Live News Now
  • సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
  • ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది మృతి, 12 మందికి గాయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ ఆలయాలు
  • చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చిన కెల్విన్‌
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్
  • వచ్చే ఎన్నికల బరిలో తలైవా టీమ్‌
  • హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం
  • తెలంగాణ రైతులకు న్యూఇయర్‌ గిఫ్ట్.. అర్థరాత్రి నుంచి మొదలైన 24 గంటల పవర్‌
  • కొత్త రికార్డ్‌ సృష్టించిన దుబాయ్‌ బూర్జ్‌ ఖలీఫా
  • కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన ప్రజలు
ScrollLogo కడప: పులివెందుల మం. ఉలిమెల్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ScrollLogo నేడు కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఖరారు చేయనున్న చంద్రబాబు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ScrollLogo తమిళనాడు కాంచీపురంలో రోడ్డుప్రమాదం ఆరుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం ScrollLogo అమరావతి: మాజీ ప్రధాని వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ScrollLogo శాతవాహన వర్సిటీలో ఉద్రిక్తత మనుధర్మ శాస్త్ర పుస్తకాన్ని తగలబెట్టారంటూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన ScrollLogo టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హాజరైన కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు ScrollLogo మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే అత్యవసర సమావేశం ScrollLogo జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌లకు అభిషేకం ScrollLogo యదాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం
TELE "VISION"

క్యాండీక్రష్ ఆడుకోమని 10ఏళ్ల చిన్నారికి ఆపరేషన్ చేసిన వైద్యులు

10-year-old-undergoes-a-brain-surgery-while-she-played-Candy-Crush
Posted: 126 Days Ago
Views: 211   

ప్రపంచంలో మనం చేసే పనిలో మంచి చెడులను మనమే నిర్ణయించుకోగలం.. ఇటీవల బ్లూవెల్ గేమ్ డెత్ బెల్ మ్రోగుతున్న సంగతి విధితమే.. కాగా సెల్ ఫోన్ లోని క్యాండీ క్రష్ గేమ్ ఓ పదేళ్ళ చిన్నారికి ఆపరేషన్ చెయ్యడానికి ఉపయోగపడింది. ఆ పాప ప్రాణం నిలబెట్టింది.. పదేళ్ళ చిన్నారి తనకిష్టమైన క్యాండీ క్రష్ గేమ్ సెల్ ఫోన్లో ఆడుతున్న సమయంలో డాక్టర్లు ఆ పాప మెదడుకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్నంత సేపూ ఆ పాప నవ్వుతూ సరదాగా ఉన్నది.. ఈ ఆశ్చర్యకరమైన ఆపరేషన్ చెన్నై పడపళనిలోని సిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకొన్నది. వివరాల్లోకి వెళ్తే..

చెన్నై లో 5వ తరగతి చదువుతున్న నందిని అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి గిలగిలా కొట్టుకొంటూ పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షల్లో చిన్నారి మెదడులో 'ఖనితి' ఉన్నట్లు తెలిసింది. మెదడులో ఎడమభాగం లో ఉన్న ఈ కణితి బాలిక ముఖం, చేయి, కాలు కదలికలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెప్పారు.. అంతేకాదు ఆ కణితి పెరిగితే పక్షవాతానికి దారితీయడమే కాదు ప్రాణాంతక పరిస్థితికి కూడా దారి తీస్తుందని సిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ రూపేష్ కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు.. అయితే పాపకు ఆపరేషన్ అందరికీ చేసినట్లు మత్తు మందు ఇచ్చి చెయ్యలేమని... ఆపరేషన్ చేసే సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని.. పొరపాటు ఏమైనా జరిగితే చిన్నారి ఎడమ భాగమంతా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులకు వివరించారు. అందుకని పాపకు ఆపరేషన్ మత్తు మందు ఇచ్చి చేయకూడదని మెలకువగానే ఉండగా ఆపరేషన్ చేయాలని.. చెప్పారు.. ఇలాంటి ఆపరేషన్లు పెద్దవారికి చేసినా చిన్నారుల్లో చాలా అరుదని సిమ్స్ ఇన్ స్టిట్యూట్ న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాపు తెలిపారు.. అంతేకాదు.. ఆపరేషన్ చేసే సమయంలో చిన్నారికి నొప్పి కలగదని.. మెదడులో నూరాన్లకు పెయిన్ రిసెప్టర్స్ ఉండనందున శస్త్ర చికిత్స జరిగినా నొప్పి ఉండదని వివరించారు.. కానీ ఈ తరహా ఆపరేషన్ కు చిన్నారి తల్లిందండ్రులు అంగీకరించలేదు.. వెంటనే డాక్టరైన బాలిక మామయ్య సహాయం అడిగారు. దీంతో ఆయన నందినికి ఆపరేషన్ చేసే సమయంలో ఆపరేషన్ గదిలో ఉన్నారు.. నందినికి సెల్ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకోమని చెప్పిన డాక్టర్లు శాస్త్ర చికిత్స ను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇతర భాగాల పై ప్రభావం పడకుండా వైద్యులు కోరినప్పుడల్లా తన కాళ్ళు చేతులు కదిలిస్తూ.. చిన్నారి ఎంతగానో ఆపరేషన్ కి సహకరించింది. మొత్తంగా ఆపరేషన్ మూడున్నర గంటలపాటు సాగింది.. ఈ ఆపరేషన్ గత బుధవారం జరగగా.. శుక్రవారం నందిని డిశ్చార్జ్ చేశారు.. పాప ఆరోగ్యంగా ఉందని కోలుకున్నదని మామయ్య తెలిపారు..


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials