Live News Now
  • రాజ్యసభలో టీడీపీ నిరసనల హోరు.. గందరగోళం మధ్య సోమవారానికి వాయిదా
  • వాయిదాలపై ఏపీ ఎంపీల ఆగ్రహం.. కేంద్రం తీరుపై ఆందోళన పథం
  • విశాఖ అభివృద్ధిపై విష్ణు సెటైర్లు.. కేంద్రం టార్గెట్‌గా టీడీపీ కౌంటర్లు
  • లోక్‌పాల్‌పై పోరుబాట.. ఢిల్లీలో దీక్షకు దిగిన అన్నా హజారే
  • వర్షాకాలానికి కోయిల్‌ సాగర్‌ పూర్తి.. లక్ష ఎకరాలకు నీరిస్తామన్న హరీష్‌
  • వరకట్నం కేసులో హెడ్ కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ దాడి
  • కేంద్రంతో మాటల్లేవ్‌.. చర్చల్లేవ్‌.. హోదాపై చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌
  • రాజ్యసభ విజయంతో టీఆర్ఎస్ లో జోష్‌.. రెబెల్స్‌పై వేటుకు టి-కాంగ్ కంప్లైంట్‌
  • ఎస్‌ఐ దాడితో కానిస్టేబుల్‌ సూసైడ్‌ అటెంప్ట్‌
  • అవిశ్వాసం ఎపిసోడ్‌లోకి కాంగ్రెస్‌.. మంగళవారం పరిణామాలపై ఆసక్తి
ScrollLogo పన్ను రద్దు.. బకాయిలు మాఫీ.. కల్లుగీత కార్మికులపై కేసీఆర్ వరాల జల్లు ScrollLogo దేశవ్యాప్తంగా 25 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్ ScrollLogo బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి.. తెరపైకి తెచ్చిన శరద్ యాదవ్ ScrollLogo ఆరోరోజూ తెలుగు ఎంపీల అవిశ్వాస పోరాటం ScrollLogo 8 బ్యాంకులు.. 1394 కోట్ల బకాయిలు.. టొటెం గ్రూప్‌లో సీబీఐ సోదాలు ScrollLogo రైతు సమస్యలపై టీ-బీజేపీ పోరు బాట... ScrollLogo అవుటర్‌పై కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి ScrollLogo హోదా పోరులో వెనకడుగు లేదు - ఏపీ సీఎం ScrollLogo రాములోరి బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు 30న కల్యాణం ScrollLogo ఆగని టీఆర్ఎస్‌, అన్నాడీఎంకే ఆందోళనలు.. నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ వాయిదా

రివ్యూ: అర్జున్ రెడ్డి..

arjun-reddy-movie-review
Posted: 211 Days Ago
Views: 6649   

విజయ్ దేవరకొండ  లెటెస్ట్ యూత్ ఎట్రాక్షన్...  ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ కాంట్రవర్సరీతో పాటు యూత్  అటెన్షన్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది.  అనూహ్యంగా పెరిగిన అర్జున్ రెడ్డి హైప్స్ ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యంలో పడేసాయి.  మరి అర్జున్ రెడ్డి ఎలాంటి ఎక్స్ పీరయన్స్ ప్రేక్షకులకందించాడో తెలుసుకుందాం...?

కథ:
అర్జున్ రెడ్డి ( విజయ దేవరకొండ)  హౌస్ సర్జెన్ చేస్తున్న మెడికల్ స్టూడెంట్.  కోపాన్ని కంట్రోస్ చేసుకోలేని అర్జున్  రెడ్డి కాలేజ్ లో గొడవలు సహాజం.  అదే కాలేజ్ లో జాయిన్ అయిన ప్రీతి శెట్టి ( షాలిని) ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు.  తన కోపం తో పాటు ప్రేమను అర్దం చేసుకున్న షాలిని అతన్ని ప్రేమిస్తుంది. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లోకి వెళతారు.   మెడిసిన కంప్లీట్ చేసి  మాస్టర్స్ చేసేందుకు అర్జున్ డెహ్రాడూన్ వెళ్తాడు. ప్రీతి అదే కాలేజ్ లో  మెడిసిన్ కంప్లీట్ చేస్తుంది.   వీరి ద్దరూ పెళ్ళి చేసుకుందామనుకునే టైం లో ప్రీతి వాళ్ళ నాన్న కు అర్జున్ కోపం వేరేగా అర్దం అవుతుంది. ప్రీతికి వేరే పెళ్ళి చేస్తాడు. అప్పటినుండి అర్జున్ ఇంటికి దూరం అవుతాడు మందుకు బానిస అవుతాడు.. డ్రగ్స్ అతని జీవితంలోకి వస్తాయి..డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే అతని జీవితానికి మాత్రం దూరం అవుతుంటాడు. మరో అమ్మాయికి కనెక్ట్ అవలేడు ప్రీతిని మర్చిపోలేడు. హాస్సటల్ లో జరిగిన ఒక సంఘటన అతన్ని డాక్టర్ వృత్తికి కూడా దూరం చేస్తుంది. మరి అర్జున్ రెడ్డి మానసిన సంఘర్షణ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ..?

కథనం:
సినిమాకి అసలు ఫార్మెట్ ఉండకూడదు అనే నమ్మే దర్శకుల జాబితాలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా చేరతాడు. అయితే ఫార్మెట్ తో పాటు సినిమాకుండే బాధ్యతలను పూర్తిగా వదిలేసిన దర్శకుల జాబితాలో కూడా  సందీప్ రెడ్డి చేరతాడు. సమాజాన్ని ప్రభావితం చేసే వాటిలో సినిమాలు ముందుంటాయి.  హీరోలను అనుకరించే యూత్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు.  అయితే అర్జున్ రెడ్డిలో కనిపించే నిజాయితీ అనే గుణం తప్ప ఈ పాత్ర ద్వారా దర్శకుడు యూత్ కి ఎక్కించిన మత్తు మాత్రం చాలా ప్రమాదకరమైనది. సిగరెట్ తాగడం అనే అలవాటు స్టైయిల్  నుండే మొదలవుతుంది.  హీరోలను అనుకరించేందుకు సిగరెట్లు మొదలెట్టిన అభిమానులు లెక్కకు మించే ఉంటారు.  అందుకే   అర్జున్ రెడ్డి కూడా  ఆరోగ్యానికి ప్రమాదకరం అనక తప్పదు. ఎందుకంటే అతని కోపం కంట్రోల్ లో ఉండదు. అతని జీవితంలో తన అహంకారానికి తప్ప వైద్య వృత్తికి కనీస మర్యాద ఇవ్వడు. విపరీతమైన ధోరణితో తిరిగే అర్జున్ రెడ్డి ని అభిమానించడం అంటే మనలోని నెగిటివ్ థాట్స్ ని ప్రేరేపించడమే అవుతుంది.  అర్జున్ రెడ్డి  జీవితంలోకి ప్రీతి ప్రవేశించాక  సినిమా కొంత గాడిలోకి వస్తుంది. తన ప్రేమను చదువును బాలెన్స్ చేసే  అర్జున్ రెడ్డి క్యారెక్టర్  ఆమోద యోగ్యంగా మారుతుంది. అయితే లవ్ బ్రేక్ అయిన తర్వాత అర్జున్ రెడ్డిలోని వికృతమైన ధోరణులు బయటికి వస్తాయి. అమ్మాయిలతో ఫిజికల్ గా రిలేషన్ పెట్టుకోవాలని అతను పడే ఆరాటం జుగుప్సాకరంగా ఉంటుంది. విపరీతమైన తాగుడు, డ్రగ్స్ వాడటం.. చేస్తున్న వృత్తి పట్ల కనీస గౌరవం లేకపోవడం ఇలాంటి పెడదోరణులకు యూత్ ఎట్రాక్ట్ అయితే మాత్రం అర్జున్ రెడ్డి దే ఆ క్రెడిట్ అంతా..
ఇక దర్శకుడు రాసుకున్న లవ్ స్టోరీ కంటే ప్రెండ్ షిప్ ఇందులో బాగా వర్క్ అవుట్ అయ్యింది. హీరో  ఫ్రెండ్ గా చేసిన రాహుల్ రామ కృష్ణ,  అర్జున్ రెడ్డికి పెద్ద రిలీఫ్ గా మారాడు. తెలంగాణా స్లాంగ్ లో ఈ కుర్రాడు చేసిన పాత్ర చాలా ఎంటర్ టైన్ చేసింది. ఏ సందర్భంలోనూ స్నేహితుడ్ని వదలని ఈ పాత్ర సినిమా కి అసెట్ గా మారింది.  తెరపై కనిపించే బోల్డ్ కంటెంట్ ని అశ్లీలంగా కనిపించకుండా చేసే బాధ్యతను మ్యూజిక్ దర్శకుడు రాథన్ తీసుకున్నాడు. మధురం పాట వచ్చే సన్నివేశం మంచిగా అనిపించాలంటే కళ్ళు మూసుకొని పాటలు వినడమే మంచిది. 
గొప్ప ప్రేమకథ అనుకోవడానికి కూడా ఏమీ కనిపించలేదు.  ఒక అమ్మాయి కనపడగానే ఆ పిల్లనాది అని తనే అనేసుకొని ఆ అమ్మాయి బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకుంటాడు. ఏదో ఒక సిట్యువేషన్ లో ఆ అమ్మాయి తనను ఇష్టపడుతుంది. అయితే అర్జున్ రెడ్డి తనను వదిలి వెళ్లిపోలేని అమ్మాయికి ప్రాక్టికల్ పాటాలు చెప్పి మాస్టర్స్ చేయడానికి వెళతాడు. మరి తనను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కేవలం ఆరు గంటల గడవు ఇస్తాడు.. ఈ లోపు ఫోన్ చేయకపోతే వదిలేస్తానంటాడు. అంత సిల్లీగా ఎలా బిహేవ్ చేసాడో అర్దం కాదు. ఇక లవ్ బ్రేక్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి మరింత  ప్రమాదకరంగా తయారవుతాడు. తన శిథలం అవుతూ  ఆ భారాన్ని ప్రేమపై మోపే దేవదాసులా మారతాడు. అప్పటికీ ఇప్పటికీ తాగుడు, పక్కనే ఒక కుక్క ఏదీ మారలేదని ఈ అర్జున్ రెడ్డి కూడా నిరూపించాడు.  ప్రెండ్ షిప్ ని, వృత్తిని, తనను ప్రేమించే వారిని ఎవరినీ ప్రేమించలేని అర్జున్ రెడ్డి ఎవరికీ అర్దం కాలేదు... ఇందులో రాధన్ అందించిన మెలోడీస్ బాగున్నాయి. విజయ్ దేవరకొండ  క్యరెక్టర్ లో జీవించాడు. దర్శకుడిగా సందీప్ రెడ్డి కొత్త సన్నివేశాలు రూపొందించడంలోనూ, సహాజంగా వాటిని తెరపైకి ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. 

చివరిగా:
యూత్ ఎట్రాక్ట్ అయ్యే అన్ని విషయాలు మంచివికావు, గొప్పవి అనిపించుకోవు.. అర్జున్ రెడ్డి కూడా అంతే..
సిగరెట్, మద్యం, డ్రగ్స్ లాగా అర్జున్ రెడ్డి కి దూరంగా ఉండటం మంచిది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials