Live News Now
  • అమరావతి: మే 2న ఏపీ మంత్రివర్గ సమావేశం... మే 2న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
  • సిమ్లా - ఢిల్లీ మధ్య తొలి ఉడాన్ సర్వీసు ప్రారంభించిన ప్రధాని మోడి
  • నాందేడ్ - హైదరాబాద్, హైదరాబాద్- కడప మధ్య ఉడాన్ సర్వీసులు
  • ఢిల్లీ: ఈ నెల 29న జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
  • కడప: సీకేదిన్నె(మం) గువ్వల చెరువు ఘాట్ లో అదుపు తప్పి లోయలో పడ్డ కట్టెల లారీ
  • డ్రైవర్, క్లీనర్ పరిస్థితి విషమం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
  • జమ్ముకాశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని అధికారులకు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
  • టీఆర్ఎస్ పాలన పై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది: ఉత్తమ్‌కుమార్
  • 2019లో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్‌కుమార్
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ: ఉత్తమ్‌కుమార్
ScrollLogo అమరావతి: మీడియాతో మంత్రి లోకేష్ చిట్‌చాట్... ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చెప్పలేదు ScrollLogo తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... 16 కంపార్ట్ మెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo స్వామి వారి దర్శనానికి 8 గంటలు... నడకదారి భక్తులకు 6 గంటలు ScrollLogo ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.11 కోట్లు... స్వామివారిని దర్శించుకున్న 42,189 మంది భక్తులు ScrollLogo ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా(70) కన్నుమూత ScrollLogo 1946 అక్టోబర్ 6 న జన్మించిన వినోద్‌ఖన్నా... 2014లో గురుదాస్‌పూర్ ఎంపీగా గెలిచారు ScrollLogo 1968లో వినోద్ ఖన్నా సినీరంగా ప్రవేశం..141 చిత్రాల్లో నటించారు.. తొలిచిత్రం మన్ కా మీట్ ScrollLogo వినోద్‌ఖన్నాకు ముగ్గురు కుమారులు, కుమార్తె ScrollLogo అమరావతి: చంద్రబాబు సమక్షంలో బ్రిటిష్ కౌన్సిల్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ ScrollLogo అమరావతి: కియా కార్ల తయారీ సంస్థతో ఏపీ ప్రభుత్వం అవాగాహన ఒప్పందం

రివ్యూ : మిస్టర్ తో వరుణ్ కు కష్టాలు.. హ్యాట్రిక్ ప్లాప్స్ కొట్టిన శ్రీను వైట్ల

mister-review
Posted: 13 Days Ago
Views: 5578   

రివ్యూ        : మిస్టర్

బ్యానర్                     : లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్
తారాగరణం    : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, నాజర్, మధు మురళి, చంద్ర మోహన్, తణికెళ్ళ భరణి, రఘుబాబు, ఆనంద్, పృధ్వీ, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు..
సినిమాటోగ్రఫీ    : కె వి గుహన్
సంగీతం        : మిక్కి జె. మేయర్
నిర్మాతలు        : నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు
దర్శకత్వం        : శ్రీను వైట్ల
రిలీజ్ డేట్        : 14-04-2017

దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లకి తర్వాత రెండు డిజాస్టర్స్... ఆయన కెరియర్ ని కామెడీ చేసాయి. మూడో సారి తన పంథా మార్చాడనే నమ్మకాన్ని కలిగించింది మిస్టర్ ట్రైలర్. నీకోసం, ఆనందం వంటి సెన్సిబుల్ ప్రేమకథలతో కెరియర్ ని మొదలెట్టిన శ్రీను మళ్ళీ తన మూలాలను పట్టుకున్నాడనే ఆశ కలిగింది. మరి ఈ మిస్టర్ గా మారిన వరుణ్ తేజ్ కి కూడా కమర్షియల్ హిట్స్ ఖాతాలో లేవు. అందుకే ఈ కాంబినేషన్ కమర్షియల్ గా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో ఉంది యూనిట్. మరి శ్రీను వైట్ల మిస్టర్ ని ఎలా ప్రజెంట్ చేసాడో చూద్దాం..

కథ:
స్పెయిన్ లో ఉండే ‘చే’ అని ముద్దుగా పిలవబడే పిచ్చయ్య నాయుడు(వరుణ్ తేజ్ ) కి కర్నాటక బోర్డర్ ఉండే తన తాత గారంటే పడదు. కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ ఉండే చే జీవితంలోకి యాక్సిడెంటల్ గా మీరా(హెబ్బాపటేల్) వస్తుంది. చే ఫ్యామిలీకి మీరా అంటే అభిమానం ఏర్పడుతుంది. చే తన తొలిప్రేమ విషయం చెప్పే లోపే మీరా తన ప్రేమ విషయం చెబుతుంది. చే ప్రేమను ఆమెను తెలియకుండా ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది పిచ్చయనాయుడి కుటుంబం. ఇండియాకి వెళ్ళిన  మీరాను తన ప్రియుడు సిద్దార్ధ(ప్రిన్స్) వద్దంటాడు. మీరా ప్రేమ విషయం సెటిల్ చేసేందుకు ఇండియా కి వస్తాడు చే. వారి ప్రేమను గెలిపించే ప్రయత్నంలో చేకి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. అక్కడి నుండి చే జీవితం అనేక మలుపులు తిరిగి చంద్రముఖిని పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. తను ప్రేమించిన మీరా, తనను ప్రేమించిన చంద్రముఖిల ప్రేమకథకు మిస్టర్ ఇచ్చే ముగింపు ఏంటనేది మిగిలిన కథ..?

కథనం:
కొన్ని ఫార్ములాలు.. ట్రాక్ కి కొందరు దర్శకులకు సక్సెస్ లను తీసుకురావొచ్చు. కానీ అవి అక్కడే వదిలి కొత్త కథలకు మారుతున్న ఆడియన్స్ అభిరుచులను అర్ధం చేసుకోకపోతే ఆ ఫార్ములాలలే గుదిబండల్లా మారతాయి. శ్రీనువైట్ల మిస్టర్ తో చేసిన ప్రయత్నం కూడా అలాంటిదే. బ్యాక్ డ్రాప్ లను మార్చినంత మాత్రాన కథలో కొత్త దనం రాదనే విషయం గ్రహించలేకపోయాడు. ఆంధ్రా, కర్నాటక బోర్డర్ లో మొదలైన ఈ కథను స్పెయిన్ లో కొంత భాగం మరికొంత శ్రీ కృష్ణదేవరాయ వంశం చుట్టూ తిప్పుతూ ప్రేక్షకులను ముప్పు తిప్పులు పెట్టాడు. ఆ తిప్పుడుకి నిదరొచ్చి కొందరు నీరసం వచ్చి మరికొంత మంది మద్యలోనే నిదురపోయారు.. మరికొంత మంది పారిపోయారు.. మిగిలిన వారు బలైపోయారు. సీన్ లోకి ఏ పాత్ర అయినా డైలాగ్స్ తో వస్తుంది కానీ ఈ సినిమాలో మాత్రం ప్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఆ కథలేమన్నా ఇంట్రెస్ట్ గా ఉంటాయా అంటే ఏదో ఒక పాత సినిమాని గుర్తుకు తెస్తూనే ఉంటాయి. లావణ్య త్రిపాఠి కథ వింటే చంటి గుర్తుకు వస్తుంది. మరో హీరోయిన్ హెబ్బా పటేల్ కథ వింటే నమో వెంకటేశ లో త్రిష లా ఉంటుంది. ఇక తన కథ ఇంత నాసిరకంగా ఉంటే హిట్ అయిన ఊపిరి, శ్రీమంతుడు సినిమాలపై  కమెడియన్స్ తో చేయించే పేరడీలు.. కామెంట్స్ మరింత కంపరం పుట్టిస్తాయి. ఊపిరి కథను పేరెడీ చేసేందుకు ట్రై చేసి నవ్వుల పాలయ్యాడు దర్శకుడు. శ్రీనివాసరెడ్డి, రఘబాబు, తేజస్విని ల పాత్రలు అక్కడక్కడా నవ్వించినా సినిమా కి పెద్ద అవరోధకాలనే చెప్పాలి. ఇక ఇండియా వచ్చాక సినిమా కథనం అంతా చేజింగ్ లతో పిచ్చెక్కిస్తుంది. ఒక దశలో ప్రేక్షకులు ఇంటెర్వెల్ కోసం పరితపించే విధంగా చేసాడు దర్శకుడు. హీరోయిన్ తీసుకుంటే చేజ్ మద్యలో కలిసిన మరో హీరోయిన్ కోసం చేజ్.. ఈ చేజ్ ల మద్య లో ఒక డైరెక్టర్ , రైటర్ మరో అసెస్టింట్ డైరక్టర్ ల ట్రాక్. లావణ్య త్రిపాఠి పాత్రను కాస్త కొత్త గా పరిచయం చేసాడు.. మొబైల్ ఫోన్ సౌకర్యం, సమంత ఇమేజ్ ని తెలియని అమాయకత్వం కాస్త కొత్త కామెడీని పండింస్తుదనుకునే లోపు అక్కడ కూడా రోటీన్ చేజింగ్ లతో అవసరం లేని ఫైటింగ్ లతో విసిగించాడు. ఇక మహాత్ముని ఊరు బ్యాక్ డ్రాప్ లో షకలకశంకర్ చేసిన కామెడీ కాస్త రిలీఫ్ నిచ్చింది. పాటలు ఏవీ గుర్తుండవు. కామెడీ టైమింగ్ కుదరక వరుణ్ తేజ్ అప్పజెప్పే డైలాగ్స్ చప్పగా తయారయ్యాయి. ఒక సీన్ లో రాజుల గొప్పదనం గురించి పొగిడి వెంటనే అసలు విషయం తెలిసి వారిని తిట్టాలి.. సాధారణంగా టైమింగ్ ఉన్న ఏ హీరో అయినా ఆ సీన్ లో నవ్విస్తాడు. కానీ ఆసీన్ లో వరుణ్ తేజ్ చేసిన కామెడీ కి నవ్వలేం కానీ అది కామెడీ అంటే మాత్రం ఖచ్చితంగా నవ్వొస్తుంది. తొలిప్రేమ దీపం కాదు జ్వాల ఎప్పుడూ రగిలస్తూనే ఉంటుందని అంటాడు.. వెంటనే అదే అమ్మాయితో నీ ప్రేమ జ్ఞాకపం ఆమె ప్రేమ జీవితం అంటాడు. ఎవరో ముక్కు మోహం తెలియిని వారికోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఎదిరించే హీరో, తల్లిని యాక్సిడెంట్ లో చనిపోతే ఆ యాక్సిడెంట్ చేసిన తాతను మాత్రం వెలివేస్తాడు. ఇక కృష్ణదేవరాయ వంశం చుట్టూ శ్రీనువైట్ల రాసుకున్న కథ ఏంత దారుణంగా ఉందంటే ... మరణ శిక్షలు వేసే వంశం అని ఎస్టాబ్లిష్ చేసాడు. అంతటి వారి కూతురి ఒక వెధవను చంపితే కోర్ట్ బయట కన్నీళ్ళు పెట్టుకుంటారు. వామ్మో.. ఇలాంటి విపరీతాలు అడుగుడునా భయపెట్టాయి. వారి గెటప్ లు చూస్తుంటే డ్రామా కంపెనీలను తలపిస్తాయి. షఫీ, భరత్ క్యారెక్టర్స్ లు దేనికోసమో తెలియదు. హీరో చుట్టూ తిరగడానికి ఒక ముప్పై స్కార్పియోలు, జీప్ లు వారిని వెంబడించే సీన్స్  మద్యలో కామెడీ పేరుతో చేసే జబర్దస్త్ స్కిట్స్ లు చూస్తుంటే శ్రీను వైట్ల మీద జాలికలుగుతుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ట్రెండ్ ని ఫాలో అవని దర్శకుడికి అతని దగ్గరున్న రైటర్ శ్రీమంతుడి కథను కాస్త మార్చి చెబుతాడు. అది విని దర్శకుడు ఇదేం సినిమా ఎవడుచూస్తాడు అంటాడు.  వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ అది ఆల్రెడీ రిలీజ్ అయిన సూపర్ హిట్ అయ్యిందంటాడు..శ్రీను వైట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. తన దగ్గరున్న కథలు, ఫార్ములాలకు ఎక్సపెయిరీ డేట్ అయినా కూడా ఇంకా అవే ట్రాక్ లతో వీక్ అవుతున్నాడు. సినిమా ప్లస్ పాయింట్స్ గుర్తుకు తెచ్చుకుంటే కొత్తగా కనిపించే లోకేషన్స్ , గుహాన్ సినిమాటోగ్రఫీ తప్ప ఏవీ లేవు. ఆగడు, బ్రూస్లీ ల తర్వాత అంతకంటే దారుణమైన కథా, కథనాలతో హాట్రిక్ ప్లాఫ్ ను అందుకున్నాడు. సినిమా చూసి వస్తుంటే ‘‘ఈ సినిమా కూడా నచ్చిందని చెప్పిన వారికి కొత్త బట్టలు పెట్టీ మరీ దణ్ణం పెట్టొచ్చనే ’’ కామెంట్స్  ధియేటర్ దగ్గర వినిపించాయి.

చివరిగా:
శ్రీను వైట్ల ఇష్యూ ఇక సీరియస్సే.. "మిస్టర్" డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials