Live News Now
  • అఖిలపక్షం కాదు.. అఖిల సంఘాల సమావేశం.. ప్రత్యేక హోదాపై రాజీపడబోమన్న ఏపీ సీఎం
  • మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం... బాబును ఒప్పించాలంటూ పవన్‌కు వైసీపీ సవాల్‌
  • నీరబ్ మోడీ స్కామ్‌తో రోడ్డున పడ్డ వందల మంది ఉద్యోగులు
  • రంగారెడ్డి జిల్లా : మహేశ్వరంలో నీరవ్ మోడీ ఆస్తులు సీజ్.. రోడ్డునపడ్డ జెమ్స్ కంపెనీ ఉద్యోగులు
  • తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 600 మంది ఉద్యోగులు
  • బెజవాడ బార్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరుకు నిరసనగా అడ్వొకేట్ల దీక్ష
  • రెండ్రోజుల క్రితం లాయర్ షరీఫ్‌పై స్వాతి సెంటర్‌లో దాడి.. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు
  • CI రాజాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్
  • గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరసన దీక్షలో పాల్గొన్నవైసీపీ నేతలు, విశ్రాంతి ఉద్యోగులు
  • 93వరోజుకు చేరిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. ప్రభుత్వంపై విసుర్లు.. ఆత్మీయ పలకరింపులు
ScrollLogo హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం ScrollLogo తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌ ScrollLogo కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా ScrollLogo కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ScrollLogo నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు ScrollLogo నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి ScrollLogo హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు ScrollLogo తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ScrollLogo శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం ScrollLogo ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

మిస్టర్ తెచ్చిన కష్టాలు.. ఇల్లు అమ్మిన శ్రీను వైట్ల?

srinu-vaitla-sold-his-house?
Posted: 308 Days Ago
Views: 31281   

రాజ్యాలు ఏలిన రాజులకే కాలం కలిసి రాకపోతే.. బంటుగా మారతాడు.. ఇక రంగుల వల అయిన సినీ పరిశ్రమలో బళ్ళు ఓడలు అవ్వడం ఓడలు బళ్ళు అవ్వడానికి ఎంతో సమయం అవసరం ఉండదు.. టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా ఉన్న సమయంలో ఒక్క సినిమా ప్లాప్ తో ఉన్న ఇంటిని అమ్ముకొన్న దర్శకులున్నారు.. అటువంటి దర్శకుల జాబితాలో తాజా ప్రేమ, యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్ లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీను వైట్ల చేరాడు.. వివరాల్లోకి వెళ్తే...
నీ కోసం, ఆనంద్ వంటి ప్రేమ కథ చిత్రాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న శ్రీను వైట్ల, ఢీ, రెడీ, దూకుడు వంటి సినిమాల్లో కామెడీని పండించి తనదైన ముద్ర వేశాడు.. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనే శ్రీను వైట్ల జర్నీకి ఆగడు సినిమాతో బ్రేక్ పడింది అని చెప్పవచ్చు.. ఆగడు నుంచి మొదలైన పరాజయాల పరంపర బ్రూస్ లీ తో కొనసాగింది.. స్టార్ హీరోలతో సినిమాలు చేసే శ్రీను వైట్ల వరుణ్ తో సినిమా చేయాల్సి వచ్చింది.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా దర్శకత్వం కూడా నిర్మాతలకు నాకు పారితోషకం వద్దు.. నేను డబ్బులు పెడతా అంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో దక్కిందట.. ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. మిస్టర్ మూవీకి ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జిలు నిర్మాత‌లు. కాగా శ్రీ‌నువైట్ల త‌న పారితోషికాన్ని పెట్టుబ‌డిగా పెట్టాడు. రెమ్యునరేషన్ గా ఈస్ట్‌, కృష్ణ‌. వైజాగ్ జిల్లా హ‌క్కుల్ని త‌న ద‌గ్గ‌రే ఉంచుకొన్నాడు. కాగా ఈ సినిమా ఫలితం పై ముందుగానే నిర్మాతలకు అనుమానం రావ‌డంతో… ఠాగూర్ మ‌ధు, బుజ్జిల నుంచి శ్రీ‌నువైట్ల‌పై ఒత్తిడి పెరిగిన‌ట్టు, దాంతో శ్రీ‌నువైట్ల కొంత మొత్తాన్ని నిర్మాత‌ల‌కు అంద‌చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.. కాగా ఆ డ‌బ్బుల్ని నిర్మాతలకు ఇవ్వడానికి త‌న ఫ్లాట్‌ని సైతం అమ్మినట్లు తెలుస్తోంది.. రెమ్యునరేషన్ గా ఉన్న మూడు ఏరియాల‌కూ కొంత మేర అడ్వాన్సులైతే శ్రీ‌నువైట్ల‌కు అందాయి. కానీ అది కొంత మొత్తమే నట.. కాగా ఈ ప్లాప్ నుంచి శ్రీను వైట్ల తేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో మరి


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials