Posted: 376 Days Ago
Views: 301
27 ఏళ్ళ క్రితం ఇండియా నుంచి బహ్రెయిన్‌కి వచ్చిన ఓ వ్యక్తి ఆచూకీ అప్పటినుంచీ తెలియరావడంలేదు. 1987లో సాజిద్ పాషా అలియాస్ మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్ బహ్రెయిన్‌కి వచ్చారు. మూడేళ్ళ తర్వాత ఆయన ఇండియాకి తిరిగి వెళ్ళారు. ఇండియాలోనే ఉండిపోవాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరినా, ఇరాక్ యుద్ధం కారణంగా తనకు రావాల్సిన సొమ్ము బహ్రెయిన్‌లోనే ఉండిపోయిందని చెబుతూ తిరిగి ఇరాక్‌కి వెళ్ళిన సాజిద్ పాషా 1990 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. ఇన్నేళ్ళలో మూడు సార్లు మాత్రమే తమతో ఆయన మాట్లాడారనీ, 1990 తర్వాత అతన్నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదని సాజిద్ పాషా సోదరుడు ఇంతియాజ్ షరీఫ్ చెప్పారు. కుమారుడి మీద బెంగతో తన తల్లి అనారోగ్యం పాలైందనీ, ఆమె ఆసుపత్రిలో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారని ఆయన వాపోయారు. సాజిద్ పాషాకి సంబంధించి ఒకే ఒక్క ఫొటోగ్రాఫ్ అది కూడా పాతది మాత్రమే వారి దగ్గర ఉంది.