Posted: 375 Days Ago
Views: 377
అమెరికాలోని సియాటిల్ లో ఆత్మహత్యచేసుకున్న మధుకర్ రెడ్డి మృతి వ్యవహారం వివాదాస్పందంగా మారడంతో ....అమెరికాలో ఉన్న మధుకర్ రెడ్డి మిత్రులు స్పందించారు. అతడు చాలా మంచివాడని, అతని భార్యచెప్పినట్లు మధుకర్ ఎలాంటి మానసిక వ్యాధితో బాధపడంటం లేదని వారు అన్నారు.
అతని గురించి తప్పుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. భువనగిరి సమీపంలోని రాళ్ల జనగామకు చెందిన మధుకర్ కొద్దిరోజులక్రితం అమెరికాలో ఆత్యహత్యచేసుకున్నాడు. అతని అత్యక్రియల సందర్భంగా... మధుకర్ చనిపోవడానికి భార్యే స్వాతే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. అయితే తన భర్త చాలా కాలంగా డిఫ్రెషన్ లో ఉన్నాడని, అతని మానసిక స్థితి సరిగా లేదని స్వాతి ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు తెలిపింది. దీంతో అమెరికాలోని మధుకర్ సన్నిహితులు స్పందించారు.