Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

నేడు ఏపీ కేబినెట్ భేటీ

Ap-Cabinet-Meeting-Today
Posted: 425 Days Ago
Views: 341   

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. నాలా ఛార్జీల తగ్గింపు చ‌ట్ట సవ‌ర‌ణ, ఎండ‌ల తీవ్రత- తీసుకోవాల్సిన చ‌ర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ భ‌వ‌న స‌ముదాయాల డిజైన్లపైనా దృష్టి సారించనున్నారు. నీరు-ప్రగ‌తి విజయవంతానికి సీఎం సూచనలు చేయనున్నారు. అటు.. నంద్యాల ఉప ఎన్నికపై పార్టీ సమన్వయ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అమరావతిలో కీల‌క‌మైన ప్రభుత్వ భ‌వ‌న స‌ముదాయాలపై నార్మన్ ఫోస్టర్ స‌మ‌ర్పించిన ప్రతిపాద‌న‌ల‌పై అందరి అభిప్రాయాల‌ు తీసుకోనున్నారు సీఎం. వ్యవ‌సాయ భూములు- వ్యవ‌సాయేత‌ర భూములుగా మార్చే నాలాచార్జీల త‌గ్గింపునకు సంబంధించి చ‌ట్టంలో మార్పులు చేసిన.. డ్రాప్ట్ బిల్లు కేబినెట్‌ ముందుకు రానుంది. మంత్రివ‌ర్గం ఆమోదిస్తే.. త్వర‌లో జ‌ర‌గ‌బోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరుగుతోంది. ప్రాణనష్టం జరక్కుండా.. నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా దృష్టి సారించనున్నారు. సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీరు - ప్రగ‌తిపైనా చ‌ర్చించ‌నున్నారు. భూగ‌ర్భ జ‌లాలు పెంపునకు 90 రోజుల పాటు నీరు - ప్రగ‌తి కార్యక్రం జ‌ర‌గ‌నుంది. అయా జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు కచ్చితంగా పాల్గొనాల‌ని చంద్రబాబు ఆదేశం. నీరు - ప్రగ‌తిని విజ‌య‌వంతం చేయాల్సిన బాధ్యత మంత్రుల‌పై ఉంచ‌నున్నారు.. సిఎం. ఈష్ణా జిల్లాలో మ‌ల్లవ‌ల్లి ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్‌కు భూకేటాయింపు.. శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థలంలో 130 ఎక‌రాల్ని ప‌రిశ్రమ‌ల‌ కోసం ముందుగానే డెవ‌ల‌ప్ చేసుకునేందుకు కేబినెట్ అనుమ‌తించే అవ‌కాశం ఉంది. క‌ర్నూలు జిల్లాలోని అవుకు టన్నెల్-2కు అనుమ‌తి ఇవ్వనున్నారు. జీయ‌స్టీ బిల్లులను అమోదించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని స‌మావేశప‌ర‌చాలి.. దీన్ని ఎప్పుడు.. ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. అంతకు ముందు.. టీడీపీ స‌మ‌న్వయ స‌మావేశం జరగనుంది. ఇందులో మేలో జ‌రగాల్సిన మ‌హానాడు.. సంస్థాగ‌త ఎన్నిక‌లు.. నంద్యాల ఉప ఎన్నిక‌.. త‌దిత‌ర అంశాలపై చ‌ర్చించ‌నున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials