Live News Now
  • లక్షల రూపాయల జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్న మంత్రి కామినేని
  • జులై 4న ఏపీ, తెలంగాణాలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
  • ప్రకాశం: రు.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీఎస్‌పురం వీఆర్వో బ్రహ్మయ్య
  • జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం ...రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
  • భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలకు శతాబ్దాల చరిత్ర ఉందిః మోడీ
  • నిర్మల్ జిల్లాలో టర్కీ రాయబారి..కొయ్యబొమ్మలు,పేయింటింగ్ పరిశ్రమ కేంద్రాల సందర్శన
  • దివాకర్ ట్రావెల్స్ కు క్లీన్ చిట్ ...అఫిడవిట్ లో ఏపీ రవాణా శాఖ వివరణ
  • శిరీషది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవుః డీసీపీ వెంకటేశ్వరరావు
  • జీఎస్టీ పై ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళన... 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని డిమాండ్
  • మత్తు మందిచ్చి యశ్వంత్‌పూర్‌-లక్నో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ..ఆరుగురు ప్రయాణికులు బలి
ScrollLogo అంటువ్యాదులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: చంద్రబాబు ScrollLogo శిరీష మృతి కేసులో రాజీవ్, శ్రవణ్‌లను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు ScrollLogo రాష్ట్రానికి రు.4600 కోట్ల ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డ మంత్రి యనమల ScrollLogo సివిల్స్ మూడో ర్యాంకర్ గోపాల కృష్ణకు హైకోర్టు నోటీసులు ScrollLogo తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగులకోటాలో ర్యాంకు పొందారని ఆరోపణ ScrollLogo గుంటూరు రొంపిచర్ల(మ) వీరపట్నంలో ఆస్తి తగాదాలతో అన్నా, వదినను హత్య చేసిన తమ్ముడు ScrollLogo సర్వీసు చార్జి పేరుతో రు.20 అదనంగా వసూలు చేస్తున్న ScrollLogo మాధవ గ్యాస్ కంపెనీపై కేసు నమోదు ScrollLogo వనపర్తి: రంగాపురం మండలం షేరుపల్లిలో ట్రాక్టర్ బోల్తా ScrollLogo 30 మంది ఉపాధి కూలీలకు గాయాలు

ఆకర్ష్ అస్త్రాన్ని పదును పెడుతున్న వైసీపీ

YS-Jagan-Reverse-Operatio-Akarsh-in-Nandyal
Posted: 67 Days Ago
Views: 101   

వైసీపీ ఆకర్ష్ అస్త్రానికి పదును పెడుతుంది. పార్టీలో వలసలను ప్రోత్సహించేందుకు సిద్ధం అవుతోంది. వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన చేస్తోంది. అధికార పార్టీ అసంతృప్తులకు ఫ్యాన్ పార్టీ గాలం వేసే పని లో పడింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు... ఇప్పుడు జగన్‌ కూడా ఇదే సూత్రం ఫాలో అవుతున్నట్టున్నారు. ఎమ్మెల్యేల‌ను విడ‌త‌ల వారీగా త‌న పార్టీలో చేర్చుకుని ఆప‌రేష‌న్ ఆకర్ష్‌తో వైసీపీని బలహీనపరిచింది అధికార టీడీపీ. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారికీ - అప్పటికే ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నేతలకు మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అసంతృప్తితో రగిలిపోతున్నారు. సరిగ్గా అలాంటి వారిని టార్గెట్‌ చేసింది వైసీపి. ఇదే అదనుగా భావించి రివర్స్‌ ఆపరేషన్‌తో టీడీపీని దెబ్బతీయాలని జగన్‌ భావిస్తున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి ని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి కట్టుబెట్టారు. ఇప్పుడు తమకు హ్యాండిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నియోజకవర్గం నంద్యాలపై దృష్టిపెట్టారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు టికెట్‌ ఆఫర్‌తో జగన్‌ సిద్దమయ్యారు. కడపలోను అసంతృప్తులపై కన్నేశారు. జమ్మలమగుడులో మాజీమంత్రి రామసుబ్బారెడ్డితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారముంది. ఇక వైసీపీ నుంచి పదవులు ఆశించి వెళ్లిన కొందరు ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. వారిని మళ్లీ తమవైపు లాగే ప్రయత్నాల్లో ఉన్నారు జగన్‌. ఇప్పటికే టీడీపీ అసంతృప్తులకు గాలం వేసే బాధ్యతలను జగన్‌ సీనియర్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. మొత్తం పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎనికల్లోపే అధికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీలోకి రావడం కాయం అంటోంది వైసీపీ. జగన్ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్ అంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి.


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials