Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

శోభన్ బాబు, జయలలిత బంధం గురించి చెప్పిన వాణి విశ్వనాథ్

Vani-vishwanath-sensational-comments-on-shoban-babu-and-jayalalita-relationship
Posted: 216 Days Ago
Views: 2986   

నిన్నటి తరం కథానాయిక వాణివిశ్వనాథ్ మళ్ళీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లం కొండ శ్రీను హీరోగా నటిస్తున్న తాజా సినిమాలో వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కంపించబోతున్నది. ఈ నేపద్యంలో వాణి విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో తనకు అలనాటి అందాల నటుడు శోభన్ బాబు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నది.. శోభన్ బాబు వద్ద తాను ఓ చిన్న పిల్లలా ఉండేదాన్నని, అప్పుడు ఏమి అడగాలో ఏమి అడగకూడదో.. అది తప్పా? ఒప్పా? అనేవి తెలియవని.. చెప్పింది.. తాను ఎన్ని సార్లు జయలలిత గురించి అడిగినా ఆయన నవ్వుతూ.. సమాధానం చెప్పే వారని అలనాటి సంగతులు గుర్తు చేసుకొన్నది..
తాను ఎన్ని సార్లు జయలలిత గురించి ప్రస్తావించినా శోభన్ బాబు మాత్రం "జయలలితగారు చాలా తెలివైనవారు. చాలా పుస్తకాలు చదువుతారు" అని నవ్వుతూ చెప్పి తప్పించుకొనే వారు అని వాణి విశ్వనాథ్ అన్నది. అప్పట్లో శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు.. అమ్మాయిల కలల హీరోగా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శోభన్ బాబుకి నిద్ర లేకుండా చేసిన హీరోయిన్ జయలలిత. శోభన్ బాబు తో నటించడానికి అప్పటి తరం హీరోయిన్స్ అంతా తెగ ఇష్టపడితే.. శోభన్ బాబుకి మాత్రం జయలలిత అంటే ఏదో తెలియని ఆకర్షణ... ఆమెతో సినిమాలు చేయడానికి శోభన్ బాబు ఎప్పుడు ఆసక్తి కనపరిచే వాడు అన్న ప్రచారం ఉంది.
తొలిసారి 1973లో 'డాక్టర్ బాబు' సినిమా లో శోభన్ బాబు జయలలిత కాంబినేషన్ మొదలు అయ్యింది.. అనంతరం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు బాగా హిట్ అయ్యాయి. శోభన్ బాబుతో అలా చాలా క్లోజ్ జయలలిత తల్లిని కోల్పోయాక ఒంటరితనం ఫీలయ్యేది. ఈ క్రమంలో శోభన్ బాబుతో పరిచయం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శోభన్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ జయను మరింత ఆకర్షించింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి పెళ్లి చేసుకోవాలను కొన్నారని, కానీ అప్పటికే పెళ్ళైన శోభన్ బాబు ఆమెని రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించినట్లు టాక్.. కానీ ఇద్దరి ఓ పాప అనే రూమర్ వచ్చాక శోభన్ బాబుకు జయలలిత దూరం అయ్యిందట..
అయితే జయలలిత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల వైపు వెళ్లి పోయిన తరువాత ఆమె శోభన్ బాబును పూర్తిగా మరిచిపోయిందని అంటారు. కాగా అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటిరిదానిలా బతుకుతున్నా నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు చెప్పారు.. ఏది ఏమైనా ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయిన విషయాలను తిరిగి మళ్ళీ  వాణి విశ్వనాథ్ తెరపైకి తీసుకు రావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. జయలలిత, శోభన్ బాబు మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ నేపథ్యంలో.... వాణి విశ్వనాథ్ ఈ విషయాలను ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials