Live News Now
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • నల్గొండ: మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డునల్లి శ్రీనివాస్ హత్య.. బండరాయితో మోది చంపిన దుండగులు
  • నెల్లూరు జిల్లా కావలి వద్ద రోడ్డుప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
  • హైదరాబాద్ లో ఐదు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 48 మంది పై కేసులు నమోదు
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.. కాలినడక భక్తులకు 2 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం
ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం ScrollLogo సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ScrollLogo ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు ScrollLogo చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌ ScrollLogo మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ ScrollLogo వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
Tollywood/Bollywood

త్వరలో బుల్లి తెరపై సందడి చేయనున్న రేణు దేశాయ్

Renu-Desai-Hosting-A-Reality-Show
Posted: 163 Days Ago
Views: 453   

బద్రి, జానీ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణు మళ్లీ తెరంగేట్రం చేస్తోంది. అవును ఈ వార్త నిజమే.. రేణుదేశాయ్ మళ్లీ మేకప్ వేసుకోబోతోంది. అయితే వెండి తెర కోసం కాదు బుల్లి తెర కోసం మళ్ళీ మేకప్ వేసుకొనున్నది. అవును.. అతి త్వరలో మాటివిలో ప్రసారం కాబోతోన్న ఓ రియాలిటీ షోతో బుల్లి తెరపై సందడి చేయడానికి రేణు రెడీ అవుతుంది.. మరి ఇన్నాళ్లూ ఇంటి పనులు చూసుకున్న రేణు సడెన్ గా ఈ షో ఎందుకు చేస్తోందో తెలుసా..?
ఖండాలా దారుల్లో జలపాతంలా తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసిన బ్యూటీ రేణూదేశాయ్. నటిగా తను చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే. ఇందులో ఒకటి తమిళ్ మూవీ. అయితేనేం.. ఆ రెండు సినిమాలతోనే తెలుగులో ఎప్పటికీ తరగని క్రేజ్ సంపాదించింది. మోడలింగ్ నుంచి మొదలై నటిగా మారి కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఎడిటర్ గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న రేణూ చాలాకాలం క్రితమే ఈ గ్లామర్ ఫీల్డ్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక మళ్లీ తెరపై కనిపించదు అని అంతా ఫిక్స్ అయిన టైమ్ లో సడెన్ గా ఇలా రియాలిటీ షోతో రీ ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు తెలుగు టివి మీడియంలో సెన్షేషన్ గా మారింది. అయితే రేణు ఇప్పుడీ షో ఒప్పుకోవడానికీ ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది..
ఎంటర్టైన్మెంట్ టివి మీడియం అంటేనే రేటింగ్ లతో రేసింగ్ లు. అందుకే ప్రతి షోకీ సరికొత్త అట్రాక్షన్ యాడ్ చేస్తుంటాయి ఆయా చానల్స్. ఒకప్పుడు ఇందుకోసం బుల్లితెర గ్లామర్ నే వాడుకున్న టివిలు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ స్టార్డమ్ ను తమ రేటింగ్స్ కోసం వాడేస్తున్నాయి. నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు స్టార్ మాటివి దించుతోన్న ఆ క్రేజీ స్టార్ రేణూదేశాయ్ కావడం విశేషం. ఎలా చూసుకున్నా రేణూదేశాయ్ ఎంట్రీ టివి మీడియంలో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తుందనేది నిజం. మరి ఈ షో ఏంటీ.. ఎప్పుడు ఎలా ప్రసారం అవుతుంది..? అందులో రేణూ ఏం చేయబోతోంది..? తెలుసా..!! నేషనల్ వైడ్ గా ఉన్న ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో డాన్స్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు స్టార్ మాటీవి కూడా ఓ డాన్స్ బేస్డ్ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసింది. 2005లో స్టార్ ప్లస్ లో నాచ్ బలియే పేరుతో మాధురి ధీక్షిత్ జడ్జ్ గా వచ్చిన ఓ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇందులో కపుల్ డాన్స్ హైలైట్. సరిగ్గా అలాంటి షోనే స్టార్ మాటీవి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఈ షోలో బాలీవుడ్ లో మాధురీదీక్షిత్ లా తెలుగులో రేణూ దేశాయ్ జడ్జ్ గా ఉండబోతుంది. రేణు మంచి డ్యాన్సర్ కూడా కావడంతో పాటు ఆమెకు ఉన్న క్రేజ్ నూ దృష్టిలో పెట్టుకునే స్టార్ మా ఆమెను అప్రోచ్ అయిందట. ఇది తనకు సరిగ్గా సరిపోయే ప్లాట్ ఫామ్ కావడంతో రేణు కూడా వెంటనే అంగీకరించింది అని టాక్. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయనేది లేటెస్ట్ న్యూస్. ఇక ప్రస్తుతం స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతోన్న బిగ్ బాస్ షో పూర్తి కాగానే రేణుదేశాయ్ రియాలిటీ షో స్టార్ట్ కాబోతోంది.. సో..ఈ షోతో రేణు ఎలాంటి మార్క్ వేస్తుందనేది వేచి చూడాల్సిందే మరి..!!

Renu Desai, Judge ,The Dance Show, maa tv, special show


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials