Live News Now
  • స్మార్ట్ సిటీ నిర్మాణానికి దుబాయ్ కంపెనీలు.. చంద్రబాబు సమక్షంలో MOUలు
  • చంద్రబాబు డైరెక్షన్‌లో TTDP నేతల భేటీ.. రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కీలక చర్చ
  • కాసులిస్తే క్షణాల్లో ఫేక్ సర్టిఫికేట్స్.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
  • ముంబై వన్డేలో కివీస్‌ టార్గెట్‌ 281 రన్స్.. 2 వందల మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ..
  • పంచాయతీలుగా గిరిజన తండాలు.. అసెంబ్లీలో బిల్లు తెస్తామన్న KCR
  • పంటలు నష్టపోతున్నా పట్టించుకోరా.. TRS సర్కార్‌పై ఉత్తమ్ నిప్పులు
  • పేదల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నా.. కొడంగల్ నుంచే పోటీ చేస్తానన్న రేవంత్
  • డిసెంబర్‌లో జనంలోకి పవన్.. రెండు రాష్ట్రాల్లో ప్లీనరీలకు ప్లాన్
  • నంద్యాలలో కుప్పకూలిన శోభా లాడ్జీ.. రోడ్డు విస్తరణ పనుల్లో అపశృతి
  • ఆసియా కప్ హాకి విజేత భారత్.. ఫైనల్లో మలేషియాపై విజయం
ScrollLogo దుబాయ్‌లో బిజిబిజీగా చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు ScrollLogo కాసేపట్లో టెక్స్‌టైల్ పార్క్‌కు శంకుస్థాపన.. వరంగల్‌ జిల్లాలో విపక్ష నేతల అరెస్ట్ ScrollLogo 15 సంస్థలు..3 వేల కోట్ల పెట్టుబడులు.. KTR, కడియం సమక్షంలో MOUలు ScrollLogo హక్కుల సాధనకు బీసీల గర్జన.. రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ScrollLogo అమరావతికి దుబాయ్ కంపెనీల క్యూ.. చంద్రబాబు సమక్షంలో MOUలు ScrollLogo గంజాయి కేసులో ముగ్గురు అరెస్ట్.. ప్రతిపక్షాలను భయపెడుతున్నారన్న శ్రీధర్ బాబు ScrollLogo ఘెఘా, దహేజా మధ్య ఫెర్రీ సేవలు.. గుజరాత్ అభివృద్ధికి మోడీ వరాలు ScrollLogo ముంబై వన్డేలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ.. నిలకడగా భారత్ బ్యాటింగ్ ScrollLogo గడువులోగానే పంచాయితీ ఎన్నికలు.. TRS పారిపోయే పార్టీ కాదన్న KCR ScrollLogo భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. టెక్స్ టైల్ పార్క్ వరంగల్‌కు వరమన్న సీఎం

కాటమరాయుడు రివ్యూ.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ...

Katamarayudu-Review
Posted: 213 Days Ago
Views: 603   

రివ్యూ        : కాటమరాయుడు
తారాగణం        : పవన్ కళ్యాణ్, శ్రుతి హాసన్, అలీ, రావురమేష్, అజయ్, శివబాలాజీ, నాజర్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజ్,  ప్రదీప్ రావత్ తదితరులు
ఎడిటింగ్        : గౌతమ్ రాజు
సినిమాటోగ్రఫీ    : ప్రసాద్ మూరెళ్ల
సంగీతం        : అనూప్ రూబెన్స్
నిర్మాత        : శరత్ మరార్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం    : కిశోర్ కుమార్ పార్థసాని
రిలీజ్ డేట్        : 24.03.17
జానర్        : లవ్, యాక్షన్ ఎంటర్టైనర్


పవన్ కళ్యాణ్ స్టామినా గురించి కొత్తగా చెప్పేదేముందీ.. పవర్ స్టార్ గా బాక్సాఫీస్ ను రూల్ చేస్తోన్న పవన్ ఇప్పుడు కాటమరాయుడుగా వచ్చాడు. ఫస్ట్ లుక్ నుంచే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన రాయుడు.. ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తో కాటమరాయుడుకు ముందే హిట్ కళ తెచ్చాడు. మరి ఆ కళ ఇవాళ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ లోనూ కనిపించిందా.. కాటమరాయుడి కథ ఏంటనేది ఇప్పుడే చూసేద్దాం..

కథ    :

కాటమరాయుడు.. నలుగురు తమ్ముళ్లతో కలిసి రాయలసీమలో జీవిస్తుంటాడు. అన్యాయాన్ని సహించడు. అతనుండగా ఆ ప్రాంతంలో అక్రమాలు చేయడం అసాధ్యం. అందుకే రాయుడ్ని చంపాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. దీంతో తప్పనిసరిగా కత్తిపట్టి అందరినీ ఎదుర్కొంటుంటాడు. మరోవైపు కాటమరాయుడికి ఆడవాళ్లంటే పడదు. దీంతో పెళ్లి ఊసే ఎత్తడు. పైగా తన ప్రేమల్లో ఉన్న తమ్ముళ్లను కూడా పెళ్లి విషయంలో కట్టడి చేస్తాడు. దీంతో ఆయన తమ్ముళ్లంతా కలిసి ముందు అన్నను ప్రేమలోకి దింపితే తర్వాత తమ ప్రేమలూ గెలిపించుకోవచ్చని.. అవంతి అనే అమ్మాయిని అన్న వైపు ఎంకరేజ్ చేస్తారు. అవంతికి హింస అంటే అస్సలే పడదు. హింస లేకుండా రాయుడు లేడు. అందుకే రాయుడు మంచి వాడని కలరింగ్ ఇస్తూ అవంతిని మభ్య పెడతారు తమ్ముళ్లు. దీంతో ముందు బెట్టు చేసినా తర్వాత రాయుడు కూడా అవంతితో ప్రేమలో పడతాడు.. తమ ప్రేమ విషయాన్ని చెప్పి తండ్రికి రాయుడును పరిచయం చేయడానికి తీసుకువెళుతుంటుంది అవంతి. ఆ టైమ్ లో ట్రెయిన్ లో వీరిపై అటాక్ జరుగుతుంది. దీంతో రాయుడి హింసాత్మక చరిత్ర తెలిసిన అవంతి అతన్ని అసహ్యించుకుని వెళ్లిపోతుంది. మరి తన ప్రేమను గెలచుకోవడం కోసం అవంతి ఊరు వెళతాడు.. ప్రేమ కోసం హింసను వదిలేస్తున్నాని చెబుతాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం పెద్ద ఆపదలో ఉందని తెలిసి మళ్లీ కత్తిపడతాడు కాటమరాయుడు.. మరి అతని హింసను అవంతి కుటుంబం ఎలా రిసీవ్ చేసుకుంది. అసలు అవంతి కుటుంబానికి ఉన్న ఆపద ఏంటీ.. ఎలాంటిది అనేది మిగతా కథ..
 
విశ్లేషణ    :

రాయలసీమ ప్రాంతంలోని అడవుల్లో ఎర్రచందనం దొంగతనానికి కాటమరాయుడ సహాయం కోసం ఓ వ్యాపారి వస్తాడు. అక్కడి నుంచి మొదలయ్యే కథ.. ఫస్ట్ సీన్ లోనే పవన్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తారు. ఆ సీన్ తోనే రాయుడు క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పకనే చెబుతారు. ఆ చుట్టుపక్క రౌడీఇజం అనే మాట పూర్తికాకపోతే కాటమరాయుడు అనేమాట గొంతులో దిగుతుంది. అదీ అతని రేంజ్. నలుగురు తమ్ముళ్లతో సరదాగా జీవితాన్ని గడిపేసే కాటమరాయుడి చిన్నతనంలోని ఓ ఫ్లాష్ బ్యాక్ వల్ల అమ్మాయిలు, ప్రేమ, పెళ్లివంటి విషయాలను దగ్గరకు రానివ్వడు. ఇటు తమ్ముళ్లు.. తను తమ్ముడిలా చూసుకునే లాయర్ అలీ మాత్రం ప్రేమలో పడతారు. మరి వీరి ప్రేమ ఫలించాలంటే అన్నయ్య పర్మిషన్ కావాలి.. అందుకే అతన్ని ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తారు.. కథగా చెప్పుకుంటే ఓల్డ్ ఫార్ములానే కానీ.. ఆ ఫార్ములా పవన్ కళ్యాణ్ చేయడంతో ఎనర్జిటిక్ గా సాగుతుంది. ముఖ్యంగా ఫైట్స్ అన్నీ అదిరిపోయాయి. అలాగే మందు తాగే సందర్భంలో వచ్చే పాట మాస్ తో కేకలు వేయిస్తుంది. ఇక అవంతి అనే అమ్మాయి రాయుడు లైఫ్ లోకి వచ్చాక జరిగే సీన్స్ అన్నీ చాలా ఫన్నీగా సాగిపోతాయి. ముఖ్యంగా పువ్వులు కోసుకునే సీన్ లో పవన్ నటనకు అమ్మాయిలు కూడా సిగ్గుపడిపోతారేమో. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత పవన్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. ఇక ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ ఫ్యాన్స్ కోసమైతే.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్.. బి, సి సెంటర్ ప్రేక్షకులను ఉర్రూతలూపుతుంది.. మొత్తంగా అవంతి కోసం అన్నీ వదిలేయడానికి సిద్ధపడ్డా.. ఆమె కోసమే మళ్లీ కత్తిపట్టాల్సి రావడమనేది కొత్తగా లేకపోయినా.. ఆ పాత్రలో పవన్ చెలరేగిన విధానం పాత సినిమాలను గుర్తుకు రాకుండా చేస్తుంది. ఇక నటన పరంగా పవన్ ఈ సినిమాకు ఒన్ మేన్ షో చేశాడు. అలీ నవ్వించాడు. నలుగురు తమ్ముళ్లూ ఫర్వాలేదు. శ్రుతిహాసన్ నటన పరంగా ఆకట్టుకోలేకపోయింది. నాజర్ పాత్ర రొటీన్. రావు రమేష్ కొత్తగా ట్రైచేశాడు కానీ.. కాస్త అతిగా అనిపిస్తుంది. ఇతర పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోయేవే.
 పవన్ కళ్యాణ్ ఒన్ మేన్ షో .. అంటే ఫ్యాన్స్ కు ఇది ఫుల్ మీల్స్ అన్నమాట. ప్రేమ కోసం కత్తి వదిలేసినా.. ప్రేయసి ఫ్యామిలీ కోసం కత్తి పట్టడం అంటే ఆల్మోస్ట్ ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డట్టే.. ఏదేమైనా ఈ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ లో టెక్నికల్ సపోర్ట్ కూడా బానే ఉన్నట్టనిపిస్తుంది..
టెక్నికల్ గా ఈ సినిమాకు మ్యూజిక్ మైనస్ అయింది. పాటలు సోసోగా ఉన్నాయి. కొన్ని చోట్ల బిజిఎమ్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సూపర్. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త ట్రిమ్ చేసినా ఫర్వాలేదనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.కానీ పాటల్లో శ్రుతి కాస్ట్యూమ్స్ క్యారెక్టర్ ను డీ గ్రేడ్ చేశాయి. మాటలు ఆకట్టుకుంటాయి. పాటల్లో సాహిత్యం ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి..


ప్లస్ పాయింట్స్     :
పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ
మాటలు
దర్శకత్వం
ఫైట్స్

మైనస్ పాయింట్స్     :

కామెడీ
సంగీతం
స్క్రీన్ ప్లే

ఫైనల్ గా    : ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ .. కాటమరాయుడు

 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials