Live News Now
  • మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు
  • సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు
  • చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి
  • టీటీడీ సభ్యురాలిగా అనిత తొలగింపు ఎమ్మెల్యే విజ్ఞప్తి లేఖకు చంద్రబాబు ఓకే
  • సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్డీఏ వైఫల్యాలపై గర్జించిన కామ్రేడ్లు
  • విభజన హామీలు.. తాజా రాజకీయాలే అజెండా గవర్నర్‌తో సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు భేటీ
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • మిషన్ భగీరథ దేశానికే ఆదర్శమన్న కేసీఆర్ పెండింగ్ పనులు పరుగులు పెట్టించాలని ఆదేశం
  • ఎంపీలు, ముఖ్యనేతలతో జగన్ కీలక భేటీ ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • కాల్పుల మోతతో దద్దరిల్లిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్లో 14మంది మావోయిస్టులు మృతి
ScrollLogo ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. కరీంనగర్‌లో ముగ్గురి దుర్మరణం ScrollLogo కామన్వెల్త్‌ దేశాధినేతలతో మోడీ చర్చలు ScrollLogo 250 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం.. జపాన్‌లో వందల కిలోమీటర్ల మేర ప్రభావం ScrollLogo ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ScrollLogo సీజేఐపై అభిశంసన నోటీసుపై పొలిటికల్‌ ఫైట్‌.. ScrollLogo జర్మనీ ఛాన్సలర్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు ScrollLogo రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ScrollLogo హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్.. ScrollLogo కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం.. ScrollLogo తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌

చెలియా రివ్యూ : స్వచ్ఛమైన ప్రేమకథ..

cheliya-review
Posted: 381 Days Ago
Views: 728   

మణిరత్నం వెండితెరెపై ప్రేమకావ్యాలను రాసిన ఘనుడు. సినిమా పరిణామం టెక్నాలిజీ వైపు పరుగులు పెడుతుంటే భావోద్వేగాల బలం పైనే ఆధారపడుతున్న ఈ క్రియేటివ్ జీనియస్ మరో ప్రేమకథను చెప్పేందుకు సిద్దం అయ్యాడు. చెలియా ట్రైలర్స్ లో కనిపించే ఫ్రెష్ ఫీల్.. అదితిరావ్ అందం మణిరత్నం కథకు అదనపు ఆకర్షణగా మారాయి. మరి చెలియా ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యిందో చూద్దాం..

కథ:
1999 కార్గిల్ యుద్దం జరిగే సమయం  లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం ప్రమాదానికి గురౌతుంది. అందులోని పైలెట్ వరుణ్ ( కార్తి) పాకీస్థాన్ సైనికులకు చిక్కుతాడు. పాకీస్థానీ జైల్లో చిత్ర హింసలు అనుభవిస్తున్న ఆ పైలెట్ లక్ష్యం అక్కడినుండి తప్పించుకోని తన ప్రేయలి లీలా అబ్రహాం( అదితిరావ్) ను కలవడం.  లీలాని క్షమించమని అడగడం.. తన జీవితం అయిన లీలా ను ఎందుకు దూరం చేసుకున్నాడు. వారి ప్రేమ ఎందుకు బద్దలయ్యింది.. వరుణ్ లీలాను కలుస్తాడా లేదా ...? అనేది మిగిలిన కథ..?

కథనం:
సినిమా కెమెరా కన్నులు తో చూడాలంటారు.. కానీ రవి వర్మ చూపించిన ప్రతి ప్రేమ్ ఒక ఆర్టిస్టిక్ గా ఉంది. అదితిరావ్ క్యారెక్టర్ తో పాటు ఆమె అందం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కార్గిల్ వార్ కి ముందు జరిగే ఈ కథ కాశ్మీర్ అండ్ లడక్ వంటి ప్రదేశాలలలో చిత్రీకరించారు. ఈ కథకు అందమైన లోకేషన్స్ తో పాటు అదితిరావ్ అందం ఈ ప్రేమకథకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మణిరత్నం సినిమాల తరహాలోనే చెలియా సినిమా కూడా నడుస్తుంది. వేగం, మలుపులు ఆశిస్తే నిరాశే కలుగుతుంది. అతని నైజం విధ్వస్వం.. ఆమె నైజం ప్రాణాలు కాపాడటం..వీరి మద్య కలిగన ప్రేమ ఒక ఎమోషన్స్ లో ఉండదు. భిన్నమైన స్వరూపాలతో కనిపిస్తుంటుంది. కానీ లీలా అబ్రహాం క్యారెక్టర్ కి అదితా ప్రాణం పోసింది. కెమెరాలో ఆమె కనిపించిన తీరు రవివర్మ పెయింటింగ్ ని తలపిస్తాయి.వీరి పాత్రల మద్య సంఘర్షణ చాలా సున్నితంగా తెరకెక్కించాడు దర్శకుడు ...  ఒక సారి శ్రీనగర్ మంచు ప్రాంతాలలోకి వీరు వెళతారు. ఆ నేచర్ చూసి లీలా చాలా ఎగ్జైట్ అవుతుంది. ఎంతగా అంటే అక్కడినుండి రాలేనంతగా.. ఇంతలో హీరో ఇక్కడినుండి వెంటనే వెళ్ళాలి అంటాడు.. నేను రాను అంటుంది.. రాకపోతే కుదరకు వెంటనే బయలు దేరాలి అంటాడు. కదలమని చెయ్యి పట్టుకొని బలవంతం చేస్తాడు, నేను రానని వెనక్కు పరిగెడుతుంది. అతనూ పరిగెత్తి ఇక్కడే ఉంటే ఇద్దరం చస్తాం వెళదాం అంటాడు. మరి ఇందాక అలా ఎందుకు దౌర్జన్యం చేసావు అంటుంది . ఆడవారి ముందు బలం చూపించే వారంటే నాకు నచ్చదు అంటుంది హీరోయిన్. వీరి పాత్రలు మద్య సంఘర్షణ అంత సున్నితంగా ఉంటుంది. ప్రేమను కావాలనుకొని తనను తాను కోల్పోతున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ పలికించే భావాలు కట్టి పడేస్తాయి. తన స్వభావం తో అరిచి తర్వాత బతిమిలాడుకొనే హీరో క్యారెక్టర్ యూత్ కి బాగా రిలేట్ అవుతుంది.  ప్రేమ కథలో సోల్ అమ్మాయే అని మరోసారిఈ కథతో నిరూపించాడు మణిరత్నం. రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాలా వద్దా అని హీరోయిన్ ప్రిపేర్ అయ్యే సన్నివేశం చాలా సహాజంగా చిత్రీకరించాడు దర్శకుడు. హీరో క్యారెక్టర్ ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో హీరోయిన్ క్యారెక్టర్ అంత ఉన్నతంగా ప్రవర్తిస్తుంది. ఇంత స్వచ్ఛమైన పాత్రను సృష్టించినందుకు మణిరత్నం ను అభినందించాలి. ఫస్టాఫ్ లో వీరి ప్రేమకథకు కనెక్ట్ అయిన ప్రేక్షకులు సెకండాఫ్ లో వీరి మద్య వచ్చే సంఘర్షణ కు అవుతారు. ఇక రోమాంటిక్ సన్నివేశాలకు రెహామాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బలాన్నిచ్చింది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ ప్రేమకథలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ చాలా ప్రతిభను కనపరిచింది. పైలెట్స్ లైఫ్ స్టైయిల్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఈ ప్రేమకథకు పెద్ద మైనస్ పాయింట్ స్లోగా సాగే కథనం.. బలంగా అనిపించని ప్రేమికులు మద్య సంఘర్షణ. హీరో పాకీస్థానీ జైల్లో మగ్గుతూ తన ప్రేమకథను తలుచుకుంటూ ఉంటాడు. సఖి తరహాలో సాగుతుంది స్ర్కీన్ ప్లే. కార్తి, అదితిల అవుట్ స్టాండింగ్ ఫెర్ఫార్మెన్స్ లు ఈసినిమాకి నిజమైన బలాన్నిచ్చాయి. ఈ ప్రేమకథలో లీలా క్యారెక్టర్ లోని భావోద్వేగాలు కి కనెక్ట్ అయితే ఈ ప్రేమకథ తప్పుకుండా నచ్చుతుంది. అంతేకాక ఆమె బాధ కనెక్ట్ అవకపోతే ఈ సినిమా చాలా బోరింగ్ గా మారుతుంది. సినిమాలో ఎక్కడా కూడా ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసేంత సన్నివేశాలు లేకపోవడం కమర్షియల్ పార్మెట్ కి ఇబ్బందిగా మారింది. ఇక పాకిస్థాన్ జైల్ నుండి పారిపోయి రావడం వంటి సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు. క్లైమాక్స్ లో కార్తి అదితిల నటన ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. 

చివరిగా:
చెలియా స్వచ్ఛమైన ప్రేమకథ.. మణిరత్నం రోమాంటిక్ ప్రజంటేషన్ అంట్ ఎమోషనల్ డ్రామా కొందరు ప్రేక్షకులకు నచ్చవచ్చు. కానీ సెకండాఫ్ లో సాగే కథనం కొందరికి మరింత బోరింగ్ గా మారవచ్చు.  మరీ నిదానంగా సాగే వీరి ప్రేమకథ కనెక్ట్ అవ్వాలంటే ఓపిక చాలా అవసరం. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials