Posted: 371 Days Ago
Views: 370
సెవెన్హెచ్ స్పోర్ట్స్ కార్పొరేట్ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగిసింది. రెండురోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 15 కార్పొరేట్ కంపెనీల నుండి 41 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో ఇన్ఫోసిస్ ప్లేయర్ అనిల్ విజేతగా నిలిచాడు. మొదటి రన్నరప్‌గా కరమ్‌సింగ్, రెండో రన్నరప్‌గా సంతోష్ నిలిచారు. అటు మహిళల విభాగంలో సింధూర జ్యోతి ఛాంపియన్షిప్ గెలుచుకుంది. బౌలింగ్‌ను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేందుకు వుమెన్ ప్లేయర్స్‌కు ఎంట్రీ ఫీజు లేకుండా టోర్నీలు నిర్వహిస్తోన్న సెవెన్హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేష్‌ను పలువురు అభినందించారు. ఈ టోర్నీకి టీవీ ఫైవ్ మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది.