Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

స్టార్ హీరోల సోషల్ వార్ స్టార్ట్..

Mahesh-babu-and-Ntr-fans-social-war-started
Posted: 132 Days Ago
Views: 274   

టాప్ స్టార్స్ ఇద్దరూ ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ కు దిగుతున్నారంటే బాక్సాఫీస్ బోల్డంత కిక్ వస్తుంది. ట్రేడ్ మార్కెట్ కు ఢబుల్ ఎనర్జీ వస్తుంది. ఇక బరిలో దిగుతోన్న హీరోల అభిమానుల హంగామా అయితే మామూలుగా ఉండదు. ఛాలెంజులతో సోషల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఆ వార్ నే నాలుగోసారి రిపీట్ చేస్తున్నారు జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు. జైలవకుశ-స్పైడర్ లతో దసరా బరిలో దిగుతోన్న యంగ్ టైగర్, సూపర్ స్టార్ లలో గెలుపెవరిది? 

ప్రజెంట్ జనరేషన్ లోని స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ ఫైవ్ లో ఉంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా వీళ్లిద్దరికి అభిమానులు ఉన్నారు. మాస్ క్లాస్ యూత్ అనే తేడా లేకుండా ఇద్దరికీ అన్ని వర్గాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగట్టగల స్టామినా ఇద్దరికీ ఉంది. ఇప్పుడు ఈ ఇధ్దరి సినిమాలు ఒకే టైంలో రాబోతున్నాయి. మహేబ్ బాబు నటించిన స్పైడర్-ఎన్టీఆర్ చేసిన జై లవకుశ ఈ దసరా సీజన్లో వారం రోజుల గ్యాప్ తో రాబోతున్నాయి.  

ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు సినిమాలు ఇలా పోటాపోటీగా థియేటర్లకు రావడం ఇది మొదటిసారేమీ కాదు. అసలు వీళ్ల కెరీర్ లో ఇలా ఒకేటైంలో పోటీగా సినిమాలు రిలీజవడం ఇది నాలుగోసారి. ఒక్కడు, నాగ చిత్రాలతో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అప్పుడు పై చేయి మహేష్ బాబుదే. ఆ తర్వాత ఏడేళ్ల వరకు అలాంటి పరిస్థితి రాలేదు. రెండోసారి ఖలేజా - బృందావనం సినిమాలు ఒకేటైంలో వచ్చాయి. ఈ సారి ఎన్టీఆర్ పై చేయి సాధించాడు. మూడోసారి దూకుడు-ఊసరవెల్లి సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఒక్క సమయంలోనే వచ్చాయి. అయితే ఈ మూడోసారి మహేష్ బాబు సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు నాలుగోసారి తారక్-ప్రిన్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. దసరా కానుకగా ఎన్టీఆర్ కొత్త సినిమా  జైలవకుశ ఈ నెల 21న విడుదలవుతోంది. అలాగే ఈ నెల 27న మహేష్ బాబు స్పైడర్ మూవీ వస్తోంది. ఈ రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. రెండింటి మీద అభిమానుల్లో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. స్పైడర్ ద్విభాషా చిత్రంకాగా.. జై లవకుశ తెలుగులో మాత్రమే వస్తోంది. రెండెంటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగింది. 

ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. మొదటి మూడుసార్ల పోటీలో ఏదో ఒక సినిమా మాత్రమే హిట్ టాక్ తెచ్చుకోగలిగింది. రెండోసినిమాకు ఫ్లాప్ ముద్ర తప్పలేదు. ఈసారి ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఇద్దరూ హిట్ కొట్టే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ చూస్తే...ఈ రెండు సినిమాలపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. దసరా సీజన్ కావడంతో ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయి. మరి నాలుగో సారి జరుగుతున్న బాక్సాఫీస్ వార్ లో విజేతగా మహేష్ నిలుస్తాడో లేక ఎన్టీఆర్ నిలుస్తాడో... అదీ కాకుండా ఇద్దరూ సక్సెస్ అవుతారో చూడాలి.

tag: Mahesh, babu, and, Ntr, fans, social, war, started


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials