Live News Now
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి
  • కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య.. విజయనగరం జిల్లాలో విషాదం..
  • వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయన్న బోండా
  • 58 లక్షల మంది రైతులకు 6 వేల కోట్లు.. రైతు బంధు పథకం చారిత్రాత్మకమన్న హరీష్
  • టీడీపీపై మహా కుట్ర జరుగుతోంది: బోండా
  • పోలవరం స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్ పనులు ప్రారంభం..
  • ఐపీఎల్‌లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ.. క్రిస్‌గేల్‌పైనే అందరి చూపు
  • ప్రగతి భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. సాక్షర భారత్‌ మిషన్ కోఆర్డినేటర్ల ఆందోళన..
ScrollLogo హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్.. ScrollLogo కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం.. ScrollLogo తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ScrollLogo మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు ScrollLogo సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు ScrollLogo చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి ScrollLogo టీటీడీ సభ్యురాలిగా అనిత తొలగింపు ఎమ్మెల్యే విజ్ఞప్తి లేఖకు చంద్రబాబు ఓకే ScrollLogo సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్డీఏ వైఫల్యాలపై గర్జించిన కామ్రేడ్లు ScrollLogo విభజన హామీలు.. తాజా రాజకీయాలే అజెండా గవర్నర్‌తో సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు భేటీ ScrollLogo మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం

IAS అధికారి కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి

Death-Mystery-of-IAS-officer-s-Driver,-Madhura-Nagar,-Hyderabad
Posted: 400 Days Ago
Views: 585   

హైదరాబాద్‌ మధురానగర్‌లో ఓ IAS అధికారి కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి కలకలంరేపుతోంది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దుబ్బ తండాకు చెందిన నాగరాజు రెండేళ్లగా ఓ IAS అధికారి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత శుక్రవారం ఉదయం డ్యూటీకి వచ్చిన నాగరాజు మరుసటి రోజు నుంచి కపిపించకుండా పోయాడు. నాగరాజు నుంచి ఫోన్‌ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. IAS ఇంటికి ఫోన్‌ చేస్తే ఆఫీస్‌ పనిమీద బయటకెళ్లారనే సమాధానం వచ్చింది.  అనుమానంతో నేరుగా ఇంటికొచ్చి నిలదీయడంతో... చనిపోయాడని తమకు సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుతో ఈ వ్యవహారం మొత్తం బయటపడిందని... IAS  అధికారి కుమారుడే తన భర్తను చంపాడని నాగరాజు భార్య ఆరోపిస్తోంది.

నాగారాజు డెడ్‌బాడీని మధురానగర్‌లోని IAS అధికారి ఇంటి సమీపంలో బయటకు తీశారు. పోస్ట్‌మార్టమ్‌ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... IAS అధికారి కుమారుడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials