Live News Now
  • నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి
  • తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు
  • రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే
  • దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్
  • కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు
  • ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం
  • అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముస్తీ ScrollLogo హైదరాబాద్: మంత్రి తలసానిని కలిసిన మాహుబలి-2 నిర్మాతలు ScrollLogo అమరావతి: మే 27, 28 29 తేదీల్లో విశాఖలో టీడీపీ మహానాడు ScrollLogo అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ScrollLogo కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం ScrollLogo ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం... 11 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి ScrollLogo ఢిల్లీ: కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

బాహుబలి 1 సమయంలో కన్నడిగులు ఏమయ్యారు..?

Before-Baahubali-2,-pro-Kannada-groups-call-for-Karnataka-bandh
Posted: 4 Days Ago
Views: 55   

S S రాజమౌళి  బాహుబలికి కర్నాటకలో కష్టాలు తప్పేట్టులేదు. కట్టప్పతో ఉన్న పాత లెక్కను సెటిల్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని కన్నడీగులు పట్టుదలతో ఉన్నారు. కావేరీ వివాదం విషయంలో తమను అవమానించిన సత్యరాజ్‌ క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు. ఆయన భేషరతుగా సారీ చెబితేనే బాహుబలి -2 కర్నాటకలో విడుదలవుతుందని అల్టిమేటం ఇచ్చారు. దీంతో దర్శకుడు రాజమౌళి రంగంలోకి దిగారు. ఐతే, అంతా మర్చిపోయిన విషయాన్ని కన్నడ సంఘాలు ఇప్పుడే ఎందుకు తిరగ తోడుతున్నాయి? అనేది చాలా మందికి కలుగుతున్న అనుమానం
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఎప్పుడో కన్నడిగులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాహుబలి -2 మెడకు చుట్టుకున్నాయి. బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ..బాహుబలి- ది కంక్లూజన్‌ను రాష్ట్రంలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు కంకణం కట్టుకున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి విడుదల సందర్భంగా "కన్నడ ఒకోటా"  బెంగుళూరు బంద్‌కు పిలుపునిచ్చింది. తమ కార్యకర్తలు ప్రతి జిల్లాలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటారని ఇప్పటికే ప్రకటించింది. ఈ ఆందోళనకు కర్ణాటక ఫిల్మ్‌ చాంబర్‌ కూడా మద్దతు తెలిపింది.
విడుదలకు అంతా సిద్ధమైన తరువాత కర్నాటకలో ఇలా జరగటం చిత్ర యూనిట్‌ను షాక్‌కు గురిచేసింది. దయచేసి అడ్డుకోవద్దంటూ దర్శకుడు S.S. రాజమౌళి కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కన్నడ భాషలో విజ్ఞప్తి చేస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కావేరి జలాల వివాదంపై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, దాన్ని పట్టుకుని సినిమాను అడ్డుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని వీడియోలో వివరించారు. దయచేసి సినిమాను అడ్డుకోవద్దని కన్నడ సంఘాలను కోరారు. తొమ్మిదేళ్ల క్రితం కావేరి జలవివాదం సమయంలో కన్నడిగులను అవమానపరిచేలా సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు. దాంతో కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. అయితే తరువాత సత్యరాజ్‌ సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి. బాహుబలి పార్ట్ 1 కూడా కర్నాటకలో రిలీజైంది. అప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఇపుడు సడెన్ గా తెరపైకి వివాదం రావడానికి కారణం బాహుబలి భారీ బడ్జెట్ సినిమా కావడమే. ఇకపై సత్యరాజ్ నటించిన ఏ సినిమాను కర్ణాటకలో విడుదలకాకుండా అడ్డుకుంటమాంటున్నారు. బాహుబలిని అడ్డుకుంటే 20 నుండి 30 కోట్ల వరకు నష్టం రావచ్చు. మరి రాజమౌళికోసం కట్టప్ప కన్నడిగులకు భేషరతుగా సారీ చెబుతారా? కట్టప్ప కన్నడిగులకు క్షమాపణ చెబితే తమిళనాడులో ఆయనకు కావేరి సెగ తగులుతుంది. సత్యరాజ్ క్షమాపణ చెబితే తమిళ  ప్రేక్షకులు, ప్రజలు ఆయనపై మండిపడే అవకాశాలు చాలా ఉన్నాయి. దాంతో అతని పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యిలా మారింది!!  


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials