Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

హారర్ కామెడీతో తన ట్రెండ్‌‌ను కంటిన్యూ చేశాడు 'శివలింగ'

'ShivaLinga'-review
Posted: 436 Days Ago
Views: 714   

రివ్యూ : శివలింగ
తారాగణం : రాఘవ లారెన్స్, రితికాసింగ్, శక్తివాసు, వడివేలు, ఊర్మిళ, భానుప్రియ, జయప్రకాష్
ఎడిటింగ్ : సురేష్
సినిమాటోగ్రఫీ : సర్వేష్ మురారి
సంగీతం : తమన్ ఎస్ఎస్
నిర్మాత : అభిషేక్, ఆర్ రవీంద్రన్
రచన, దర్శకత్వం : పి. వాసు
రిలీజ్ డేట్ : 14.04.17

హారర్, కామెడీ అనేది ఓ సూపర్ హిట్ ఫార్ములా అయ్యి చాలాకాలమే అయింది. దీనికి ఆద్యుడు రాఘవ లారెన్స్. ముని సినిమాతో అతను చేసిన ఈ ప్రయోగం యేడాదికి ప్రతి ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో సినిమాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు పి.వాసు డైరెక్షన్ లో లారెన్స్, రితికా సింగ్ కాంబోలో వచ్చిన శివలింగ కూడా ఆ తరహా చిత్రమే.. ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో హిట్ అయిన శివలింగాకు రీమేక్.  ఈసారి కేవలం హీరోగా మాత్రమే చేసిన లారెన్స్ .. ఈ హారర్ కామెడీతో తన ట్రెండ్ ను కంటిన్యూ చేశాడా లేదా అనేది చూద్దాం..

కథ :
శివలింగేశ్వర్.. ఓ సిబి.సిఐడి ఆఫీసర్.. అత్యంత తెలివైన వాడని డిపార్ట్మెంట్ మొత్తం చెప్పుకుటుంది. అలాంటి అతనికి.. మిస్టరీగా మారిన వరంగల్ కు చెందిన ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన కేసును ఛేదించమని డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వస్తుంది. అయితే ఆల్రెడీ అతనికి వరంగల్ అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. మొత్తంగా భార్యకు, ఆమె కుటుంబానికి తనెవరో తెలియకుండా పెళ్లి చేసుకుని.. వరంగల్ లోనే ఉంటూ.. కేసును ఛేదించే ప్రయత్నంలో ఉంటాడు. అయితే వీరు ఉండటానికి ఏర్పాటు చేసిన బంగ్లా పక్కనే ఓ స్మశానం ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్లిన దగ్గర్నుంచీ శివలింగ భార్య వింతగా ప్రవర్తిస్తుంటుంది. అతను ఇన్వెస్టిగేషన్ కు వెళ్లిన టైమ్ లో బయటికి వెళ్లి ఎవరెవర్నో కలిసి వస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన శివలింగ ఆమె గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడతనికి  తన భార్య ఓ దెయ్యం అనే భయంకరమైన నిజాలు తెలుస్తుంది. మరి ఆమెలోకి ఈ దెయ్యం ఎలా ప్రవేశించింది. ఆ దెయ్యం ఎవరు. అటు శివలింగ టేకప్ చేసిన మర్డర్ మిస్టరీ కథ ఏమైంది..ఆ మర్డర్ కు ఈ దెయ్యానికీ ఏమైనా సంబంధం ఉందా..? ఉంటే ఏంటీ అనేది మిగతా కథ.
 
విశ్లేషణ:
పి. వాసు చంద్రముఖి చూసిన ఎవరికైనా శివలింగ ట్రైలర్ చూసిన తర్వాత మరింత ఆసక్తి పెరగడం ఖాయం. మరీ చంద్రముఖి రేంజ్ అని చెప్పలేం కానీ.. వాసు తనదైన స్టైల్ చూపించాడు.. ఓ మర్డర్ మిస్టరీ ఆధారంగా అల్లుకున్న కథలోకి అనేక అంశాలను తెలివిగా జొప్పించాడు. అయితే ఇవేవీ కథను దాటి వెళ్లకపోవడం ఆకట్టుకునే అంశం. సినిమా ఆరంభంలోనే రహీమ్ అనే వ్యక్తిని ట్రెయిన్ లో నుంచి తోసి చంపేస్తారు. ట్రెయిన్ వెళుతుండగా జరిగిన ఘటన.. పైగా అతనున్న బోగీలో ఇంకెవరూ ఉండరు కాబట్టి.. ఇది ఆత్మహత్య కేస్ గా కొట్టిపడేస్తోంది కోర్ట్. కానీ రహీమ్ ను ప్రేమించిన అమ్మాయి మాత్రం ఇది ఆత్మహత్య కాదని బలంగా నమ్మి.. కమీషనర్ ను కేసును  రీఓపెన్ చేయమని అర్థిస్తుంది. అందుకు ఒప్పుకున్న కమీషనర్.. ఎవరికీ తెలియకుండా కేస్ ను సిబిసిఐడీకి అప్పగిస్తుంది. అలా కేసును టేకప్ చేసిన శివలింగా.. ఈ కేసును స్టడీ చేస్తున్నా కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తూంటాడు. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతినిస్తుంది. అలాగని అన్నీ అద్భుతాలైతే కాదు.. కొన్ని పరమ బోరింగ్ సీన్స్ కూడా లేకపోలేదు. ముఖ్యంగా హీరో ఇంటర్డక్షన్ ఫైట్, సాంగ్.. రెండూ వేస్టే. ఇక పెళ్లి చేసుకుని ఊరికి దూరంగా ఉన్న ఇంట్లోకి వెళ్లడం.. అక్కడ అనూహ్య సంఘటనలు జరగడం అన్నీ రొటీన్ గానే అనిపిస్తాయి.. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన దర్శకుడు.. ఆ తర్వాత కథను వేగంగా ముందుకు తీసుకువెళతాడు..
 ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. ఆ ఇంట్రెస్ట్ ను సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్.. ఆ ఇంపార్టెన్స్ పి. వాసుకు బాగా తెలిసినట్టుగానే నడిపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో హీరో.. పావురం, దెయ్యం గీసిన గుర్తుల ఆధారంగా చేసిన ఇన్వెస్టిగేషన్ తో కొందరు.. వ్యక్తులతో ఏర్పాటు చేసిన మీటింగ్.. వాసు రైటింగ్ టాలెంట్ ను మరోసారి ఎస్టాబ్లిష్ చేస్తుంది. చంద్రముఖిలో రజినికాంత్, ప్రభుకు గంగ చంద్రముఖిలా మారిన వైనాన్ని వివరిస్తున్నట్టుగా సూపర్ సర్ ప్రైజింగ్ గా రాసుకున్నాడా సీన్. కానీ మళ్లీ క్లైమాక్స్ ఫైట్ తో ఒక్కసారిగా తేలిపోయేలా చేశాడు. ఆర్టిస్టుల పరంగా లారెన్స్.. అతని భార్యగా రితికా సింగ్ ఇద్దరూ ఇరగదీశారు. ముఖ్యంగా రితికాకు ఇది రెండో సినిమానే అయినా.. అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచింది. లారెన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టినపిండే. వడివేలు కామెడీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ఈ సినిమాతో దర్శకుడు పి.వాసు తనయుడు పి. శక్తివాసు..రహీమ్ గా బాగా నటించాడు. అలాగే రాధారవి, విజయ్ ప్రకాష్, భానుప్రియ, ఊర్మిళ పాత్రలు కూడా అలరిస్తాయి.. టెక్నికల్ గా తమన్ సంగీతం పాటల్లో ఓకే అనిపిస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. చాలా సీన్స్ లో తమన్ ఆర్ఆర్ బ్యాక్ బోన్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత నిడివి తగ్గించినా.. సెకండ్ హాఫ్ లో పాట లేకపోయినా ప్రాబ్లమ్ ఉండేది కాదు.. కాస్టూమ్స్ బావున్నాయి. మాటలు ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి..
 
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
దర్శకత్వం
లారెన్స్, రితిక
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రీ క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్ : 
ఫస్ట్ హాఫ్ 
పాటలు 
కామెడీ 
క్లైమాక్స్ ఫైట్

ఫైనల్ గా: లారెన్స్ మార్క్ లో సాగిన పి.వాసు చిత్రం


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials