Live News Now
  • బిజెపి నుంచి మాధవ్,బొడ్డు రాంబాబు, తోట శ్రీను..
  • కొల్ కత్తా: గోల్డెన్ పార్కు హోటల్ లో అగ్నిప్రమాాదం.. ఇద్దరు మృతి
  • ఏపి అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజిపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసిపి డిమాండ్..
  • వైసిపి సభ్యల ఆందోళనతో సభ మరోసారి వాయిదా..
  • ప.గో: మొదల్తూరు మల్లపురాజుతోట ఆనంద్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదం..
  • విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి...
  • సహాయ చర్యలు చేపట్టాలని ప.గో జిల్లా కలెక్టర్ కు చంద్రబాబు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని హైకోర్టు ఆదేశం..
  • హెచ్ సిఎ ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు..
  • అధ్యక్ష పదవికి పోటీపడిన వివేక్, జయసింహ..నేడో,రేపో ఫలితాలు వెలువడే అవకాశం..
ScrollLogo మద్యం అరువు ఇవ్వలేదని హత్యాయత్నం.. వ్యాపారి పరిస్థితి విషమం..ఆస్పత్రికి తరలింపు.. ScrollLogo జాతీయ రహదారులపై మద్యం దుకాణాల నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ ScrollLogo హైవేపై 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు.. ScrollLogo సుప్రీంకోర్టు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దుకాణ యజమానుల పిటిషన్.. ScrollLogo 500 మీటర్ల పరిధిని తగ్గించాలని కోరిన యజమానుల సంఘం.. ScrollLogo అమరావతి: చంద్రబాబును సత్కరించిన మంగళగిరి నియోజకవర్గ రైతులు... ScrollLogo గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్.. స్వాగతం పలికిన జనసేన కార్యకర్తలు, అభిమానులు ScrollLogo ఎమ్మెల్సీగా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం.. హాజరైన బాలకృష్ణ,పత్తిపాటి పుల్లారావు,పల్లె,మాణిక్యాలరావు.. ScrollLogo ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన బచ్చుల అర్జునుడు, కరణం బలరాం,డొక్కా మాణిక్యవరప్రసాద్, ScrollLogo బిటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, పిడిఎఫ్ నుంచి కత్తి నరసింహారెడ్డి,శ్రీనివాసులరెడ్డి,

ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అక్కసు

MP-Jithender-Reddy-Vs-MLA-Srinivas-Goud-in-Public-Meet,-Telangana
Posted: 11 Days Ago
Views: 853   

ఆయన టీఆర్‌ఎస్‌ ఎంపీ. పార్లమెంటరీ పార్టీ నేత కూడా. ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాజకీయాల నుంచీ వైదొలుగుతానన్నారు. ఇంతకీ.. ఆ నేతకు అంత పెద్ద కష్టం ఎందుకొచ్చింది? అందుకు దారి తీసిన పరిణామాలేంటి?
ఎంపీ జితేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారట. మళ్లీ రాజకీయాల వైపు తిరిగి కూడా చూడరట. ఆయన ఎందుకింత పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు? టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న జితేందర్‌రెడ్డి.. రాజీనామా చేస్తాననేంత మాట ఎందుకనాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. విపక్షం ఉడికించినందుకు ఆయన రాజీనామా చేస్తాననలేదు. స్వపక్షం నుంచి వచ్చిన ఆరోపణలతోనే జితేందర్‌రెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధమన్నారు. ఇంతకీ.. ఆయన ప్రకటనకు కారణం ఏమిటో తెలియాలంటే ఈ మాటకు ముందు కొన్ని క్షణాలు వెనకకు వెళ్లాలి.. విన్నారుగా.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా ఎంపీ అడ్డుకున్నారట. ఈ విషయం ఓ కేబినెట్‌ మంత్రే తనకు చెప్పారంటూ శ్రీనివాస్‌గౌడ్‌ చెబుతున్నారు. అది నిజమని నిరూపిస్తే రాజీనామాకైనా సిద్ధమంటూ జితేందర్‌రెడ్డి సవాల్‌ విసరడంతో వీరిద్దరి మధ్య జరిగిన ఎపిసోడ్‌ తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీలో పలువురు నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందని.. అందుకు వీరి మధ్య జరిగిన సంభాషణే ఉదాహరణంటూ చర్చ మొదలైంది. ఇంతకీ.. శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా ఎంపీ అడ్డుకున్నారంటూ చెప్పిన ఆ మంత్రి ఎవరు? పాలమూరు జిల్లాకు చెందిన మంత్రా? లేక బయటి జిల్లా మినిస్టరా? అనేది ఎమ్మెల్యేకే తెలియాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు కేబినెట్‌లో ఉన్నారు. వీరిలో ఒకరే శ్రీనివాస్‌గౌడ్‌ చెవిలో ఊదారంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా జిల్లా నేతల మధ్య సమన్వయం లేదంటూ, ఆధిపత్య పోరు నడుస్తుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా.. ఎపిసోడ్‌తో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టైంది. గత రెండున్నర ఏళ్లుగా మంత్రి పదవి రానందుకు శ్రీనివాస్‌గౌడ్‌ అసంతృప్తిగా ఉన్నారా? తన పదవిని అడ్డుకున్నారని ఎంపీపై కడుపులో అక్కసు పెట్టుకున్నారా? ఇంతకాలం తర్వాత ఇప్పుడు బయటపడ్డారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. త్వరలోనే తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రేసులో శ్రీనివాస్‌గౌడ్‌ పేరూ వినిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ఇలా మీడియా సాక్షిగా ఎమ్మెల్యే ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై గులాబీబాస్‌ ఎలా స్పందిస్తారనరేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials