • అమరావతి: ముఖ్యనాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. క్రమశిక్షణ రాహిత్యం పై చంద్రబాబు ఆగ్రహం
  • రేపు విజయవాడలో అమిత్ షా, చంద్రబాబు భేటీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో కలిసి వెళ్లనున్న అమిత్ షా, చంద్రబాబు
  • విజయవాడలో ఏపీ బీజేపీ సదస్సులో పాల్గొననున్న అమిత్ షా
  • అమిత్ షాకు లంచ్ ఆతిధ్యం ఇవ్వనున్న చంద్రబాబు
  • మహారాష్ట్ర: ఔరంగాబాద్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. కారు- లారీ ఢీ, ఏడుగురు మృతి
ScrollLogo ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం.. నదిలో బస్సు బోల్లా, 22 మంది మృతి.. 8 మందిని కాపాడిన రెస్క్యూటీం ScrollLogo ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్తుండగా ఘటన... మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తింపు ScrollLogo హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. 20 వాహనాలు సీజ్ ScrollLogo నేటి నుంచి టీఎస్ సెట్-2017 హాల్ టికెట్లు... జూన్ 11న పరీక్ష, 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ScrollLogo హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు.. పాల్గొననున్న చంద్రబాబు ScrollLogo విశాఖ: నేటి నుంచి ఆస్పత్రుల్లో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల విధానం.. ScrollLogo కేజీహెచ్ గైనిక్ వార్డులో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్న చంద్రబాబు ScrollLogo తిరుమల: నేడు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు నిరాకరణ ScrollLogo భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలను అనుమతించబోమన్న జేఈవో ScrollLogo తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు

ఐసిసి ఛైర్మన్ గా శశాంక్ మనోహర్ తప్పుకున్నారు

Shashank-Manohar-steps-down-as-ICC-chairman
Posted: 70 Days Ago
Views: 165   

ఐసిసి ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నాడు. గతేడాది ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. అయితే ఐసిసిలో బీసిసిఐ ప్రాధాన్యత తగ్గిపోయిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఐసిసి ఛైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్నారు.  నిజానికి గత ఏడాది చివర్లో బీసిసిఐ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న మనోహర్ కొన్ని రోజులకే ఐసిసి ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బోర్డు అతని పేరును ప్రతిపాదించిన తర్వాత ప్రెసిడెంట్ పదవికి గుడ్‌బై చెప్పిన మనోహర్ పూర్తిస్థాయిలో ఐసిసికి సేవలందించారు రెండేళ్ళ పాటు ఛైర్మన్ పదవిలో ఉండాల్సిన మనోహర్ ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు ఐసిసి సిఈవో రిచర్డ్‌సన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే అతని రాజీనామాకు వ్యక్తిగత కారణాలు కాదనేది చాలా మంది అభిప్రాయం. 

గత కొంత కాలంగా ఐసిసిలో ఆధిపత్యం కనబరుస్తోన్న మూడు పెద్ద దేశాలపై మిగిలిన సభ్యదేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఆదాయం పంచుకోవడం దగ్గర నుంచి మిగిలిన చాలా అంశాల్లో బిగ్‌త్రీ వైఖరి ఇతర దేశాలకు నచ్చడం లేదు. ఇదే సమయంలో లోథా కమిటీ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న బీసిసిఐ ఐసిసిలో పూర్తిగా పట్టుకోల్పోయింది. నిజానికి ఛైర్మన్‌గా ఎన్నికైన మనోహర్ తమకు మధ్ధతుగా ఉంటాడని బీసిసిఐ భావించగా... అతను మాత్రం బోర్డుకు షాకిచ్చాడు. చాలా కాలంగా ఐసిసి ఆదాయంలో ఎక్కువ భాగం మూడు ప్రధాన దేశాలే పంచుకోవడాన్ని మనోహర్ వ్యతిరేకించాడు. దీనిపై బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పిన మనోహర్ ఐసిసి నిబంధనల్లో మార్పులను సూచించాడు. అయితే మనోహర్ సూచించిన మార్పులను బీసిసిఐ వ్యతిరేకించింది. శ్రీలంక , బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ బోర్డులు కూడా బీసిసిఐకి మధ్ధతుగా నిలిచాయి. ఇప్పుడు మనోహర్ రాజీనామాతో ఐసిసి నిబంధనల మార్పు అంశాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించేందుకు బీసిసిఐ సిధ్ధమైంది. ఇప్పటికే తమతో కలిసి వచ్చే బోర్డులతో సమాలోచనలు జరుపుతోన్న బీసిసిఐ ఐసిసిలో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials