Live News Now
  • తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు..జలకళను సంతరించుకుంటున్న ప్రాజెక్టులు
  • రసవత్తరంగా మొదటి వన్డే...దంబుల్లాలో భారత్‌-శ్రీలంక హోరాహోరీ
  • హైదరాబాద్‌ మల్లేపల్లిలో ట్రాలీ ఆటో బీభత్సం...అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన ఆటో
  • చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా వైసిపిదే విజయం : సుబ్బారెడ్డి
  • నంద్యాలలో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు..ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో టీడీపీ, వైసీపీలు
  • నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త సిస్టమ్...ఎవరికి ఓటువేశామో తెలుసుకునే సౌకర్యం
  • 2019 లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం...సెప్టెంబర్‌లో అమిత్‌ షా టూర్‌తో శ్రీకారం
  • కాల్పులు జరిపించుకోవాల్సిన అవసరం లేదు...పోలీసుల కథనంపై విక్రం గౌడ్ అగ్రహం
  • గణేష్‌ చందా ఇవ్వలేదని పోలీసులపై దాడి...చిత్తూరు జిల్లా పద్మావతిపురం వాసుల దుశ్చర్య
  • తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు...జిల్లాల్లో పొంగుతున్న వాగులు, చెరువులు
ScrollLogo ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్ ScrollLogo క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను అతికష్టంమీద బయటకు తీసిన హైవే సిబ్బంది ScrollLogo ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్ కు లేదు...నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమన్న చంద్రబాబు ScrollLogo మహిళల భద్రతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం..181 హెల్ప్ లైన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల ScrollLogo హైదరాబాద్, నిజాంపేటలో దారుణం...పార్క్ లో కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య ScrollLogo భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో లంచావతారాలు...డబ్బులివ్వందే ఏపని చేయని సిబ్బంది ScrollLogo గోరక్ పూర్ చేరుకున్న రాహుల్...ట్రాజడీ టూరిస్ట్ అంటూ సీఎం యోగి సెటైర్లు ScrollLogo సామాజిక సమీకరణాలతో ప్రచార ఉధృతి...నంద్యాలలో తారస్థాయికి చేరిన క్యాంపెయిన్ ScrollLogo పాత కక్షలతోనే పోలీసుల ఆరోపణలు...కాల్పుల కథనాన్ని ఖండించిన విక్రమ్‌గౌడ్‌ ScrollLogo ఆలయ అభివృద్ధి పనులు అద్భుతం...కేసీఆర్‌పై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి ప్రశంసల వర్షం

ఐపీఎల్‌ ప్రారంభోత్సవం రేపు

ipl-match-starts-tomorrow-in-hydrabad
Posted: 139 Days Ago
Views: 238   

మధ్యలో ట్రోఫీ.. అటు ఇటూ సారథులు.. దిగ్గజ క్రికెటర్లు.. ఆటపాటలు.. విందు, వినోదాలతో సాగే ఐపీఎల్‌ ఆరంభోత్సవంలో ఈసారి చిన్న మార్పు! గత తొమ్మిదేళ్ళు తొలి మ్యాచ్‌ వేదికలోనే ఆరంభోత్సవాలు జరగ్గా.. ఐపీఎల్‌లోని 8 జట్లు వారి సొంతగడ్డపై ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తుండటం ఈసారి ప్రత్యేకత. అందులో మొదటి అంకం హైదరాబాద్‌లోనే. వేదిక ఉప్పల్‌ స్టేడియమే. ఐపీఎల్‌లో ఇది పదో సీజన్‌ కావడంతో దీన్ని ప్రత్యేకంగా భావించి స్థానిక ప్రేక్షకులకు వినోదం పంచాలన్న ఫ్రాంచైజీల కోరిక మేరకు 8 వేదికల్లో ఆరంభ వేడుకల్ని నిర్వహించాలని ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయించింది. ప్రతి ఫ్రాంచైజీ తన సొంతగడ్డపై తలపడే మొదటి మ్యాచ్‌కు ముందు ఆరంభోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌దే మొదటి వంతు. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు ముందు ఉప్పల్‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. అరగంట పాటు ఆరంభోత్సవం ఉంటుంది. సాయంత్రం 6.20కి దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందుల్కర్‌, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ గోల్ఫ్‌ కార్ట్‌లలో మైదానంలోకి వస్తారు. దిగ్గజాల ఘనతలను కీర్తిస్తూ ఆడియో, వీడియో ప్రదర్శించాక సన్మానం ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. తర్వాత బాలీవుడ్‌ నటి అమీ జాక్సన్‌ 300 మంది డ్యాన్సర్లతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. అనంతరం ఎ.ఆర్‌.రెహమాన్‌ బృందం ప్రదర్శన ఉంటుంది. రెహమాన్‌ రాకపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అతని సహాయకులు ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆరంభ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. 7 గంటలకు మైదానంలో సన్‌రైజర్స్‌, బెంగళూరు ఆటగాళ్ళ వార్మప్‌ మొదలవుతుంది. 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials