Posted: 370 Days Ago
Views: 342
పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కి నోటి దురుసెక్కువ.. కానీ మంచి మనసున్నవాడు అనే టాక్ ఉంది.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించిన అఫ్రిది కి టీం ఇండియా క్రికెట్ ఆటగాళ్లు అతనిపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకొన్నారు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా క్రికెట్ ప్లేయర్స్ అందరూ సంతకం చేసిన జెర్సీని అఫ్రిదికి పంపించారు. ఈ విషయాన్ని ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆ ఫోటోను షేర్ చేశాడు.. దీంతో ఈ గిఫ్ట్ వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే...
పాక్ క్రీడాకారుడు అఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని పై ఉన్న అభిమానాన్ని చాటుకొంటూ.. టీమిండియా ఆటగాళ్లు ఓ జెర్సీ ఇచ్చారు.. ఆ షర్ట్ పై "షాహిద్ భాయ్ బెస్ట్ విషెస్.. నీతో ఆడడం ఎప్పుడు మాకు సంతోషమే" ఓ సందేశం కూడా రాశారు.. జెర్సీ పై విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, బుమ్రా, రైనా, భువనేశ్వర్, రహానే, ధావన్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, అశ్విన్, షమీ, పవన్ నేగి, పాండ్య లతో పాటు రవిశాస్త్రి తదితరుల ఆటోగ్రాఫ్ లు ఉన్నాయి.