Live News Now
  • నల్గొండ: నార్కట్ పల్లి (మం)ఎల్లారెడ్డి గూడెంలో దంపతులు అనుమానస్పద మృతి
  • తమిళనాడులో గత 30 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికిన డీఎంకే సహా ఇతర పక్షాలు
  • రేపు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చిన డీఎంకే
  • దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నా: కె. విశ్వనాథ్
  • కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సంతోషంగా ఉంది: చంద్రబాబు
  • ఒంగోలులో అంగన్ వాడీ కార్యకర్తల ధర్నా...గత ఐదు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం
  • అమరావతి: ఎమ్మల్యే ఆర్.కె. హైకోర్టు వ్యాఖ్యలపై అసత్య ప్రచారం చేస్తున్నారు
  • చిత్తూరు: రేణిగుంట- మల్లవరం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
  • ఆర్టీసీ బస్సు - లారీ ఢీ, 15 మందికి తీవ్రగాయాలు ఆస్పతికి తరలింపు
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు
ScrollLogo ఢిల్లీ: ప్రధాని మోడిని కలిసిన జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముస్తీ ScrollLogo హైదరాబాద్: మంత్రి తలసానిని కలిసిన మాహుబలి-2 నిర్మాతలు ScrollLogo అమరావతి: మే 27, 28 29 తేదీల్లో విశాఖలో టీడీపీ మహానాడు ScrollLogo అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ScrollLogo కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం ScrollLogo ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం... 11 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి ScrollLogo ఢిల్లీ: కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ScrollLogo మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న కె. విశ్వనాథ్ ScrollLogo 2016 ఏడాదికి కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం... ScrollLogo కె. విశ్వనాథ్ కు అభినందనలు తెలిపిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

రివ్యూ:'లంక'లో ప్రయాణం దారి తప్పింది

Rasi’s-Scientific-Thriller-'Lanka'-Review
Posted: 4 Days Ago
Views: 308   

రివ్యూ : లంక
తారాగణం : రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, తదితరులు
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ :  వి.రవికుమార్
సంగీతం : శ్రీచరణ్ 
నిర్మాత : నామన దినేష్-నామన విష్ణు కుమార్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : శ్రీముని
రిలీజ్ డేట్ : 2017 ఏఫ్రిల్ 21 

రాశిని హీరోయిన్ గా మరిచిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కళ్యాణవైభోగమేతో గుర్తుండిపోయే పాత్రతో కెరియర్‌కి కొత్త టర్న్ తీసుకుంది. లంకలో రాశి లుక్ మాత్రం ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసింది. సినిమా ట్రైలర్ ఆ సర్‌ప్రైజ్‌ని మరికాస్త పెంచింది. లంకలోకి చేరిన రాశి ఎలా మారిందో చూద్దాం..

కథ:
స్వాతి(ఐనా సాహ) మళయాళంలో మంచి పేరున్న హీరోయిన్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈమె తెలుగులో తన డెబ్యూ మూవీ కోసం హైదరాబాద్‌కి వస్తుంది. తన ఏదో ప్రమాదంలో ఉందనే విషయం ఫాదర్ ద్వారా తెలుస్తుంది. స్వాతి ఆ ప్రమాదం నుండి తప్పించుకునేందుకు తన ఐడెంటిటీని దాచుకొని ఒక షార్ట్ ఫిల్మ్‌లో చేసేందుకు ముగ్గురు కుర్రాళ్ళతో కలసి ఒక బంగ్లాకు చేరుకుంటుంది. ఆ బంగ్లాలో రిబ్బకా(రాశి) ని చూస్తుంది. తన కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయి టెలీపతితో తన కటుంబాన్ని ఊహించుకుంటూ బతికే ఒక విచిత్రమైన జీవితం రిబ్బకాది. అక్కడ స్వాతి మిస్ అవుతుంది. స్వాతి సినిమా స్టార్ అవడంతో పోలీస్ అండ్ మీడియా స్వాతి ఏమైందనే విషయం పై దర్యాప్తు వేగం పెంచుతారు.ఒక రోజు పోలీస్ స్టేషన్ కివచ్చిన రిబ్బాకా తనే స్వాతినంటుంది...? స్వాతిని రిబ్బాకా ఏం చేసింది..? స్వాతి లా రిబ్బకా మారడానికి కారణం ఏంటి..? రిబ్బకా  ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది మిగిలిన కథ..?

కథనం:
ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయొచ్చు కానీ అది ప్రేక్షకులు కూడా సర్‌ప్రైజ్‌గా ఫీల్ అయ్యేలా చేయగలిగితేనే దర్శకుడు సక్సెస్ అవుతాడు. లేదంటే  చిరాకు పడతాడు ఇంకా ఇన్వాల్వ్ అయితే తను మోసపోయినట్లు భావిస్తాడు. ఏ సినిమాకయినా ప్రేక్షకుడు ఇలా ఫీలవ్వడం మంచిదికాదు. లంక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.  అనుమానాస్పదంగా పరిచయం అయిన రాశి  ఒకరోజు తన ఇంట్లో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళను వేటాడి చంపుతుంది. ఆ సీన్ చాలా బాగా తీసాడు దర్శకుడు కానీ ఆ సీన్ నిజం కాదు. హీరోయిన్ హీరోకి చాలా క్యూట్‌గా లవ్ ప్రపోజ్ చేస్తుంది దాన్ని ప్రేక్షకులు బలే వుందే అనుకునే లోపు అది అబద్దం అంటాడు. తర్వాత రాశి వచ్చి సినిమాకి సంబంధించిన ఒక కీ-పాయింట్‌ని రివీల్ చేస్తుంది.. అందులో ఒక తీరన ప్రేమ పగగా మారిన కథ ఉంటుంది. ఆ కథ దాదాపు సెకండాఫ్ అంతా జరుగుతుంది. అందులో కామెడీ ఉంటుంది... థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు కాస్త  రోమాంటిక్ టచ్ ఉన్న సన్నివేశాలలో హీరోయిన్ ఐనా సాహ మరింత రెచ్చగొడుతుంది. అది కూడా కథలో చెప్పిన కథే అంటాడు దర్శకుడు దీంతో ప్రేక్షకులు లంక సినిమా తమను మోసం చేసిందనే అభిప్రాయానికి వస్తారు. తర్వాత జరిగే సన్నివేశాలు మీద పెద్ద ఆసక్తి కలగదు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కనుక. కథలో తీసుకున్న టెలీపతి కాన్సెప్ట్ కాస్త ఇంట్రెస్ట్ గా అనిపించింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్‌ని కలిగించింది. ఒక డిఫరెంట్ లుక్‌తో రాశి ప్రేక్షకులుకు ఎప్పుడూ ఏదో ప్రశ్నలను సంధిస్తూ వారిని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఒక ముగ్గురు కుర్రాళ్లు షాట్ ఫిల్మ్ తీయడానికి పడే తంటాల చుట్టూ అల్లకున్న సీన్స్ కామెడీని పండించాడు. సత్య ,గోవర్దన్ టైమింగ్ సరదాగా సాగింది. హీరోయిన్ గ్లామర్‌తో పాటు తన పాత్ర కూడా అనుమానకరంగా ఉండటంతో కథకు ఎంగేజ్ అవుతాడు ప్రేక్షకుడు. అయితే థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులను సర్ ‌ప్రైజ్ చేయడానికి ఎలాంటి సన్నివేశాలయినా పెట్టుకోవచ్చు. కానీ దాని తాలూకు లాజిక్‌ని మాత్రం ప్రేక్షకులకు అంగీకరించే విధంగా ఉండాలి లేదంటే కథ మొత్తం కామెడీ అవుతుంది.  లంక విషయంలో దర్శకుడు ఈ విషయం పక్కన పెట్టాడు. కథలో చాలా బలమైన సన్నివేశాలను పోగు వేసి కథను మరింత జఠిలంగా మార్చాడు. ఒక దశలో ఈ దర్శకుడు కథను ఎటునుంచి ఎటు తీసుకెళ్తున్నాడనే విషయం అర్ధం కాదు. నాలుగైదు సినిమాలు తాలూకు కథను రెడీ చేసి ఒక కథలో నింపేసాడనిపిస్తుంది. దర్శకుడుగా సీన్స్‌ని డీల్ చేసే విధానంలో చాలా పరిణితి కనిపించింది. థ్రిల్లర్ తాలూకు మూడ్‌ని క్రియేట్ చేయడం .. కామెడీకి స్కోప్ ఉన్న చోట ఆ అవకాశాన్ని చక్కగా వాడుకోవడం వంటి విషయాలలో  దర్శకుడు పనితనం తెలిసింది. అయితే సెకండాఫ్ కొచ్చే సరికి ప్రేక్షకులు మొదటినుండి చూసిన కన్ ఫ్యూజన్స్‌కి ఒక రిలీఫ్ నిచ్చే వివరణ కోరుకుంటాడు. అలాంటి రిలీఫ్‌ని అబద్దం చేసాడు దర్శకుడు అదే లంకను తగలెట్టేసింది. తర్వాత ప్రేక్షకులకు ఏం చెప్పినా అది వినేంత ఓపికుండదు. చెప్పేదానిమీద నమ్మకం కలగదు.ఇక రాశి విషయాని కొస్తే తన పాత్ర కొత్తగా అనిపించింది. తన నటన చాలా ప్రెష్‌ ఫీల్‌ని కలుగు జేసింది. తన పాత్రను చాలా చక్కగా నడిపించింది. ఒక ప్లాష్ బ్లాక్ ఎపిసోడ్‌లో బ్యూసారి లో రాశి మరోసారి తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఐనా సాహ కూడా తన పాత్రలోని విభిన్న కోణాలను బాగా పలికించింది. భయపడుతున్నా, భయపెడుతున్నా చాలా కాన్పిడెంట్‌గా ప్లే చేసింది. శ్రీచరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కథలో అనవసరమైన ప్లాట్‌లు చాలా కనిపించాయి. థ్రిల్లర్ సినిమాలకుండే షార్ప్ నెస్‌ని తగ్గించాయి. దీంతో లంకలో ప్రయాణం దారి తెలియకుండా పోయింది.  ఒక దశలో ఎలా బయటపడతామో తెలియని అయోమయానికి గురి చేసింది.

చివరిగా:
'లంక'లో ప్రయాణం దారి తప్పింది


Read Also
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials