Live News Now
  • విజయవాడ: కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం.. వ్యవసాయ అనుబంధ రంగాల పై సమీక్ష
  • రైతుల కోసం ప్లాంటిక్స్ మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
  • ఢిల్లీ: ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్- 2017 అవార్డుల ప్రదానోత్సవం
  • తెలుగు రాష్ట్రాల పోలీసులకు అవార్డుల పంట.. తెలంగాణ పోలీసులకు 5 అవార్డులు
  • హైదరాబాద్ సీపీకి స్మార్ట్ పోలీస్ అవార్డు.. ఏపీ పోలీసులకు 2 అవార్డులు
  • విశాఖ: ఎమ్మెల్సీ మూర్తి వ్యాఖ్యల పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం..
  • ఏయూను దెయ్యాల కొంపతో పోల్చిన ఎమ్మెల్సీ మూర్తి
  • హైదరాబాద్: హైకోర్టు విభజించి తెలంగాణ పై ఉన్న ప్రేమను బీజేపీ నిరూపించుకోవాలి: హరీష్‌రావు
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.12 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
  • సూర్యపేట: మునగాల మండలం మాదవరం సమీపంలో కారు బోల్తా నలుగురు మృతి ముగ్గురికి గాయాలు
ScrollLogo యూపీ: బాబ్రీ కేసు పై లఖన్ పూ కోర్టులో విచారణ ... ScrollLogo ఈ నెల 30న హాజరుకావాలని అద్వానీ, ఉమాభారలి, మురళీమనోహర్ జోషిలకు కోర్టు ఆదేశం ScrollLogo కామారెడ్డి: మూడేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ విఫలం: ఉత్తమ్ కుమార్ ScrollLogo భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్... 448 పాయింట్లు లాభపడి 30,750 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 149 పాయింట్లు లాభపడి 9,509 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో టీటీడీపీ నేతల భేటీ.. రైతు సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల పై ఫిర్యాదు ScrollLogo మధ్యప్రదేశ్: నీమచ్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా 11 మంది మృతి, 12 మందికి పైగా గాయాలు ScrollLogo జమ్మూకాశ్మీర్: షోపియాన్ లో ఘోర ప్రమాదం రాజౌరి సమీపంలో లోయలో పడ్డ బస్సు ScrollLogo 10మందికి పైగా విద్యార్థుల మృతి.. 30 మందికి గాయాలు ScrollLogo పిక్నిక్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదం... బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు
TELE "VISION"

ముగిసిస తమ్మినేని మహాజన పాదయాత్ర

CPM-Leader-Thammineni-Veerabhadram-Slams-TRS-Government
Posted: 67 Days Ago
Views: 74   

పాలకులు మారినా తెలంగాణలో పరిస్థితులు మాత్రం మారలేదని.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.  మహాజన పాదయాత్ర ముగింపు సభలో..  సామాజిక న్యాయమే తెలంగాణ అభివృద్ధికి మార్గమని తమ్మినేని అన్నారు. పరిశ్రమలు మూత పడుతున్నా తెలంగాణ పాలకులు కళ్లు అప్పగించి చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్బం వచ్చిందని సభలో పాల్గొన్న సీపీఎం నేతలు హెచ్చరించారు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాలలో మార్పు అని.. కానీ టీఆర్‌ఎస్‌ పాలనలో అవేవీ కనిపించడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభధ్రం అన్నారు. 154 రోజుల పాటు 4200 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో ముగిసిన సందర్భంగా ఆయన పాదయాత్ర విశేషాలు వెల్లడించారు. పాదయాత్రలో 1520 గ్రామాలు తిరగడం జరిగిందని, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించి ప్రాణాలు అర్పించిన యువత.. అడ్డాకూలీలుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో పిట్టల్లా ప్రజలు రాలుతున్నారని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉందన్నారు. పాలకుల పాపంతో తెలంగాణలో ఇంకా పరిశ్రమలు మూతపడుతూనే ఉన్నాయన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. ప్రధానిగా అధికారం చేపట్టిన మోదీ రెండేళ్ల పాలనకాలంలో సాధించింది ఏంటని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌, గోరక్షక దళాలు దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ్మినేని పాదయాత్రను ఆయన మావో లాంగ్‌మార్చ్‌తో పోల్చారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ సీఎం.. పినరయి విజయన్‌.. 93 శాతం అట్టడుగు వర్గాలు ఉన్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు వారికి అందడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమైందన్నారు. దీనిని బట్టే ప్రభుత్వం పాదయాత్రను చూసి ఎంతగా భయపడిందో అర్థమవుతోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి... హామీలు నెరవేర్చకుంటే తల నరక్కుంటాననే కేసీఆర్‌.. ఎన్నిసార్లు తల నరుక్కుంటారని నిలదీశారు.  కేసీఆర్ ఎర్రవల్లికి ముఖ్యమంత్రా లేక యావత్ తెలంగాణాకా? అని ప్రశ్నించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభలో గద్దర్, మల్లు స్వరాజ్యం, కాకి మాధవ రావు, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, ప్రొ.హారగోపాల్, కంచె ఐలయ్య, ఆర్ కృష్ణయ్య, విమలక్క తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తమ్మీద తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే సీపీఎం లక్ష్యం పాదయాత్రతో కొంతమేరకు విజయవంతమైనట్లు కనిపిస్తోంది.


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials