Posted: 369 Days Ago
Views: 526
వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. CI వేధిస్తున్నారంటూ సుబేదారి పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా చేస్తున్న జమునారాణి.. గాజుతో చేతి మణికట్టు కోసుకుంది. సీఐపై పలు ఆరోపణలు చేస్తూ సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళా కానిస్టేబుల్నైన తనకు వేళాపాళా లేని డ్యూటీలు వేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్లో సీసీకెమెరాలు పెట్టి కెమెరాలకు సెల్యూట్ చేయమంటున్నాడంటూ పలు ఆరోపనలు చేసింది. ఈ వీడియో పోలీస్ శాఖలో సంచలనంగా మారింది.