Live News Now
  • కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలు
  • కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యే..
  • వివిధ కోణాల్లో 27 మంది విచారించిన అదనపు డీజీ గోపికృష్ణ
  • వరంగల్‌లో కల్తీ ఆయిల్ మాఫియా గుట్టురట్టు.. 12 ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
  • కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో మీటింగ్‌.. ప్రధాని నరేంద్ర మోడీతో డిన్నర్..బీజేపీ-కాంగ్‌తో టచ్‌లో నితీష్
  • ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు.. గుజరాత్‌లో 61 మంది మృతి, నిరాశ్రయులుగా వేలాది మంది
  • కోల్‌కతాలో మెట్రో, ముంబైలో లోకల్ రైల్‌ సేవలకు అంతరాయం
  • మార్కెట్లో టమోటాలు ఎత్తుకుపోతున్న దుండగులు.. రేటు అమాంతం పెరగడంతో కరువైన టమోటా
  • చర్చల ద్వారానే డొక్లామ్‌ వివాదం పరిష్కారం.. భారత్‌, చైనాలకు పెంటగాన్‌ సూచన
  • ఇవాళ మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌ ఫైట్‌.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనున్న భారత్‌..
ScrollLogo విద్యార్థులను పూరీ, సుబ్బరాజు లాగే 12 గంటలు విచారిస్తారా..? ScrollLogo డ్రగ్స్ కేసులో సిట్‌ విచారణపై వర్మ తీవ్ర విమర్శలు ScrollLogo ప్రచారం కోసమే టాలీవుడ్ ను టార్గెట్‌ చేశారని ఆరోపణలు ScrollLogo వర్మ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పద్మారావు ScrollLogo టాలీవుడ్‌నే టార్గెట్‌ చేస్తున్నారనడంపై ఆగ్రహం ScrollLogo డ్రగ్స్‌ కేసులో ఎవ్వరినీ వదలబోమన్న మంత్రి ScrollLogo కులం కావాలా...? అభివృద్ధి కావాలా...?.. నంద్యాలలో చంద్రబాబు ఉప ఎన్నిక నగారా ScrollLogo పరిహారం పెంపుపై వీడని పీట ముడి.. కేసీఆర్ తో మల్లన్నసాగర్ ముంపు బాధితుల చర్చలు విఫలం.. ScrollLogo ఒక్క గ్రామానికే పరిహారం పెంచడం కుదరదన్న తెలంగాణ సీఎం ScrollLogo వరంగల్‌ నుంచి బీజేపీ ఎన్నికల శంఖారావం.. 2019లో అధికారమే లక్ష్యంగా వ్యూహరచన

అందరూ చీదరించుకొనే గొంగళి పురుగులో.. రేపటి సీతాకోక చిలుకను చూచిన చిరు

chiranjeevi-childhood-days
Posted: 6 Days Ago
Views: 13356   

మెగా స్టార్ చిరంజీవి నెంబర్ 1 హీరో గా 20 ఏళ్ళకు పైగా టాలీవుడ్ ని ఏలినా ఈ రోజుకీ మధ్య తరగతి నేచర్ ఉంటుంది అని సన్నిహితులు చెబుతుంటారు.. చిన్నప్పుడే చిరంజీవి భావాలు  చాలా సున్నితంగానూ, ఉన్నతంగానూ వుండేవి అని చిరంజీవి బాల్య స్నేహితుడు.. ప్రాణస్నేహితుడు అయిన ప్రముఖ డాక్టర్ సత్యప్రసాద్ గారు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకొన్నారు..
చిరంజీవిగా మారిన శంకరబాబూ, సత్యప్రసాద్ గారు 10th Class చదువుతున్న రోజుల్లో మొగల్తూరులోని శంకర బాబు అమ్మమ్మ గారింట్లో ఇద్దరం కంబైండ్ స్టడీ చేసేవాళ్ళం..తనకు కొంచెం అల్లరి ఎక్కువ...ఆ టైం లోకూడా నేను పాఠాలు గట్టిగా చదువుతూ ఇద్దరం చదివేలా చెయ్యడం నా అలవాటు.. రోడ్డుకు ఒకవైపు అమ్మమ్మగారిల్లు, ఆవతలి వైపు అమ్మమ్మగారి తోట. ఆ తోటలో మామిడిచెట్లు, ఒక ములగచెట్టు..ఒక దొరువు[నీళ్ళకోసం] కూరగాయల మొక్కలు, పాదులు దొరువు పక్కన 'నాభి'[GLORIOSA SUPERBA]పొద ఉండేది అని చెప్పారు.. అక్కడ తోటలో కూరగాయలు పాండిచేవారు.. కాగా ఆ తోటలో ఉన్న నాభి మొక్క చాలా విషం అని అంటారు..కానీ పూలు చాలా ఆకర్షణీయంగా మొదట పసుపురంగు లో ఉండి.. క్రమంగా ఎరుపు లోకి మిశ్రమవర్ణం లోకి మారి చాలా అందంగా కనిపించేవి. ఆ నాభి పొద మీద సీతాకోకచిలకలు ఎక్కువ వాలుతూ వుండేవి...అయితే శంకర బాబు.'.ఆ పొద దగ్గరకు మనం వెళ్తే ఆ సీతాకోకచిలకలు డిస్టర్బ్ అవుతాయి....దూరంగా వుండి ఎంజాయ్ చేద్దాము' అనేవాడు.. అదీ అతని సున్నితభావం.. ఒకసారి మునగచెట్టుకి విపరీతంగా గొంగళి పురుగు పట్టింది...రైతు వచ్చి అమ్మమ్మతో ఆ గొంగళి పురుగుకి కి మందు కొట్టాలి అన్నాడు.. అది శంకర బాబు విని వద్దు వద్దు...ఆ గొంగళిపురుగులన్నీ అందమైన సీతాకోకచిలుకలౌతాయి...వాటిని చంపవద్దు' అన్నాడు.. రైతు మందు కొట్టకపోతే 'ములగచెట్టు చచ్చిపోతుంది' అన్నాడు..అయినా శంకర బాబు ఒప్పుకోలేదు అందరూ చీదరించుకునే గొంగళి పురుగులో రేపు బయటకు వచ్చే సీతాకోక చిలుకని చూసిన సున్నితమైన ఉన్నతమైన భావాలు ఆ వయసులోనే వున్న వ్యక్తి చిరంజీవి.. అని సత్యప్రసాద్ గారు అలనాటి జ్ఞాపకాలను పంచుకొన్నారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials