Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

నేడు కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ

TRS-Plenary-Event-to-be-Held-Today-In-Kompally
Posted: 274 Days Ago
Views: 365   

గులాబీ పండుగకు వేళయ్యింది. రెండేళ్లకోసారి జరుపుకునే ప్లీనరీ వేడుకకు కొంపల్లి వేదికయ్యింది. ఎటుచూసినా తోరణాలు, హోర్డింగులతో గులాబీమయంగా మారిపోయింది.  16వేల మంది ప్రతినిధులకు తెలంగాణ ప్రగతి ప్రాంగణం స్వాగతం పలుకుతోంది. మరోసారి అధినేతను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఏడు తీర్మానాలపై చర్చించనున్నారు. ప్లీనరీలో గులాబీ సైన్యానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి టీఆర్‌ఎస్ ప్లీనరీకి ముస్తాబైంది. గులాబీ ముఖ్యనేతలకు తెలంగాణ ప్రగతి ప్రాంగణం స్వాగతం చెబుతోంది. టీఆర్ఎస్ జెండాలు, తోరణాలు, హోర్డింగులతో కొంపల్లి గులాబీమయమైంది. ఐదెకరాల ప్రాంగణంలో ప్లీనరీ వేదిక, ప్రతినిధులు కూర్చొనే సభాస్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిపి దాదాపు 16వేలమంది హాజరుకానున్నారు. ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు హోంమంత్రి నాయిని ప్రకటిస్తారు. అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత ఏడు తీర్మానాలపై ఏడుగురు తీర్మానాలు పెడతారు. ఈసారి మంత్రులు కాకుండా  కొండసురేఖ, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్‌, నారదాసు లక్ష్మణ్, పాయం వెంకటేశ్వర్లు తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిన ప్రగతిపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట 30నిమిషాలకు భోజన విరామం. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత తీర్మానాలపై చర్చ ఉంటుంది. సాయంత్రం 5న్నర గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతినిధులను ఉద్దేశించి ముగింపు ఉపన్యాసం చేస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. ప్లీనరీకి వచ్చిన ప్రతినిధుల కోసం ఆరు భోజనశాలలు ఏర్పాటు చేశారు. మెనూలో 26 రకాల వంటకాలు ఉన్నాయి. ప్లీనరీ సమీపంలో 35 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని రెడీ చేశారు. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. ప్లీనరీని వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీ ప్రాంతంలో గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలతో రూపొందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేదికకు ముందు భాగంలో చిత్రమాలిక స్వాగత తోరణాలు ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. కొంపల్లి ప్రాంగణానికి చేరుకునే దారిలో అక్కడక్కడ నెలకొల్పిన విభిన్న స్వాగత తోరణాలు చూడముచ్చటగా ఉన్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials