Posted: 400 Days Ago
Views: 167
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మూడేళ్లలో ప్రభుత్వ అస్తవ్యస్త రుణమాఫీ విధానం వల్ల రాష్ట్రంలోని కమర్షియల్ బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడం వల్ల రైతులు బయట నుంచి వడ్డీలకు అప్పులు చేశారన్నారు. 12 వేల మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.