Live News Now
  • ఇసుక మాఫియా కట్టడిపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
  • జమ్మూకాశ్మీర్: అనంత్‌నాగ్‌లో మరో ఉగ్రదాడికి ముష్కరుల యత్నం
  • ప్రభుత్వ ధనాగారాన్ని దోచుకునేందుకు ముష్కరుల యత్నం...
  • ముష్కరుల దాడిని తిప్పికొట్టిన సీఆర్పీఎఫ్... ఓ ఉగ్రవాది అరెస్ట్ మరో ఉగ్రవాది పరారీ
  • భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సీఆర్పీఎఫ్
  • చంద్రబాబుతో ఆర్‌.కృష్ణయ్య భేటీ... గ్రూప్‌2 మెయిన్స్‌ వాయిదా వేయాలని విజ్ఞప్తి
  • చంద్రబాబు విదేశీ టూర్ షెడ్యూల్ ఖరారు...మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటన
  • జమ్మూకాశ్మీర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది... పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం
  • అనంతపురం: గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తా... 11 మంది మృతి నలుగురు గల్లంతు
  • మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు... గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
ScrollLogo 111 పాయింట్లు నష్టపోయి 29,948 వద్ద ముగిసిన సెన్సెక్స్ ScrollLogo 38 పాయింట్లు నష్టపోయి 9,308 వద్ద ముగిసిన నిఫ్టీ ScrollLogo 9,300 పాయింట్ల మార్కును నిలుపుకున్న నిఫ్టీ ScrollLogo సూర్యపేట మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత... ScrollLogo మార్కెట్‌ యార్డును సందర్శించేందుకు వచ్చిన కోదండరామ్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ScrollLogo జేఏసీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ScrollLogo హైదరాబాద్: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు ఊరట... ScrollLogo జగన్‌ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కొట్టివేసిన ప్రత్యేక కోర్టు ScrollLogo హైదరాబాద్: జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి... కుటుంబ సభ్యులతోనే వెళ్లాలన్న కోర్టు ScrollLogo మే 15 నుంచి జూన్ 15 లోపు 15 రోజులు విదేశాలకు వెళ్లవచ్చన్న కోర్టు

కొత్తరూపు సంతరించుకుంటున్న వరంగల్‌ నగరం

Beautification-of-Walls-by-GWMC,-Warangal-Collector-Amrapali-Face-to-Face
Posted: 8 Days Ago
Views: 59   

వరంగల్‌ నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. చారిత్రక ప్రశస్తి ఉన్న నగరానికి ఆధునిక సొబగులు అద్దుతున్నారు జిల్లా అధికారులు. వరంగల్‌ నగరాన్ని హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న సీఎం మాటలను నిజం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. బడ్జెట్‌లో 300 కోట్లు కేటాయించడం.. స్మార్ట్‌సిటీ, అమృత్‌, హృదయ్‌ పథకాల జాబితాలో చోటు దక్కడంతో... అభివృద్ధి పరుగులు పెడుతోంది. రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో వందకు వందశాతం పురోగతి సాధించడంతో పాటు... సుందరీకరణ విషయంపైనా జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డు పనులు మొదలు కావడం.. సిటీలోని రైడ్లను సైతం వెడల్పు చేస్తుండడంతో... త్వరలోనే వరంగల్‌ కొత్త అందాలకు నెలవు కానుంది. వసతులు ఎన్ని ఉన్నా సుందరీకరణ లేకుంటే... చూపరులను ఆకట్టుకోలేరు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి.. సిటీ బ్యూటిఫికేషన్‌ మీద దృష్టి సారించారు. కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం హైవేలపై ఉన్న గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేయిస్తున్నారు. వీటిలో చాలా చిత్రాలు సందేశాత్మకంగానూ ఉంటున్నాయి. దీంతోపాటు.. ఎక్కడికక్కడ డివైడర్లపై పూలమొక్కలు నాటిస్తున్నారు. దీంతో రహదారులు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. నగర సుందరీకరణపై సీరియస్‌గా దృష్టి సారించిన అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి స్వచ్ఛత విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు. నగరాన్ని అపరిశుభ్రం చేసే ఎలాంటి చర్యకు పాల్పడినా శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. త్వరలోనే సుందరమైన కాకతీయ నగరాన్ని జనం చూస్తారంటున్న కలెక్టర్‌ అమ్రపాలి.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials