Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

మరికాసేపట్లో అండర్ 17 సాకర్ ప్రపంచకప్‌ ప్రారంభం

FIFA-U-17-World-Cup:India-gear-up-for-first-game-against-USA
Posted: 289 Days Ago
Views: 323   

క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో మూడు వారాల పాటు సాకర్ సంగ్రామం అభిమానులను అలరించబోతోంది. తొలిసారి ఫిఫా మెగా టోర్నీలో బరిలోకి దిగుతోన్న భారత్ ఫుట్‌బాల్‌కు ఇది సరికొత్త చరిత్రగానే చెప్పాలి. ఆతిథ్య హోదాలో నేరుగా టోర్నీలో ఆడుతోన్న మన జట్టుపై భారీ అంచనాలు లేవు. అయితే గట్టి పోటీ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేందుకు ఇంతకంటే మంచి అవకాశం మన జట్టుకు దొరకదు. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడనున్న నేపథ్యంలో ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ యువ భారత జట్టును బాగానే సన్నధ్ధం చేసింది. ఆటగాళ్ళకు అంతర్జాతీయ ట్రైనింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు యూరోపియన్ టూర్లకూ పంపించింది. గత రెండేళ్లలో దాదాపు 18 దేశాల్లో పర్యటించిన భారత జట్టు క్లబ్‌ జట్లతో 100కు పైగా మ్యాచ్‌లు ఆడి నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంది.ఆటలో ఎదగడానికి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ టోర్నీ భారత్‌కు ఉపయోగపడుతుందన్నది ఆశల మధ్య ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, బలమైన అమెరికాతో తలపడబోతోంది. కాగా ఆసియాలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచే ఉధ్ధేశంతో గత కొంతకాలంగా ఫిఫా ఆతిథ్య హక్కులను ఆసియా దేశాలకే అప్పగిస్తోంది. దీంతో ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత ఫుట్‌బాల్ సమాఖ్య అన్ని ఏర్పాట్లూ చేసింది. మూడు వారాల పాటు సాగే టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌లు జరగనున్నాయి. సాకర్‌కు క్రేజ్ ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, గోవా, కోచి, గుహవటి, కోల్‌కతాలు వేదికలుగా నిర్ణయించారు. 

ఇదిలా ఉంటే టోర్నీలో యూరోపియన్ టీమ్స్ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, బ్రెజిల్‌, మెక్సికో జట్లపై అంచనాలున్నాయి. బ్రెజిల్‌, స్పెయిన్‌ మధ్య జరిగే మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అక్టోబరు 7న ఈ రెండు బలమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. ఇక అండర్ 17 ప్రపంచకప్‌ను అత్యధికంగా గెలుచుకున్న నైజీరియా మరోసారి టైటిల్‌పై కన్నేసింది. ఇప్పటి వరకూ ఆ జట్టు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిస్తే... మూడు సార్లు టైటిల్ గెలిచిన బ్రెజిల్‌ తర్వాతి స్థానంలో ఉంది. కాగా భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తోన్న ఈ ప్రపంచకప్‌ను 20 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials