Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

ఏపీలో బుగ్గకార్లతో నేతలు, అధికారుల హడావుడి

AP-Political-Leaders-on-Ban-of-Red-Beacons
Posted: 68 Days Ago
Views: 83   

వీఐపీలకు బుగ్గకార్లు తొలగించాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో ఏపీలో నేతలు, అధికారులు ఖంగుతిన్నారు. ఇన్నాళ్లు..బుగ్గకారులో తిరుగుతూ దర్పాన్ని ప్రదర్శించిన వాళ్లు..ఇప్పుడు అయోమయంలో పడ్డారు. మరోవైపు ఇప్పటికే కొందరు మంత్రులు, అధికారులు తమ వాహనాలకు బుగ్గలు తొలగించి కేంద్రం నిర్ణయాన్ని ఫాలో అవుతుంటే..మిగతావాళ్లేమో..ఇంకా టైం ఉంది కదాని చూద్దాంలో అంటున్నారు. ఏపీలో నేతలే కాదు అధికారులు బుగ్గకార్లలో హల్చల్ చేస్తున్నారు. మంత్రులు,కేబినెట్ హోదా ఉన్న లీడర్లతోపాటు సలహాదారులు హడావుడి చేస్తున్నారు. ఎమ్మార్వో స్థాయి అధికారులు కూడా సైర‌న్ తో స‌చివాల‌యానికి వస్తున్నారు. అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బుగ్గకార్లకు చెక్ పెట్టినట్టయ్యింది. బుగ్గకార్ల తొలగింపు నిర్ణమయంతో తమ హోదాకు భంగం కలుగుతోందని కొందరు మంత్రులు, అధికారులు తెగ ఫీలైపోతున్నారు. మే ఒక‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా ఎలాంటి బుగ్గ కార్లు వాడొద్దని కేంద్రం డిసైడవ్వడంతో ఏపీలో ఇప్పటికే మంత్రులు, అధికారులు..తమ వాహనాలకు బుగ్గలు తొలగించారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఆదినారాయ‌ణ రెడ్డి లు త‌మ వాహ‌నాల‌కున్న బుగ్గలను తొలగించి సచివాలయానికి వస్తున్నారు. ఇక మంత్రి సుజ‌య‌కృష్ణ రంగారావు కూడా ఇదే బాట‌లో త‌న కారుకున్న నీలం లైట్ ను తొల‌గించారు. కొందమంది అధికారులు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. విజయవాడలో అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లకు తోడు బుగ్గకార్ల సైరన్లు మోగించుకుంటూ వచ్చేవారితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర నిర్ణయంతో ఈ సైరన్ల గోల తప్పుతుందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. .


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials