Posted: 403 Days Ago
Views: 430
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్ కెప్టెన్గా హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ధోనీ నగరంలోని ఓ హోటల్లో జట్టు సభ్యులంతా కలిసి బసకు దిగారు. అయితే ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆటగాళ్ళు అక్కడినుంచి పరుగులు తీశారు. ప్రమాదంలో ఎవరికీ ఏమి కానందున హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కాగా మ్యాచ్ ఆడటానికి తీసుకువచ్చిన కిట్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పి అదుపులోకి తీసుకువచ్చారు. కిట్ మొత్తం కాలి బూడిదవ్వడంతో మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.