Live News Now
  • ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
  • సీజేఐపై అభిశంసన నోటీసుపై పొలిటికల్‌ ఫైట్‌..
  • జర్మనీ ఛాన్సలర్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు
  • రాజస్థాన్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • హోదాపై కేంద్రం దిగి రాక తప్పదా.. చంద్రబాబు దీక్షతో మారుతున్న సీన్..
  • కేసీఆర్‌ విధానాలపై పోరాడండి.. టీ కాంగ్ నేతలకు రాహుల్‌ మార్గనిర్దేశం..
  • తెలంగాణ ఎయిమ్స్ కు నిధులు.. విభజన హామీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్‌
  • మైనర్లను రేప్‌ చేస్తే ఉరే... నేడు ఆర్డినెన్స్ తేనున్న మోడీ సర్కారు
  • సమ్మర్‌లో చమురు ధరల సెగలు.. రికార్డ్ స్థాయికి చేరిన పెట్రో రేట్లు
  • చంద్రబాబు దీక్షతో కేంద్రంపై ఒత్తిడి.. ఎందాకైనా వెళ్తామన్న ముఖ్యమంత్రి
ScrollLogo పసుపుమయమైన విజయవాడ.. చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ScrollLogo అరవింద్‌పై ఫైర్‌, చిరు ఫ్యామిలీకి క్షమాపణలు.. రూట్‌ మార్చిన రామ్‌ గోపాల్‌ వర్మ ScrollLogo అట్టహాసంగా యడ్యూరప్ప నామినేషన్.. సీఎం పీఠమే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలు ScrollLogo లండన్‌లో కామన్వెల్త్‌ దేశాధినేతలతో మోడీ చర్చలు ScrollLogo సీతారాం ఏచూరి వర్సెస్‌ ప్రకాశ్‌ కారత్‌.. సీపీఎంలో తారాస్థాయికి వర్గపోరు.. ScrollLogo చంద్రబాబు దీక్షకు వెల్లువెత్తిన మద్దతు.. సంఘీభావంగా తరలివస్తున్న ప్రముఖులు ScrollLogo హోదా ఇవ్వకుంటే మోడీని ఉరికించి కొడతాం.. హిందీలో స్పీచ్‌ అదరగొట్టిన బాలయ్య ScrollLogo ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. కరీంనగర్‌లో ముగ్గురి దుర్మరణం ScrollLogo కామన్వెల్త్‌ దేశాధినేతలతో మోడీ చర్చలు ScrollLogo 250 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం.. జపాన్‌లో వందల కిలోమీటర్ల మేర ప్రభావం

2019లో కాంగ్రెస్ అధికారంలోకి - ఉత్తమ్

Congress-Leaders-Slams-TRS-Government-at-Tandoor-Bahiranga-Sabha
Posted: 366 Days Ago
Views: 446   

2019ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలంగాణ హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకపోయిందని..వచ్చేది తమ  ప్రభుత్వమేనని చెప్పుకొస్తున్నారు. తాండూరులో జరిగిన సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోశారు.  అడ్డగోలు హామీలతో జనాలను నిండా ముంచుతున్నారని విరుచుకుపడ్డారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో  నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు కాకపోతే ఓట్లు అడగబోమని కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని..రైతులకు 2 లక్షల వరకు రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గులాబీ కూలీ పేరుతో దోచుకుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ గాలికొదిలేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూంల నిర్మాణం ఎటుపోయిందని ప్రశ్నించారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సభకు హాజరైన డిగ్గీరాజా టీఆర్ఎస్, బీజేపీలపై ఫైరయ్యారు. ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అబద్ధాలతో మోడీ పాలన సాగుతోందని డిగ్గీ విమర్శించారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలు తాండూరు సభలో టీఆర్ఎస్ సర్కారుపై మూకుమ్మడి మాటల దాడి చేశారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సభలు షురూ చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials