Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఎన్టీఆర్ 'జై లవకుశ' రివ్యూ

NTR,Raashi-and-Nivetha-in-'Jai-Lava-Kusa'-review
Posted: 273 Days Ago
Views: 5043   

ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో జూ.ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా అది కూడా  మూడు పాత్రలు .  ఇలాంటి స్పెషల్ ఎట్రాక్షన్స్‌తో పాటు పరిచయం చేసిన మూడు పాత్రలు సినిమా పై అంచనాలను పెంచాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కళ్యాణ్‌రామ్ మాటలు ఆ అంచనాలను పదింతలు చేసాయి.  మరి జై లవకుశకి ప్రేక్షకులు జై కొట్టారా..? చూద్దాం...

కథ:
జై, లవ, కుశ అన్నదమ్ములు. మేనమామ(పోసాని) సంరక్షణలో పదేళ్ల వయస్సునుండే నాటకాలు వేసుకుంటూ, ఊరూరా తిరుగుతుంటారు. నత్తి కారణంగా జై కి పెద్దగా విలువ ఇవ్వరు లవ, కుశలు.  వారికి వచ్చే ప్రశంసలు, తనకి దక్కే తిరస్కారలతో జై , లవకుశలకు మద్య దూరం పెరుగుతుంది.  వారి మీద ద్వేషం  పగగా మారుతుంది. ఒక ప్రమాదంలో విడిపోయిన ఈ ముగ్గరు ఒకరికొకరు చనిపోయారనుకొని ఎవరికి వారు బతుకుతుంటారు. 20 యేళ్ళ తర్వాత లవ బ్యాంక్ మేనజర్ అయితే కుశ దొంగగా మారతాడు. జై రావణుడిగా మారతాడు.. తన తమ్ముళ్ళు బతికి ఉన్నారని తెలుసుకొని వారిని తన దగ్గరకు రప్పించుకుంటాడు. ప్రేమగా చూసుకోవడానికి కాదు, తన పంతం నెగ్గించుకోవడానికి. మరి అన్నలోని రాక్షసత్యం చూసిన లవ,కుశలు ఏం చేసారు..?రావణుడిగా మారిన జై  ఇంటికి చేరిన లవకుశలు కథను ఏం మలుపు తిప్పారు..? పంతం నెగ్గిందా.? అన్నదమ్ముల అనుబంధం గెలిచిందా..? అనేది మిగిలిన కథ..?

కథనం:
ఏ తల్లి అయినా కడుపున పుట్టిన పిల్లలను ఒకే రకంగా చూస్తుంది. కానీ సమాజం వారిని అలా చూడదు. ఎవరికయినా లోపం ఉంటే దాన్ని పెద్దదిగా చూపిస్తూ చిన్న చూపు చూస్తుంది. సమాజం అలా చూసినా పర్లేదు,  తోడబుట్టిన వారు కూడా అలాగే చూస్తే మాత్రం భరించడం కష్టం. ఆ కష్టం లోంచి పుట్టిన ద్వేషం కి రూపం వస్తే ఆ పాత్ర జై లా ఉంటుంది.  మూడు పాత్రలు ఏ నటుడి కయినా ఛాలెంజ్ అనిపిస్తాయి. అలాంటి ఛాలెంజ్ ని  ఎన్టీఆర్ అవలీలగా గెలిచాడు. లవ పాత్రలోని నిజాయితీ, కుశ పాత్రలోని కొంటెతనం, జై పాత్రలోని కర్కశత్వం అణువణువూ నింపుకొని పాత్రలకు ప్రాణం పోసాడు.  సినిమా లోని పాత్రలు పరిచయం అయ్యాక. ఏ పాత్రను తక్కువ చేయని పటిష్టమైన  కథ ఆకట్టుకుంటుంది.  లవ పాత్రలోని అమాయకత్వం తో పాటు ఒక సిన్సియర్ ప్రేమకథను చాలా ఎమోషనల్ గా చెప్పాడు దర్శకుడు.  అన్నదమ్ముల కథే అయినా లవ్ కుమార్ ప్రేమకథను బాగా ఎమోషనల్ గా సాగింది. కుశ క్యారెక్టర్ పూర్తి ఎంటర్ టైనర్ గా మారింది.  ఆ పాత్ర తాలూకు చిలిపితనం బాగా పండింది.  డిమోనిటైజేషన్  ఎఫెక్ట్  చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు సరదాగా సాగాయి. ఇక రావణ లంకకు లవకుశలు చేరడంతో అసలు కథ మొదలవుతుంది. ఇంటెర్వెల్ బ్లాక్ ని హై కమర్షియల్ పాయింట్స్ తో వళ్ళు గగుర్పొడిచేలా డిజైన్ చేసాడు దర్శకుడు బాబి. జై పాత్ర ఇంట్రడక్షన్ చాలా బలంగా చూపాడు. తన అహం ఎవరిముందు తలవంచనివ్వదు కాబట్టి తన లాగా ఉండే తమ్ముళ్ళ ను అడ్డం పెట్టుకొని తన రాజకీయ భవష్యత్ ని నిర్మించుకోవాలనే జై ఆలోచన, అన్నకు దగ్గరవాలనే లవకుమార్ ప్రేమ, ఎలాగయినా దొరికినంత దోచుకొని పారిపోవాలనే కుశుడు స్వార్దం ఈ భిన్న మైన పాత్రలను జూ. ఎన్టీఆర్ అద్భుతంగా పోషించాడు. మనం అనేది అబద్దం నేను అనేది నిజం అనుకునే జై పాత్రలో జూ. ఎన్టీఆర్ విశ్వరూపం చూడొచ్చు.  వేర్వేరు గెటెప్ లతో మూడు పాత్రల వ్యత్యాసాలు చూపించడం కాస్త తేలికే కానీ ఒకే గెటప్ తో ఒకేలా కనిపించే మూడు పాత్రలను తన నటనతో ప్రేక్షకులకు ఏవరేంటో తెలికగా తెలసిపోతుందంటే ఆ నటుడు ప్రతిభ సముద్రమంత ఉండాలి.  అందుకే  జూ. ఎన్టీఆర్ ప్రతిభకు ముగ్దులయిపోతారు.   ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ.. ఇది ఎన్టీఆర్ నటనాస్థాయిని తెలిపే మాటలా అనిపించింది. కథనంలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా కుశుడు పాత్ర బాలెన్స్ చేసింది. అసుర, అసుర, రావణాశురా అనే సాంగ్ జై క్యారెక్టర్ ని పతాకస్థాయిలో నిలబెట్టింది.  ట్రింగ్ ట్రింగ్ రాశికన్నా గ్లామర్, జూ. ఎన్టీఆర్ స్టెప్ లు ఆకట్టుకున్నాయి. కళ్ళలోని కాటుక పాట మెలోడీగా సాగితే, స్వింగ్ జరా సాంగ్ లో తమన్నా ఊపు తెచ్చింది. సెకండాఫ్ లో వచ్చే నాటకం ఎపిసోడ్ ఎమోషనల్  గా హై టచ్ నిచ్చింది.   తన ఉనికి కోసం జై చేసిన పోరాటం అతడ్ని రావణుడ్ని చేస్తే , అన్న కోసం లవకుశలు చేసిన ప్రయత్నాలు జై ని ఏం చేసాయి అనే పాయింట్ ని దర్శకుడు బాబి బాగా హ్యాండిల్ చేసాడు.  కోనా వెంకట్ రాసిన స్క్రీన్ ప్లే సినిమాకి హైలెట్ గా నిలిచింది.  దర్శకుడిగా, కథకుడిగా బాబి పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాడు.  దసరాకి ముందే జై లవకుశల జైత్రయాత్ర మొదలయ్యింది. 

చివరిగా:
జూ. ఎన్టీఆర్ ఒన్ మాన్ షో,  ఫరెఫెక్ట్ ఎంటర్ టైనర్ 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials