Live News Now
  • బిజెపి నుంచి మాధవ్,బొడ్డు రాంబాబు, తోట శ్రీను..
  • కొల్ కత్తా: గోల్డెన్ పార్కు హోటల్ లో అగ్నిప్రమాాదం.. ఇద్దరు మృతి
  • ఏపి అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి డిమాండ్..
  • వైసిపి సభ్యల ఆందోళనతో సభ మరోసారి వాయిదా..
  • ప.గో: మొదల్తూరు మల్లపురాజుతోట ఆనంద్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదం..
  • విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి...
  • సహాయ చర్యలు చేపట్టాలని ప.గో జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..
  • అధ్యక్ష పదవికి పోటీపడిన వివేక్, జయసింహ..నేడో,రేపో ఫలితాలు వెలువడే అవకాశం..
ScrollLogo మద్యం అరువు ఇవ్వలేదని హత్యాయత్నం.. వ్యాపారి పరిస్థితి విషమం..ఆస్పత్రికి తరలింపు.. ScrollLogo జాతీయ రహదారులపై మద్యం దుకాణాల నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ ScrollLogo హైవేపై 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు.. ScrollLogo సుప్రీంకోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దుకాణ యజమానుల పిటిషన్.. ScrollLogo 500 మీటర్ల పరిధిని తగ్గించాలని కోరిన యజమానుల సంఘం.. ScrollLogo అమరావతి: చంద్రబాబును సత్కరించిన మంగళగిరి నియోజకవర్గ రైతులు... ScrollLogo గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్.. స్వాగతం పలికిన జనసేన కార్యకర్తలు, అభిమానులు ScrollLogo ఎమ్మెల్సీగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం.. హాజరైన బాలకృష్ణ,పత్తిపాటి పుల్లారావు,పల్లె,మాణిక్యాలరావు.. ScrollLogo ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన బచ్చుల అర్జునుడు, కరణం బలరాం,డొక్కా మాణిక్యవరప్రసాద్, ScrollLogo బిటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, పిడిఎఫ్ నుంచి కత్తి నరసింహారెడ్డి,శ్రీనివాసులరెడ్డి,

ప్రేమించలేదని నవవధువు గొంతుకోశాడు

man-attacks-women-with-knife-in-up
Posted: 13 Days Ago
Views: 118   

తనను ప్రేమించలేదనే కోపంతో నవవధువు గొంతుకోసి హత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. సాహిబాబాద్‌ టౌన్‌షిప్‌కు చెందిన 26ఏళ్ల యువతికి ఇటీవలే వివాహం జరిగింది. సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించిన యువతి హోలీ పండగ కోసం పుట్టింటికి రావడం శాపంగా మారింది. తనను ప్రేమించలేదనే కోపంతో, మరో వ్యక్తిని వివాహం చేసుకుందనే అక్కసుతో వారి పొరుగింట్లో ఉండే వ్యక్తి కత్తితో దాడిచేసి గొంతు కోశాడు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. సాహిబాబాద్‌ టౌన్‌షిప్‌లో రాజీవ్‌ కాలనీకి చెందిన యువతికి మార్చి 4న సోనేపట్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్లి తర్వాత తొలి హోలీ పండుగను పుట్టింట్లో జరుపుకోవడానికి ఆమె సాహిబాబాద్‌కు వచ్చింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరుగున ఉండే రాజీవ్‌ కశ్యప్‌ అనే వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కశ్యప్‌ తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, తాను వేరే వివాహం చేసుకున్నాననే కోపంతో తనను చంపాలనుకున్నాడని యువతి ప్రాథమిక వాంగ్మూలంలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కశ్యప్‌తో పెళ్లికి ఆమెకు ఆసక్తి ఉందా లేదా.. వారి మధ్య సంబంధం ఏమిటనే వివరాలు తెలియరాలేదని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినపోలీసులు కశ్యప్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials