Live News Now
  • శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...కాలినడక భక్తులకు 10 గంటలు సమయం
  • నేడు మూడోరోజు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా పర్యటన
  • ఉత్తరాఖండ్: డెహ్రాడూన్‌లోని ఓ షాపింగ్ మాల్ లో ఈడీ సోదాలు..
  • రూ.51 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం... ఫెమా చట్టం కింద షాపు యజమాని పై కేసు నమోదు
  • అమరావతి: ముఖ్యనాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. క్రమశిక్షణ రాహిత్యం పై చంద్రబాబు ఆగ్రహం
  • రేపు విజయవాడలో అమిత్ షా, చంద్రబాబు భేటీ
  • హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో కలిసి వెళ్లనున్న అమిత్ షా, చంద్రబాబు
  • విజయవాడలో ఏపీ బీజేపీ సదస్సులో పాల్గొననున్న అమిత్ షా
  • అమిత్ షాకు లంచ్ ఆతిధ్యం ఇవ్వనున్న చంద్రబాబు
  • మహారాష్ట్ర: ఔరంగాబాద్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. కారు- లారీ ఢీ, ఏడుగురు మృతి
ScrollLogo ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం.. నదిలో బస్సు బోల్లా, 22 మంది మృతి.. 8 మందిని కాపాడిన రెస్క్యూటీం ScrollLogo ఉత్తరకాశీ నుంచి గంగోత్రి వెళ్తుండగా ఘటన... మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తింపు ScrollLogo హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో అర్థరాత్రి పోలీసుల తనిఖీలు.. 20 వాహనాలు సీజ్ ScrollLogo నేటి నుంచి టీఎస్ సెట్-2017 హాల్ టికెట్లు... జూన్ 11న పరీక్ష, 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ScrollLogo హైదరాబాద్: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు.. పాల్గొననున్న చంద్రబాబు ScrollLogo విశాఖ: నేటి నుంచి ఆస్పత్రుల్లో స్వచ్ఛ సప్తవర్ణ దుప్పట్ల విధానం.. ScrollLogo కేజీహెచ్ గైనిక్ వార్డులో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్న చంద్రబాబు ScrollLogo తిరుమల: నేడు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు నిరాకరణ ScrollLogo భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలను అనుమతించబోమన్న జేఈవో ScrollLogo తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు
TELE "VISION"

రాజమండ్రి రూరల్‌ పంచాయితీల్లో నిధుల గోల్‌మాల్‌

Panchayat-Secretaries-Suspended-Due-to-Gram-Panchayat-Funds-Scam
Posted: 66 Days Ago
Views: 74   

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలోని పంచాయితీల్లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై టీవీ5 ప్రసారం చేసిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. నిధుల గోల్‌మాల్‌, పంచాయితీ కార్యదర్శుల ఆక్రమాలు, జన్మభూమి కమిటీల దందాలపై టీవీ-5 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై విచారణ జరిపిన ప్రభుత్వం.. పంచాయితీ కార్యదర్శుల అవినీతి అక్రమాలు రుజువు కావడంతో ఇద్దరిని సస్పెండ్ చేసి, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  దీనంతటి వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నట్లు గుర్తించారు. 

బొమ్మూరు పంచాయితీలో 74.6 లక్షల నిధులు, పిడింగొయ్యి పంచాయితీలో జనావాసాలే లేని ప్రాంతాలలో రోడ్లు వేసి 12.60 లక్షల గోల్‌మాల్‌, ధవళేశ్వరం పంచాయితీలో బినామీ పేర్లతో పింఛన్‌ సొమ్ములు డ్రా చేయడంపై అధికారులు విచారణ జరిపారు. పంచాయితీ కార్యదర్శులు జన్మభూమి కమిటీలతో కుమ్మక్కైనట్లు గుర్తించారు. పిడింగొయ్యి పంచాయితీ కార్యదర్శి సురేష్‌ చంద్రను, బొమ్మూరు పంచాయితీ కార్యదర్శి ఎల్‌వీవీ సత్యనారాయణను సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే రాజవోలు పంచాయితీ కార్యదర్శి చైతన్యకు, ధవళేశ్వరం పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసరావుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

మేజర్‌ పంచాయితీలైన ధవళేశ్వరం, రాజవోలు, పిడింగొయ్యి, బొమ్మూరు పంచాయితీల్లో అధికారపార్టీ నేత, పంచాయితీ కార్యదర్శులు విచ్చలవిడిగా చేతివాటం ప్రదర్శించడంతో ఆయా పంచాయితీల్లో అవినీతి పరాకాష్టకు చేరింది. టీవీ-5 ఆ అక్రమాలపై వరుస కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం వాటిపై లోతుగా విచారణ చేపట్టింది. ఇప్పటికే నలుగురు పంచాయితీ కార్యదర్శులపై చర్యలు తీసుకున్న అధికారులు మరిన్ని పంచాయితీల్లో విచారణ చేపట్టారు. రానున్న రోజుల్లో మరో ముగ్గురు పంచాయితీ కార్యదర్శులను కూడా సస్పెండ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. 


Read Also
NRI Edition
AP News
Telangana News
Pata
Sports
Daily Specials