Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

రసవత్తరంగా రాంచీ టెస్ట్.. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్ - 451 ఆలౌట్

Australia-all-out-for-451-in-Ranchi-test
Posted: 340 Days Ago
Views: 311   

రాంచీ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన 451 పరుగులకు భారత్‌ ధీటైన జవాబునిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం అందించడంతో భారత్‌కు మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం చిక్కింది.
రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ తన జోరును కొనసాగించింది. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ల జోడీని విడగొట్టలేకపోయారు. ఎట్టకేలకు రవీంద్ర జడేజా విజృంభించడంతో ఆసీస్‌ ఆలౌట్ అయింది. జడేజాతో పాటు ఉమేశ్‌ విజృంభణతో ఆసీస్‌ ఫస్ట్ ఇన్నింగ్స్ 451 పరుగులకు పరిమితమైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 178 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 104 పరుగులు చేసిన మరో బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ టెస్ట్‌ కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు. అనంతరం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌ శుభారంభాన్ని అందించారు. 67 పరుగులు చేసిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సిరీస్‌లో నాలుగో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పూజారా మరో వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆట ముగిసే సమయానికి మురళీ విజయ్‌ 42 పరుగులు, పూజారా 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్‌ స్కోరును అధిగమించాలంటే భారత్‌ మరో 331 పరుగులు చేయాలి. ఇంకా రహానే, కోహ్లీ, జడేజా, సాహాలాంటి బ్యాట్స్‌మెన్‌ ఆడాల్సి ఉండడంతో ఆసీస్‌ స్కోరును దాటడం అంత కష్టమేం కాదు. ఆసీస్‌ స్కోరును అధిగమిస్తే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కే అవకాశముంది.



Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials