Live News Now
  • ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం.. సేవలను స్మరించుకున్న తెలుగు రాష్ట్రాల అధికారులు
  • విషమంగానే భువనేశ్వర్ ఆరోగ్యం.. రోహిత్ అరెస్ట్, మరో నలుగురి కోసం పోలీసుల వేట
  • మధ్యాహ్నం తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్.. 8వేల792 పోస్టులు భర్తీ చేయనున్న TSPSC
  • మూతపడిన కేదారనాథుని ఆలయం.. 6 నెలల పాటు రాకపోకలు నిలిపివేత
  • డెన్మార్క్ ఓపెన్ సెమీస్ కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ వన్ విక్టర్ ఆక్సెల్ సెన్ పై విజయం
  • ముగిసిన చంద్రబాబు అమెరికా టూర్.. కాసేపట్లో UAEకి సీఎం బృందం
  • పోలీసు ఉద్యోగమంటే అడుగడునా సవాళ్లే.. అమరుల త్యాగాలు వృధాకానివ్వబోమన్న ఏపీ డీజీపీ
  • జగన్ పాదయాత్రపై సోమవారం క్లారిటీ.. CBI కోర్టు తీర్పుపై వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ
  • కరీంనగర్ ఆసుపత్రిలో కోలుకుంటున్న రాజన్న.. షూటర్స్ కోసం పోలీసుల వేట
  • రేపు జపాన్ పార్లమెంట్ కు ఎన్నికలు.. షింజో అబేనే పీఎం అంటున్న సర్వేలు
ScrollLogo నెల్లూరు జిల్లాలో కీచక SI సస్పెన్షన్.. సర్పంచ్‌ను వేధించినందుకు పనిష్‌మెంట్ ScrollLogo మూడున్నరేళ్లలో 900 కోట్ల నిధులు.. అభివృద్ధిలో పరకాల MLA దూకుడు ScrollLogo గుజరాత్ ఎన్నికలను మోడీ ప్రకటిస్తారు.. ఈసీ సెలవులో ఉందంటూ కాంగ్రెస్ సెటైర్ ScrollLogo పోలీసు అమరవీరులకు ప్రభుత్వ నివాళి.. ఖాకీలపై నాయిని హామీల వర్షం ScrollLogo అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ.. క్రాస్ రోడ్డులో కొడంగల్ ఎమ్మెల్యే ScrollLogo జగిత్యాల జిల్లాలో కాల్పుల కలకలం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ సర్పంచ్‌ ScrollLogo DSP రవిబాబు బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ సీజ్.. కోర్టులో హాజరుపర్చనున్న న్యూపోర్టు పోలీసులు ScrollLogo గొట్టా బ్యారేజి 22గేట్లు ఎత్తివేత.. వంశధార పరివాహక ప్రజలను అలర్ట్ చేసిన సర్కార్ ScrollLogo ఆసియా కప్ హాకీ టోర్నీలో కీలక మ్యాచ్.. ఫైనల్ బెర్త్ కోసం తలపడుతున్న భారత్, పాక్ ScrollLogo ప్రవాసాంధ్రులతో భేటీ కానునున్న చంద్రబాబు.. పెట్టుబడుల ప్రవాహమే లక్ష్యంగా UAE టూర్
Crime Watch

పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

Will-gold-prices-go-down-after-demonetization-in-India?
Posted: 220 Days Ago
Views: 376   

బంగారంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. అమ్మకాలు అంతకంతకు తగ్గుతున్నాయి. డిమాండ్‌ అమాంతంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా గోల్డ్‌ దిగుమతులు నలబై శాతం పడిపోయాయి.
ప్రపంచంలో అధిక డిమాండు ఉన్న మెటల్‌ బంగారం. భారత్‌లో దాని మీద మోజు మరీ ఎక్కువ. గోల్డ్‌ ధరలు పెరగటమే కాని తగ్గటమన్నది లేదు. అందుకే ఇన్నాళ్లూ గోల్డ్‌ని సురక్షిత పెట్టుబడిగా భావించారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు బంగారం అతలాకుతలమైంది. డిమాండ్ అమాంతంగా పడిపోయింది. దిగుమతులు భారీగా తగ్గాయి. గత డిసెంబర్‌లో 54.1 టన్నుల బంగారం దిగుమతి అయింది. ఐతే జనవరిలో అది 53.2 టన్నులుగా నమోదైంది. అంతకు ముందు పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్లో ఏకంగా 119.2 టన్నుల బంగారం దిగుమతైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులు బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. చాలా మంది తమ నల్లధనాన్ని గోల్డ్ రూపంలోకి మార్చుకునేందుకు ప్రయత్నించారు. రద్దు చేసిన నోట్లతో భారీ ప్రీమియం చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కావడంతో నవంబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఇక తరువాత బంగారం కొనేవారే లేరు. అమ్మకాలు భారీగా తగ్గాయి. ఫలితంగా గోల్డ్‌ ఇంపోర్ట్స్‌ ఘోరంగా పడిపోయాయి. ఏప్రిల్ 2016- జనవరి 2017 కాలానికి 546 టన్నుల గోల్డ్‌ దిగుమతయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 892.9 టన్నులుగా ఉంది. అంటే నలబై శాతం దిగుమతులు పడిపోయాయి.
మరోవైపు, బంగారం ధరలు  భారీగా పడిపోతున్నాయి. గతవారం బంగారం ధర రెండు నెలల కనిష్టానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్‌ అనూహ్యంగా డిమాండ్ పడిపోవటమే దీనికి ప్రధాన కారణం. అలాగే  దేశంలో బంగారం కొనుగోళ్లు బాగా తగ్గటంతో పసిడి ధర 29 వేల కిందకు పడిపోయింది. వెండి ధర కూడా బాగా తగ్గింది. పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పటికే సంకేతాలిచ్చింది. అదే జరిగితే అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖంపట్టే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం US FEDERAL ReSERVE సమీక్షా సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది. వడ్డీరేట్లు పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయిస్తే డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ వస్తుంది. కొంతకాలం పసిడి తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు, చైనాలో గోల్డ్‌ డిమాండ్ పడిపోవడం కూడా ధరలు పతనానికి కారణమంటున్నారు.  
గ్రాఫిక్స్‌ప్రపంచంలో అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్‌. ఐతే  ప్రస్తుతం బంగారం డిమాండ్‌ తగ్గటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తాత్కాలికమేనా?  ఏడాదికాలంగా పసిడి డిమాండ్‌ తగ్గుతూ వస్తున్నా భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందా?  
భారత్‌లో బంగారం డిమాండ్‌ పెరగటమే కాని తగ్గటమన్నది ఉండదు. ఐతే ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నం. త్వరలోనే అంతా సర్దుకుంటుందంటున్నారు నిపుణులు. ఈ ఏడాది బంగారం దిగుమతులు 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకు ఉండొచ్చు. మరో మూడేళ్లలో దేశంలో బంగారం డిమాండ్‌ 950 టన్నులకు చేరుతుందని అంచనా. ఆర్థికవృద్ధి, బులియన్‌మార్కెట్లో పారదర్శకతతో గోల్డ్‌కు డిమాండ్‌ పెరుగుతుందంటున్నారు. అంతేకాదు.. భారతీయ సమాజంలో బంగారం పట్ల ఉన్న ఆకర్షణ కూడా దానికి కలిసొస్తోంది. మనదేశంలో కరెన్సీ నోట్ల కన్నా పసిడి మీదే ప్రజలకు నమ్మకం ఎక్కువ. దగ్గర ఏమాత్రం డబ్బులున్నా వారి ఫస్ట్ చాయిస్‌ బంగారం కొనిపెట్టుకోవటం. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తరించక ముందు జనం దగ్గర ఉన్న సేవింగ్‌ ఆప్షన్‌ కూడా బంగారం కొనుగోలే. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. గత 50 ఏళ్లలో పసిడి ధర భారత్‌లో 350 రెట్లు పెరిగింది. మనదేశంలో గోల్డ్‌ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తిలేదు. వినియోగం 750 నుంచి వెయ్యి టన్నులు. ఉత్పత్తి మాత్రం ఐదారు టన్నులు మించదు. అందుకే  భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం సరఫరాలో ఏ మాత్రం అడ్డంకులు ఏర్పడినా పసిడి ధర పైపైకి పోతుంది.

పసిడి ధర నిర్ణయంలో డాలర్‌, రూపాయి మారకం రేటు కూడా  కీలక పాత్ర పోషిస్తుంది. బంగారం దిగుమతులకు అవసరమైన నగదును డాలర్ల రూపంలో చెల్లించాలి. ఒక డాలర్‌కు 67గా ఉన్న రూపాయి మారకం విలువ 68కి క్షీణిస్తే మనం దిగుమతి చేసుకునే బంగారం ధర మరింత పెరుగుతుంది. అంతేకాదు ద్రవ్యోల్బణానికి - బంగారం ధరకు కూడా సంబంధం ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుతుంది. మదుపరులు తమ పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్లు కూడా పసడి ధరను పెంచుతుంటాయి. ఏదేమైనా ఒక్కటి మాత్రం ..బంగారం డిమాండ్‌ భారత్‌లో ఎవర్‌గ్రీన్‌ అన్నది మాత్రం సత్యం!


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials