Live News Now
  • ఈజిఫ్టు: కైరో సెంట్రల్ సినాయ్ లో పేలుళ్లు..పోలీసులు,మిలటరి సైనికులు లక్ష్యంగా ఉగ్రదాడి..
  • ఐసిస్ ఉగ్రదాడిలో 10 మంది సైనికుల మృతి..పోలీసుల కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు హతం..
  • టెర్రరిస్టుల నివాసాలను ధ్వంసం చేసిన భద్రతాదళాలు..
  • తమిళనాడు: సిఎం పళనిస్వామి నియోజకవర్గంలో పాతనోట్ల కలకలం..
  • ఇడైపాడిలో చెత్తకుప్పలో రు.500,వెయ్యినోట్లను ముక్కలుగా చింపి పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • బాంబే స్టాక్ ఎక్చేంజ్ బాండ్ల జారీ ద్వారా రు.2 లక్షల కోట్లు సమీకరణ...
  • దేశ రాజధాని ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారులో చెలరేగిన మంటలు
  • కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు..
  • లఖ్ నవూ: యుపిలో అవినీతికి పాల్పడిన వందమంది పోలీసులపై యోగి సర్కార్ వేటు..
  • చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచన
ScrollLogo రు.30 వేల కంటే మించి నగదు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు.. ScrollLogo అనంతపురం: రు.90వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన ఏఈ జనార్థన్ నాయుడు ScrollLogo హైదరాబాద్:టిడిపి విలీనం చెల్లదు.. అది చట్టబద్దం కాదు.. రేవంత్ రెడ్డి.. ScrollLogo గుంటూరు: రు.20 వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కిన రొంపిచర్ల ఎస్ ఐ బాషా ScrollLogo విజయవాడలో ఆగ్రిగోల్డ్ బాధితులకు జగన్ పరామర్శ.. ScrollLogo ఆగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు పోరాడుతాం.. జగన్ ScrollLogo ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న వైద్యుల సమ్మె.. ScrollLogo హైదరాబాద్: మక్కాపేలుళ్ల కేసులో అసిమానంద,భరత్ భాయ్ లకు బెయిల్ మంజూరు.. ScrollLogo నాలుగేళ్లుగా జైల్లో వుంటున్న అసిమానంద, భరత్ భాయ్.. ScrollLogo ఇటీవలే అజ్మీర్ పేలుళ్ల కేసునుంచి అసిమానంద,భరత్ భాయ్ లకు విముక్తి..

దుబాయ్‌లో కేరళ యువకుడి దీనగాథ

Kerala-youth-fined-2-lakhs-dirhams-in-Dubai
Posted: 8 Days Ago
Views: 95   

ఎన్నో కలలతో ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. జీవితంలో బాగా స్థిరపడాలనుకున్నాడు. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. కేరళకు చెందిన కె.బీ.అచ్యుతానందన్ ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సేఫ్టీ సూపర్‌వైజర్‌గా పనిచేయడానికి దుబాయ్ వెళ్లాడు. అతడి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. వారి రక్షణ బాధ్యతలన్ని అచ్యుతానందన్ వహించాల్సి ఉంటుంది. అయితే జూన్ 2015లో అతడి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. అతడి ఆధ్వర్యంలో పనిచేస్తున్న బంగ్లాదేశీ కార్మికుడు భవనంపైనుంచి కిందపడి చనిపోయాడు. ఆ సమయంలో అతడు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా చాలా ఎత్తులో పనిచేసేందుకు భవనంపైకి వెళ్లాడని అచ్యుతానంద్ అంటున్నాడు.
అక్కడ పనిచేయాలని కూడా తాను అతనితో చెప్పలేదన్నాడు. అయితే ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసేవారికి ప్రతి కంపెనీ ఇన్స్యూరెన్స్ కల్పిస్తోంది. అయితే ఈ సంఘటన జరిగడానికి కొద్ది రోజుల ముందే చనిపోయిన కార్మికుడి ఇన్స్యూరెన్స్ గడువు ముగిసింది. దాంతో మృతిచెందిన వ్యక్తికి కంపెనీ ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ కంపెనీ ప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. కార్మికుల రక్షణ బాధ్యతలు అచ్యుతానందన్‌ వేనంటూ వారు తప్పించుకున్నారు. అయితే ఈ మధ్యనే కేసు కోర్టుకు చేరింది. అచ్యుతానందన్ నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది.
ఇన్స్యూరెన్స్ గడువు ముగిసిన వ్యక్తిని పనిలో కొనసాగించడం నేరమని కోర్టు పేర్కొంది. అతడి మృతికి అచ్యుతానందన్ మాత్రమే కారకుడని, మృతుడి కుటుంబానికి అతడు 200000దిర్హమ్స్ (దాదాపు 36 లక్షల రూపాయలు) చెల్లించాలని తీర్పు చెప్పింది. ఇలాంటి బాధ్యరహిత్య పనులు భవిష్యత్తులో చేయకుండా ఉండేందుకు మరో 3000దిర్హమ్స్ కోర్టుకు జరిమానాగా కట్టాలని తీర్పు చెప్పింది. అయితే కంపెనీలో పదినెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఈ పరిస్థితుల్లో తాను అంత డబ్బు ఎలా చెల్లించాలేనంటూ కోర్టుకు మొరపెట్టుకున్నాడు. కానీ, అతడి ఆవేదనను ఎవరు పట్టించుకోలేదు. కంపెనీని సహయం కోరితే 100000 దిర్హమ్స్ చెల్లించేందుకు అంగీకరించింది.
ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను కంపెనీ స్వదేశాలకు పంపించిదని అచ్యుతానందన్ అంటున్నాడు. కొత్త ప్రాజెక్టులు కూడా కంపెనీ ఏమి చేపట్టడం లేదని అందువల్ల అందరినీ తిరిగి పంపిస్తున్నరన్నాడు. తన వీసా గడువు కూడా ముగిసిందని, స్వదేశానికి బయలుదేరాల్సిన సమయం వచ్చిందన్నాడు. కానీ, మిగతా సొమ్ము కట్టకుండా దుబాయ్ అధికారులు భారత్ వెళ్లేందుకు అనుమతించరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని తనను ఈ గండం నుంచి తనను గట్టెక్కించాలని కోరుతున్నాడు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials